AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aamir Khan: తన డ్రీమ్ సినిమానే.. బహుశా చివరి సినిమా అంటున్న అమీర్ ఖాన్.. ఎందుకంటే..

బాలీవుస్ స్టార్ హీరో అమీర్ ఖాన్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి బలమైన ప్రణాళిక వేసుకున్నాడు. అమీర్ నటించిన 'సితారే జమీన్ పర్' త్వరలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంది. అయితే తాజాగా అమీర్ ఖాన్ పంచమ వేదంగా కీర్తించబడే మహాభారత సినిమా గురించి మాట్లాడుతూ సంచలన విషయం ప్రకటించాడు. బహుశా ఇదే తన చివరి చిత్రం అని చెప్పాడు.

Aamir Khan: తన డ్రీమ్ సినిమానే.. బహుశా చివరి సినిమా అంటున్న అమీర్ ఖాన్.. ఎందుకంటే..
Mahabharat
Surya Kala
|

Updated on: Jun 01, 2025 | 4:22 PM

Share

చాలా కాలం తర్వాత అమీర్ ఖాన్ తిరిగి నటించబోతున్నాడు. ‘లాల్ సింగ్ చద్దా’ ఫ్లాప్ తర్వాత.. మళ్ళీ ఇన్ని రోజులకు వెండి తెరపై ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. అమీర్ నటించిన తాజా సినిమా త్వరలో సితారే జమీన్ పర్ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజై అభిమానులను అలరించింది. ఈ సినిమా రిలీజ్ పై ఫోకస్ పెడుతూనే మరోవైపు అమీర్ ఖాన్ తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలో పనులను వేగవంతం చేశాడు. అందులో మహాభారతం అనే కలల ప్రాజెక్టు కూడా ఉంది. ఈ సినిమాకు సంబంధించి కొత్త విషయాలను గురించి చెప్పాడు.

ఇటీవల అమీర్ ఖాన్ రాజ్ షమానీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక అంశాలపై మాట్లాడారు. తన ప్రేమ జీవితం, సినిమాలు, చివరి చిత్రం గురించి అతను ఆశ్చర్యకరమైన విషయాలను చెప్పాడు. మహాభారతం అతని చివరి సినిమా అవుతుందా? అతనే విషయం గురించి కూడా మాట్లాడాడు.

తన చివరి సినిమా గురించి అమీర్ ఖాన్ ఏమన్నాడంటే

ఇవి కూడా చదవండి

ఇటీవల అమీర్ ఖాన్ ను చివరి సినిమా గురించి అడగగా.. మహాభారతం సినిమా తీయాలనేది తన కల అని చెప్పాడు. సితార్ జమీన్ పర్ సినిమా రిలీజ్ అయిన తర్వత మహాభారత సినిమాపై పని చేయడం ప్రారంభిస్తానని చెప్పాడు. జూన్ 20 తర్వాత తాను మహాభారతం సినిమా గురించి పని చేయడం ప్రారంభిస్తానని వెల్లడించాడు. ఇది ఒక భారీ ప్రాజెక్ట్.. మహా భరతం సినిమా చేసిన తర్వాత నే.. ఇక తాను ఏమీ చేయలేనన అనిపించవచ్చు. ఎందుకంటే మహాభారతం లోని విషయం అలాంటిదని చెప్పాడు.

మహాభారతం సినిమా ప్రాజెక్ట్ చాలా భారీ ప్రాజెక్ట్.. అంతేకాదు భావోద్వేగభరితమైనది. ప్రపంచంలో ఉన్నదంతా మహాభారతంలో కనిపిస్తుంది. కనుక ఎవరైనా మీ చివరి క్షణం ఎలా సాగాలి అని కోరుకుంటారని అడిగితే.. నేను పని చేస్తూ చనిపోవాలనుకుంటున్నానని చెప్పాడు. మనమందరం ఇలాగే కోరుకుంటామని అన్నారు. అందుకనే మహాభారతం సినిమా చేసిన తర్వాత.. ఇక నేను ఏమీ చేయనవసరం లేదు అనే భావోద్వేగాన్ని పొందాలని నుకుంటున్నానని చెప్పాడు అమీర్ ఖాన్.

ఆమిర్ ఖాన్ సినిమాలు ఏవి?

సితారే జమీన్ పర్ మాత్రమే కాదు అమీర్ ఖాన్ ప్రస్తుతం సన్నీ డియోల్ చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ‘లాహోర్ 1947’ లో ఆయన అతిధి పాత్రలో నటించనున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. తర్వాత మహాభారతంపై పని చేయనున్నాడు. ఇటీవల అల్లు అర్జున్ .. ఈ మహాభారతం సినిమాలో యాక్ట్ చేయనున్నాడనే వార్తలు వినిపించాయి. అమీర్, అల్లు అర్జున్ కలిసి ఉన్న ఫోటో బయటకు వచ్చినప్పుడు ఈ పుకారు మొదలైంది. అయితే మహాభారతం చిత్రంలో అమీర్ ఖాన్ శ్రీకృష్ణుడి పాత్రను పోషిస్తారని బీ టౌన్ లో టాక్ వినిపిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.