Psychology: మీ చేతలే కాదు మీ చేతులూ.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తాయ్..! ఎలాగంటే..
మనం సంఘజీవులం. ఒంటరిగా అడవిలో చెట్టులా ఉండలేం. అందుకే సభ్యత సంస్కారాల నడుమ కుటంబ జీవనాన్ని సాగిస్తుంటాం. కానీ మనుషులందరి ప్రవర్తన ఒకేలా ఉండదు. ఎవరి వ్యక్తిత్వం వారిది. అయితే ఒక వ్యక్తిని కలిసిన వెంటనే, చూసిన వెంటనే అతని వ్యక్తిత్వాన్ని అంచనా వేయలేం. నిజానికి, ఒక వ్యక్తిని పూర్తిగా తెలుసుకోవాలంటే ఒక జీవితకాలం సరిపోదు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ తమ చుట్టూ ఉంటే పరిస్థితులను బట్టి తమ వ్యక్తిత్వాన్ని మార్చుకుంటూ ఉంటారు. అయితే వ్యక్తులను ఇలా సుదీర్ఘకాలం అధ్యయనం చేయకుండానే కొన్ని సంకేతాల ద్వారా ఇట్టే వారిని అంచనా వేయవచ్చు..

మీరు కూర్చునే విధానం నుంచి నిద్రపోయే విధానం, నడక, మాట, చూపు, డ్రెస్సింగ్ విధానం వరకు ప్రతి ఒక్కటీ మీ వ్యక్తిత్వాన్ని బయటపెడతాయి. అలాంటి సంకేతాలు మీ చేతులు కూడా ఇస్తాయి. ఎలాగంటే.. మీ రెండు చేతులను దగ్గరగా చేర్చినప్పుడు వాటిని మీరు ఎలా పట్టుకుంటారో దాన్ని బట్టి మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు. ముఖ్యంగా మీ బొటనవేలు పొజిషన్ ఆధారంగా మీ వ్యక్తిత్వం ఇట్టే చెప్పేయొచ్చు. ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం..
కుడిచేతి బొటనవేలు ఎడమచేతి బొటనవేలు పైన ఉంటే..
రెండు చేతులు కలిపి ముడిచినప్పుడు కుడిచేతి బొటనవేలు ఎడమచేతి బొటనవేలు పైన ఉంటే, అటువంటి వ్యక్తులు ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఈ వ్యక్తులు అధిక నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయడానికి ఇష్టపడతారు. వారు ఏ పరిస్థితిలోనైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ వ్యక్తులు చాలా ముందుచూపు కలిగి ఉంటారు. అందువల్ల వ్యాపారాలలో లాభాలు, నష్టాలను అంచనా వేసే సామర్థ్యం వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరు తమ జీవిత రహస్యాలను ఎవరికీ చెప్పకుండా తమలోనే దాచుకుంటారు.
ఎడమ చేతి బొటనవేలు కుడి చేతి బొటనవేలు పైన ఉంటే..
బొటనవేలు ఇలా కనిపిస్తే.. ఈ వ్యక్తులు చాలా అరుదుగా పరిగణించబడతారు. తమకు అనిపించే విషయాలను నేరుగా చెప్పే స్వభావం వీరిది. అందరితో తమ భావోద్వేగాలను పంచుకునే స్వభావం వీరికి ఉంటుంది. వీరు దయగలిగిన వారు. ఎల్లప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. తమ చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. ఈ వ్యక్తులు ఎల్లప్పుడూ కష్టంలో ఉన్నవారి వెనుక నిలబడతారు. క్లిష్టపరిస్థితుల్లో మంచి సలహాలు ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటారు.
రెండు చేతుల బొటనవేళ్లు నిటారుగా ఉంటే..
రెండు చేతుల బొటనవేళ్లు నిటారుగా ఉంటే.. ఇలాంటి వారు అందరి మాట వింటారు. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరు నిజాయితీపరులు. ముక్కుసూటి మాటల కారణంగా అందరూ వీరిని దూరంపెడతారు. ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తాడు. వీరు ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు. ఈ వ్యక్తులలో స్పష్టమైన, నిజాయితీగల సంభాషణ ప్రత్యేకంగా కనిపిస్తుంది. వీరు చిన్న విషయాలకు కూడా ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో కూడా వీరు ప్రతి విషయాన్ని ప్రశాంతంగా నిర్వహిస్తారు. ఇలాంటి ప్రత్యేక లక్షణాల కారణంగా తమతో ఉన్నవారికి అత్యంత విశ్వాసపాత్రులు, నిబద్ధత కలిగిన వారిగా ఉంటారు.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.