Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tea Side Effects: టీ వల్ల సమస్యల దండయాత్ర.. అధిక వినియోగంతో ఈ ఇబ్బందులు గ్యారెంటీ..!

ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో బయట చల్లగా వర్షం పడితే ఇంట్లో వెచ్చని టీ రుచిన అనుభూతి చెందేవాళ్లు ఎంతో మంది ఉంటారు. మానసిక ప్రశాంతతకు టీ వల్ల చాలా ఉపయోగాలున్నాయని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా టీలో అధిక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

Tea Side Effects: టీ వల్ల సమస్యల దండయాత్ర.. అధిక వినియోగంతో ఈ ఇబ్బందులు గ్యారెంటీ..!
Tea
Srinu
|

Updated on: Jul 20, 2023 | 6:45 PM

Share

టీ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు. మనలో చాలా మంది ఉదయాన్నే లేవగానే టీ తాగడం అనేది ఓ దినచర్యగా మార్చుకుంటారు. అలాగే మధ్యాహ్న సమయంలో పని నుంచి ఉపశమనం కోసం ఎక్కువ మంది టీను తాగుతూ ఉంటారు. ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో బయట చల్లగా వర్షం పడితే ఇంట్లో వెచ్చని టీ రుచిన అనుభూతి చెందేవాళ్లు ఎంతో మంది ఉంటారు. మానసిక ప్రశాంతతకు టీ వల్ల చాలా ఉపయోగాలున్నాయని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా టీలో అధిక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అలాగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయం చేస్తుంది. రోగ నిరోధక శక్తిని బలపర్చడంలో టీ చాలా బాగా ఉపయోగపడుతుంది. కాఫీతో పోలిస్తే టీలో తక్కువ కెఫిన్‌ ఉండడం వల్ల చాలా మంది టీ తాగడాన్ని ప్రోత్సహిస్తారు. అతి ఎప్పుడు ప్రమాదమే అన్నట్లుగా మంచిది కదా టీ ఎక్కువ సార్లు తాగితే చాలా ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి అధికంగా టీ తాగడం వల్ల కలిగే ఇబ్బందులు ఏంటో? ఓ సారి తెలుసుకుందాం.

ఐరన్‌ లోపం

టీలో కెఫిన్‌, టానిన్‌ ఉంటుంది. దాని ఎక్కువగా తీసుకోవడం ఐరన్‌ శోషణ తగ్గుతుంది. అలాగే ఒక్కోసారి ఐరన్‌ శోషణకు అంతరాయం కలిగిస్తుంది. టానిన్లు కొన్ని ఆహారాల్లో ఇనుముతో బంధిస్తాయి.మీ జీర్ణవ్యవస్థ శోషణ అందుబాటులో ఉండదు. అందువల్ల టీ అధికంగా సేవిస్తే ఐరన్‌ లోపం ఏర్పడుతుంది. ఒకవేళ మీరు శాఖాహారులైతే కచ్చితంగా టీ సేవించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 

నిద్రకు ఆటంకం

టీలో అధిక కేఫిన్‌ ఉండడం వల్ల టీను ఎక్కువగా సేవిస్తే నిద్ర చక్రానికి అంతరాయం కలిగిస్తుంది. మెలటోనిన్‌ హర్మోన్‌ ఉత్పత్తి విషయంలో లోటుపాట్లు కారణంగా నిద్ర సమయం తగ్గిపోతుంది. నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల అలసట, బలహీనమైన జ్ఞాపకశక్తి, తగ్గిన శ్రద్ధ అనేక మానసిక సమస్యలకు కారణంగా అవుతుంది. దీర్ఘకాలిక నిద్రలేమి వల్ల ఊబకాయం, రక్తంలో చక్కెర నియంత్రణ సరిగ్గా ఉండదు.

ఇవి కూడా చదవండి

గుండెలో మంట

కెఫిన్‌ గుండెల్లో మంటకు కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. చాలా మందిలో వచ్చే యాసిడ్‌ రిఫ్లక్స్‌ను ముందస్తు లక్షణాలను పెంచుతుంది. కెఫిన్‌ మీ అన్న వాహికను మీ నుంచి వేరుచేసే స్పింక్టర్‌ను దెబ్బతీస్తుంది. 

దీర్ఘకాలిక తలనొప్పి

రోజంతా టీ సిప్‌ చేస్తూనే ఉన్న వారు తీవ్రమైన తలనొప్పితో బాధపడతారు. సోడా, కాఫీతో పోల్చుకుంటే టీలో తక్కువ కెఫిన్‌ ఉన్నప్పటికీ ఓ కప్పు టీలో 60 ఎంజీ కెఫిన్‌ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కీడు చేస్తుంది. 

తల తిరగడం

ఏదైనా సమస్య వల్ల మనకు అధికంగా మైకం ఉంటే అది కూడా అధిక టీ వినియోగం కారణం కావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా 400-500 ఎంజీల కెఫెన్‌ కంటే ఎక్కువ రోజుకు సేవిస్తే ఈ పరిస్థితి వస్తుందని చెబుతున్నారు. అంటే రోజుకు 10 నుంచి 20 సార్లు టీ తాగేవారు చాలా జాగ్రత్తపడాలని నిపుణులు సూచన.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..