Tea Making Mistakes: చాయ్ చేసేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి.. తెలుసుకోకుండా అలానే టీ చేస్తే అనవసరంగా బాధపడుతారు..
భారతదేశంలో టీని తయారు చేయని ఇల్లు చాలా అరుదుగా ఉంటుంది. కానీ దానిని తయారు చేసేటప్పుడు ప్రజలు తరచుగా కొన్ని పెద్ద తప్పులు చేస్తారని మీకు తెలుసా..

మనలో చాలామంది ‘బెడ్ టీ’తో రోజుని ప్రారంభించి.. రోజంతా అనేక కప్పుల టీని తాగుతుంటారు. చాయ్‌ని ఇష్టపడేవారి సంఖ్య భారతదేశంలోని మిలియన్లలోఉంటుంది. ఇది మన దేశంలో నీటి తర్వాత రెండవ అత్యధిక పానీయంగా ఇదే అని చెప్పవచ్చు. మనం కోరుకున్న రుచిని పొందడానికి ఇంట్లోనే చాయ్ చేసుకోవడానికి ఇష్టపడతాం. అల్లం, నల్ల మిరియాలు, తులసి, ఏలకులు వంటి వాటిని రుచి కోసం టీలో కలుపుతారు. పాలు, పంచదార కలిపిన తేనీటీని అధికంగా తాగడం కూడా అంతే ప్రమాదకరం. కానీ మీరు దానిని తయారు చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తే.. మీరు మరింత బాధపడవలసి ఉంటుంది.
టీ చేసేటప్పుడు అలాంటి పొరపాట్లు చేయకండి
టీ చేయడం కొంతమందికి హాబీ, కానీ ఈ సమయంలో మనం తరచుగా కొన్ని తప్పులు చేస్తాం, అవి సరైనవి కావు. అందులో మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవల్సినవి కొన్ని ఉన్నాయి. అందులో ఇవే..
- చాలా మంది ముందుగా పాలను మరిగించి.. పూర్తిగా మరిగిన తర్వాత అందులో నీళ్లు, పంచదార, టీ ఆకులు కలుపుతారు. ఈ పద్ధతి తప్పు.
- కొంతమందికి స్ట్రాంగ్ టీ తాగాలనే కోరిక ఉంటుంది. అటువంటి సమయంలో, వారు టీని అధికంగా ఉడకబెట్టడం వల్ల ఆరోగ్యానికి హానికరం.
- టీలోని పదార్థాలన్నింటినీ కలిపి ఎక్కువ సేపు ఉడకబెట్టడం వల్ల కడుపులో ఎసిడిటీ సమస్య వస్తుంది.
- టీలో చక్కెరను ఎక్కువగా కలుపుకునే వారు, వారి రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఇది భవిష్యత్తులో ఊబకాయం, మధుమేహానికి దారి తీస్తుంది.
టీ చేయడానికి సరైన పద్దతి ఇది..
బ్రిటిష్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్ ప్రకారం, టీ చేయడానికి మొదట 2 పాత్రలను తీసుకోండి. ఒకదానిలో పాలు మరిగించి, మరొకదానిలో నీరు మరిగించాలి. మధ్యమధ్యలో చెంచా సహాయంతో పాలు కలుపుతూ ఉండండి. ఇప్పుడు వేడినీటిలో టీ ఆకులు, చక్కెర కలపండి. మీకు ఇష్టమైన మసాలా దినుసులు కూడా జోడించండి.
రెండు పాత్రలలోని పాలు మరిగే తర్వాత.. నీరు, టీ ఆకులు ఉన్న మిశ్రమంలో ఉడికించిన పాలను కలపండి. దీన్ని మళ్లీ ఉడకబెట్టి, ఆపై గ్యాస్ నుంచి దించి ఒక కప్పులో ఫిల్టర్ చేయండి. ఇలా చేయడం వల్ల పాలు, టీ ఆకులను కలిపి ఎక్కువసేపు ఉడకబెట్టకూడదు. ఎందుకంటే ఇది కడుపు నొప్పిని కలిగిస్తుంది.
Note: ( ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఉంది. టీవీ9 NEWS దానిని ధృవీకరించలేదు.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం