Samantha: మరోసారి రాజ్‌తో కనిపించిన సమంత.. డైరెక్టర్ భార్య సంచలన పోస్ట్
గత కొన్ని రోజులుగా డేటింగ్ రూమర్స్ తో తరచూ వార్తల్లో నిలుస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడుమోరు తో సామ్ ప్రేమలో ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్లకు బలం చేకురుస్తూ మళ్లీ ఇప్పుడు జంటగా కనిపించారు సామ్- రాజ్

టాలీవుడ్ హీరోయిన్ సమంత మళ్లీ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ తో కలిసి కనిపించింది. సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్ట్ ఈ విషయాన్ని బయట పెట్టింది. అందులో జిమ్‌లో వర్కవుట్స్ చేయడంతో పాటు పాటు పికిల్ బాల్ ఆడుతూ కనిపించింది సామ్. అలాగే దర్శకుడు రాజ్ నిడిమోరు కూడా పికిల్ బాల్ ఆడుతూ కనిపించాడు. ఇంకే ముంది.. లా మరోసారి ఇద్దరు కలిసి జంటగా కనిపించడంతో డేటింగ్ రూమర్లు మళ్లీ ఊపందుకున్నాయి. ఇటీవల శుభం సినిమా రిలీజ్ తర్వాత కూడా రాజ్ తో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫొటోను సమంత షేర్ చేసింది. ఆ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడిపోయారంటూ వార్తలొచ్చాయి. ఇప్పుడు మళ్లీ పికిల్ బాల్ ఆడుతూ కనిపించడంతో ఈ డేటింగ్ రూమర్లకు మరింత బలం చేకూరింది. ప్రస్తుతం సామ్- రాజ్ పికిల్ బాల్ ఆడుతోన్న వీడియో నెట్టింట బాగా వైరలవుతోంది. దీనిపై సినీ అభిమానులు, నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.
ఈ వీడియో వైరల్ కాగానే డైరెక్టర్ రాజ్ నిడిమోరు భార్య శ్యామలి కూడా ఒక పోస్ట్ పెట్టింది.. ‘అన్నింటినీ కాలమే నిర్ణయిస్తుంది.. కర్మ వాటిని సరిదిద్దుతుంది.. విశ్వం వినయాన్ని నేర్పిస్తుంది’ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చింది. గతంలో కూడా ఆమె ఎవరీ పేర్లను ప్రస్తావించకుండా సామ్- రాజ్ డేటింగ్ రూమర్లపై ఇలా ఇన్ డైరెక్ట్ గా రియాక్ట్ అయ్యింది. గతంలోనూ పలు సందర్భాల్లో జంటగా కనిపించారు రాజ్- సమంత. అయితే ఇప్పటివరకు తమపై వస్తున్న డేటింగ్ రూమర్లపై ఎవరూ స్పందించలేదు.
సినిమాల సంగతి పక్కన పెడితే.. సమంత, రాజ్ ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్’ అనే కొత్త వెబ్ సిరీస్ కోసం పనిచేస్తున్నారు. ఇందులో ఆదిత్య రాయ్ కపూర్, జైదీప్ అహ్లవత్, వామికా గబ్బి, అలీ ఫజల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోన ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
డైరెక్టర్ రాజ్ తో సమంత..
View this post on Instagram








