Prediabetes: శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు.. మధుమేహం వస్తుందని హెచ్చరిక
ప్రపంచ వ్యాప్తంగానే కాదు మన దేశంలో కూడా రోజు రోజుకీ షుగర్ వ్యాధి బాధితుల సంఖ్య పెరుగుతోంది. ICMR ప్రకారం దేశంలో 10 కోట్ల మందికి పైగా మధుమేహ రోగులు ఉన్నారు. జనాభాలో ఎక్కువ భాగం కూడా ప్రీ-డయాబెటిస్ దశలో ఉన్నారు. అంటే ఈ వ్యక్తులకు మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి శరీరంలోకి వచ్చే ముందు.. అనేక రకాల సంకేతాలు కనిపిస్తాయి. వీటిని సకాలంలో గుర్తించడం వలన అనేక సమస్యలను నివారించవచ్చు. ఈ విషయంపై నిపుణులు చెప్పిన సలహా ఏమిటంటే..
భారతదేశంలో మధుమేహం పెద్ద ఆరోగ్య సమస్యగా మారుతోంది. ఒకప్పుడు వృద్ధులకు మాత్రమే వచ్చే ఈ వ్యాధి ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా వస్తుండడంతో అందరూ భయపడుతున్నారు. శరీరంలో చక్కెర స్థాయి పెరగడం వల్ల మధుమేహం వస్తుంది. కొంతమందికి జన్యుపరమైన కారణాల వల్ల ఈ వ్యాధి వస్తుంది. దీనినే టైప్-1 డయాబెటిస్ అంటారు. అయితే కొంత మందికి చెడు జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి కారణంగా షుగర్ వ్యాధి బారిన పడతారు. దీనినే టైప్-2 అంటారు. నేటి కాలంలో జీవనశైలి, తినే ఆహారం వంటి కారణాల వల్ల షుగర్ లెవెల్ పెరుగుదల ఎక్కువగా కనిపిస్తోంది.
మధుమేహం కూడా శరీరంలోని ప్రతి అవయవానికి హాని కలిగించే వ్యాధి. దీని వల్ల కళ్లు, మూత్రపిండాలు, కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంది. షుగర్ లెవెల్ పెరగడం అనేది చాలా సందర్భాలలో తెలియదు. శరీరంలో షుగర్ లెవెల్ పెరగడం మొదలైంది అని కూడా గుర్తించరు. అటువంటి పరిస్థితిలో మధుమేహం ప్రారంభ లక్షణాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.
మధుమేహం ప్రారంభ లక్షణాలు ఏమిటంటే..
అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం డయాబెటిస్ అనేది శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని పెంచే వ్యాధి. మధుమేహం రాకముందే శరీరంలో అనేక లక్షణాలు కనిపిస్తాయి. ఇది సాధారణంగా పెరుగుతున్న చక్కెర స్థాయిని సూచిస్తుంది.
విపరీతమైన దాహం, తరచుగా మూత్రవిసర్జన.
ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తే లేదా మూత్రం ఇన్ఫెక్షన్ , ఎక్కువ దాహం వేసినా, బరువు తగ్గడం కూడా షుగర్ స్థాయిని పెంచడానికి సంకేతం కావచ్చు. అంతేకాదు బరువు తగ్గడం, చర్మంపై మచ్చలు కూడా అధిక చక్కెర స్థాయికి ప్రారంభ లక్షణాలు. ఈ లక్షణాలు కనిపిస్తే అసలు నిర్లక్ష్యం చేయవద్దు.
ఇలాంటి వారికి మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువ
అధిక బరువు ఉన్న వ్యక్తులు, ధూమపానం, మద్యం సేవించే వారికి మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఊబకాయం, మధుమేహం మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది. ఊబకాయం ఉన్నవారిలో ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఫిట్ వ్యక్తుల కంటే చాలా రెట్లు ఎక్కువ.
మధుమేహాన్ని ఎలా నివారించాలంటే
తినే ఆహారంలో ఎక్కువ ఆకుపచ్చ కూరగాయలను, పండ్లను చేర్చుకోండి
ప్రతిరోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం చేయండి.
తినే ఆహారంలో విటమిన్ డి ఉన్న ఆహారం చేర్చుకోండి.
ప్రతిరోజూ కనీసం ఏడెనిమిది గంటలు నిద్రపోండి
రోజూ ధ్యానం చేయండి
ఫాస్ట్ ఫుడ్ తినే అలవాటు ఉంటే వెంటనే మానుకోండి
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి