AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamarind Water: చింతపండు రసం తరచూ తీసుకుంటే శరీరంలో ఏమౌతుందో తెలుసా..?

చింతపండును భారతీయ ఖర్జూరంగా పిలుస్తారు. తీపి, పులుపు రుచితో ఉండే చింతపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. చింతపండు రసంను తరచూ తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగుపరుస్తుంది.శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. చింతపండు రసంతో కలిగే మరిన్ని లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Nov 23, 2024 | 5:54 PM

Share
చింతపండులో విటమిన్ బి, సి,  యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం, ఐరన్‌ పుష్కలంగా లభిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి తగ్గిస్తుంది. చింతపండు జీర్ణ సమస్యలకు సహజ నివారణగా ఉపయోగిస్తారు. ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. చింతపండు రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.

1 / 5
ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయడుతుంది. చింతపండులో పాలీఫెనాల్స్, బయోఫ్లవనాయిడ్స్ వంటి శోథ నిరోధక సమ్మేళనాలు పుష్కలం. చింతపండు రసం శరీరంలో మంటను అరికట్టడంలో గొప్పగా పనిచేస్తుంది. చింతపండులో మెగ్నీషియం ఎముకలు ఏర్పడటంలో, గుండె లయను నియంత్రిస్తుంది.

2 / 5
చింతపండు నీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గడానికి ఇది అద్భుతమైన పానీయం. చింతపండు నీటికి ఆకలిని అణిచివేసే సామర్ధ్యం ఉంది. ఇందులో హెచ్‌సిఎ ఉండటం వల్ల మెదడులో సెరోటోనిన్ స్థాయిలను పెంచడం ద్వారా ఆహార కోరికలను తగ్గిస్తుంది. ఇది అతిగా తినే కోరికలను తగ్గిస్తుంది. దీంతో బరువు పెరగకుండా అడ్డుకుంటుంది.

3 / 5
చింతపండు నీరు తాగడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది. చింతపండులో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. మలబద్దకాన్ని నివారించడంలో చింతపండు మంచిది. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ మీ శరీరం పోషకాలను సమర్ధవంతంగా గ్రహించడంలో సహాయపడుతుంది. ఇది మీ శరీరం నుండి వ్యర్థాలను తొలగిస్తుంది. బరువు తగ్గడంలో మేలు చేస్తుంది.

4 / 5
చింతపండులో హైడ్రాక్సీసిట్రిక్ యాసిడ్ (HCA) పుష్కలంగా ఉంటుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. చింతపండు నీటిని క్రమం తప్పకుండా తాగడం ద్వారా మీరు మీ జీవక్రియ రేటును పెంచుకోవచ్చు. క్యాన్సర్‌తో సహా దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.  చింతపండు నీరు ఒక సహజమైన డిటాక్స్ డ్రింక్. ఇది శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది.

5 / 5