కాల్ సెంటర్‌లో జాబ్ మానేసి.. హీరోయిన్ అయ్యింది.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా
కొంతమంది హీరోయిన్స్ ఒకటి రెండు చిత్రాలతో చాలా ఫేమస్ అయిపోతుంటారు. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. అతి తక్కువ సమయంలోనే కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంటారు. కెరీర్ ప్రారంభంలోనే ఇండస్ట్రీలోని స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటారు. కానీ కొంతమంది ముద్దుగుమ్మలకు ఆ తర్వాత అదృష్టం కలిసి రాదు. ఒక్క సినిమాతో ఫేమస్ అయిపోయి వెంటనే కనుమరుగవుతారు.

ఇప్పుడు హీరోయిన్స్ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. పాన్ ఇండియా సినిమాలు చేస్తూ స్టార్ డమ్ ను అందుకుంటున్నారు. అంతే కాదు కొంతమంది హీరోయిన్స్ అవ్వకముందు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఎన్నో ఇబ్బందులను, కష్టాలను ఎదుర్కున్న తర్వాత హీరోయిన్ గా అవకాశాలు అందుకొని.. వచ్చిన ఛాన్స్ లను సద్వినియోగం చేసుకున్నవారు ఎంతో మంది ఉన్నారు. అలాగే కొంతమంది మాత్రం సక్సెస్ సాధించలేకపోయారు. వారిలో ఈ బ్యూటీ ఒకరు. సినిమాల్లోకి రాక ముందు కాల్ సెంటర్ లో పని చేసింది ఈ అమ్మడు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ చిన్నది. బడా హీరోల సరసన సినిమాలు చేసింది. కానీ ఇప్పుడు అదృష్టం కలిసి రాక అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.
ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? అచ్చం కత్రినా కైఫ్ లా ఉండే ఈ బ్యూటీ మరెవరో కాదు జరీన్ ఖాన్. అందాల భామ జరీన్ ఖాన్, మహారాష్ట్రకు చెందింది. ఈ ముద్దుగుమ్మ . హిందీ, తమిళం, తెలుగు, పంజాబీ సినిమాలలో నటించింది ఈ అందాల భామ. 2019లో తెలుగులో వచ్చిన గోపీచంద్ హీరోగా నటించిన చాణక్య సినిమాలో ఏజెంట్ జుబెదా పాత్రను పోషించింది ఈ అమ్మడు.
సల్మాన్ ఖాన్ సహకారంతో జరీన్ ఖాన్ 2010లో వీర్ సినిమాలో యువరాణిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2011లో వచ్చిన కామెడీ బ్లాక్‌బస్టర్ సినిమా రెడీలో ఐటెమ్ సాంగ్ లో స్టెప్పులేసి మెప్పించింది. 2012 రొమాంటిక్ కామెడీ హౌస్‌ఫుల్ 2లో గ్లామరస్ మోడల్ పాత్రతో గుర్తింపు పొందింది ఈ ముద్దుగుమ్మ. 2013లో నాన్ రాజవగా పొగిరెన్ సినిమాలో ఐటెమ్ సాంగ్ మాల్గోవ్‌తో తమిళ సినిమారంగంలోకి ప్రవేశించింది. 2014లో జాట్ జేమ్స్ బాండ్ సినిమాలో ప్రముఖ పాత్రలో నటించి, బాలీవుడ్‌కి తిరిగి ఎంట్రీ ఇచ్చింది. 2015 ఎరోటిక్ థ్రిల్లర్ హేట్ స్టోరీ 3 సినిమాలో నటించింది. 2019లో యాక్షన్ థ్రిల్లర్ చాణక్య సినిమాతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తుంది ఈ అమ్మడు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




