Uttar Pradesh: పెళ్లి ఊరేగింపులో తృటిలో తప్పిన ప్రమాదం.. వరుడు దిగిన వెంటనే దగ్ధమైన బండి..
పెళ్లి ఊరేగింపులో తృటిలో భారీ ప్రమాదం తప్పింది. శుక్రవారం జరిగిన ఓ వివాహ వేడుకలో బాణాసంచా కలుస్తున్న సమయంలో వరుడి బండి మంటల్లో చిక్కుకుంది. యూపీ నోయిడాలోని సెక్టార్-34లో ఉన్న ఆరావళి అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగింది. ఈ మేరకు స్థానికులు జిల్లా మెజిస్ట్రేట్‌కు లేఖ రాశారు. నోయిడాలో సంతోషకరమైన సమయంలో బాణసంచా కాల్చడాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో జరిగిన ఓ వివాహ వేడుకలో ఘోర ప్రమాదం తప్పింది. వధువు ఇంటికి వచ్చిన వరుడికి, అతిధులకు వెల్కం చెప్పడానికి బాణసంచా కాల్చారు. పెళ్లి ఊరేగింపు వధువు గుమ్మం వద్దకు చేరుకోగానే వరుడు గుర్రపు బండి దిగిపోయాడు. అయితే పెళ్లి కొడుకు బండి దిగన వెంటనే ఆ బండి కాలిపోయింది. అందులో మంటలు చెలరేగాయి. బాణసంచా కాల్చడం వల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వరుడితో సహా పెళ్లి ఊరేగింపులో వచ్చిన అతిధులు తృటిలో ప్రాణాపాయాన్ని తప్పించుకున్నారు.
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ జిల్లా మేజిస్ట్రేట్‌కు లేఖ కూడా రాశారు. నోయిడాలోని సెక్టార్-34లో ఉన్న ఆరావళి అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగింది. శుక్రవారం రాత్రి ఇక్కడ ఓ వివాహ వేడుకలో బాణాసంచా కాల్చిన ఘటన స్థానికులను కలవరపాటుకు గురి చేసింది. పెళ్లి ఊరేగింపుకు ఘనంగా స్వాగతం పలికే సమయంలో బాణాసంచా కాల్చడం వల్ల వరుడు దిగిన వెంటనే ప్రమాదం జరగడంతో ఈ సమస్య తీవ్రతను మరింత పెంచింది.
ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకుని నోయిడాలో పెళ్ళిళ్ళ సమయంలో బాణసంచా కాల్చడాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఆరావళి అపార్ట్‌మెంట్‌కు చెందిన ఆర్‌డబ్ల్యుఎ జిల్లా మేజిస్ట్రేట్‌కు లేఖ రాసింది. ప్రస్తుతం నోయిడాలో వాయు కాలుష్యం స్థాయి ప్రమాదకర పరిస్థితిలో ఉందని అన్నారు. దీని కారణంగా గ్రేప్-4 కూడా అమలులోకి వచ్చిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
బాణాసంచా కాల్చడం వలన నష్టం
ధర్మేంద్ర శర్మ మాట్లాడుతూ ‘పెళ్లి సీజన్‌లో ప్రతిరోజూ వందలాది వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు నియంత్రణ లేకుండా బాణసంచా కాల్చడం జరుగుతుంది. దీని వల్ల వాయుకాలుష్యం పెరగడమే కాకుండా రోజూ గొడవలు, ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. చాలా మంది ప్రమాదానికి గురవతున్నారు. ఈ సమస్య కేవలం కాలుష్యానికి మాత్రమే పరిమితం కావడం లేదు. బాణాసంచా కాల్చడం వల్ల ప్రమాదాలు జరిగి అగ్ని ప్రమాదాల సంఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..