PM Modi: జై మహారాష్ట్ర! అభివృద్ధి గెలిచింది.. సుపరిపాలన గెలుస్తుంది.. ప్రధాని మోదీ సంచలన ట్వీట్

మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ధమాకా విక్టరీ కొట్టింది. ఎన్నడూ చూడని విజయం సాధించింది. ఒకవైపు శివసేన, మరోవైపు NCP చీలిక తర్వాత పరిణామాలు వేగంగా మారాయి. బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించగా.. శివసేన షిండే వర్గం, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం కూడా ఎక్కువ స్థానాల్లో సీట్లు గెలుచుకున్నాయి.

PM Modi: జై మహారాష్ట్ర! అభివృద్ధి గెలిచింది.. సుపరిపాలన గెలుస్తుంది.. ప్రధాని మోదీ సంచలన ట్వీట్
Pm Modi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 23, 2024 | 6:12 PM

మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ధమాకా విక్టరీ కొట్టింది. ఎన్నడూ చూడని విజయం సాధించింది. ఒకవైపు శివసేన, మరోవైపు NCP చీలిక తర్వాత పరిణామాలు వేగంగా మారాయి. బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించగా.. శివసేన షిండే వర్గం, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం కూడా ఎక్కువ స్థానాల్లో సీట్లు గెలుచుకున్నాయి. దీంతో మహాయుతి కూటమి తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకుంది. మహారాష్ట్రలో బీజేపీ 149 స్థానాల్లో పోటీ చేసింది. అందులో 132 స్థానాల్లో ఆధిక్యత కనబర్చింది.. అంటే పోటీ చేసిన చాలా స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. శివసేన షిండే వర్గం కూడా 81 స్థానాల్లో పోటీ చేసి 56 స్థానాల్లో, ఎన్సీపీ అజిత్‌పవార్‌ వర్గం 59 స్థానాల్లో పోటీ చేసి 41 స్థానాల్లో ఆధిక్యత కనబర్చింది.. మహావికాస్ అఘాడీ కూటమి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది.. కాంగ్రెస్‌ 101 స్థానాల్లో పోటీ చేసి 16 స్థానాల్లో మాత్రమే ఆధిక్యత కనబర్చింది. శివసేన ఉద్దవ్‌ వర్గం 95 సీట్లలో పోటీ చేసి 20 స్థానాల్లో ఆధిక్యత సాధించింది. ఇక శరదపవార్‌ పార్టీ ప్రదర్శన చాలా ఘోరంగా పడిపోయింది.. 86 స్థానాల్లో పోటీ చేసి కేవలం 10 స్థానాల్లో మాత్రమే ఆధిక్యత సాధించింది.. మొత్తానికి బీజేపీ హవా ముందు కాంగ్రెస్ కూటమి చతికలపడిపోయింది.

ప్రధాని మోదీ సంచలన ట్వీట్..

మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఈ సందర్భంగా సంచలన ట్వీట్ చేశారు. అభివృద్ధి గెలిచింది.. సుపరిపాలన గెలిచింది అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.

‘‘అభివృద్ధి గెలిచింది.. సుపరిపాలన గెలుస్తుంది!.. ఐక్యంగా మేము మరింత ఎత్తుకు వెళ్తాము..

NDAకి చారిత్రాత్మక విజయం ఇచ్చినందుకు మహారాష్ట్రలోని నా సోదరీమణులు – సోదరులకు, ముఖ్యంగా రాష్ట్ర యువత, మహిళలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ఆప్యాయత.. విజయం అసమానమైనది.

మహారాష్ట్ర ప్రగతికి మా కూటమి నిరంతరం కృషి చేస్తుందని నేను ప్రజలకు హామీ ఇస్తున్నాను. జై మహారాష్ట్ర!’’

అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు..

మోదీ ట్వీట్..

మర్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు