Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రద్దీ మార్కెట్లో మహిళను అసభ్యంగా తాకిన ఆకతాయి.. ఆ తర్వాత జరిగిందిదే! వీడియో

రద్దీ ప్రదేశాల్లో అమ్మాయిలను వేధించే ఆకతాయిలకు ఈ వీడియో చెంపపెట్టు వంటిది. బిజీ మార్కెట్‌లో మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తికి మహిళ బలేగా బుద్ధి చెప్పింది. చిర్రెత్తిపోయిన మహిళ సదరు వ్యక్తి కాలర్‌ పట్టుకుని తుక్కురేగ్గొట్టింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..

Viral Video: రద్దీ మార్కెట్లో మహిళను అసభ్యంగా తాకిన ఆకతాయి.. ఆ తర్వాత జరిగిందిదే! వీడియో
Woman Slaps Man For Harassing
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 02, 2025 | 8:18 AM

కాన్‌పూర్, ఫిబ్రవర 28: రద్దీ ప్రదేశాల్లో ఆకతాయిలు కొందరు అమ్మాయిలను వేధించడం నానాటికీ పెరిగిపోతుంది. ఎన్నిసార్లు చితక్కొట్టినా, ఎన్ని రకాలుగా హెచ్చరించినా వీళ్లలో అస్సలు మార్పు కానరావడం లేదు. తాజాగా ఓ బిజీ మార్కెట్‌లో ఓ ఆకతాయి మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. అంతే.. చిర్రెత్తిపోయిన మహిళ సదరు వ్యక్తి కాలర్‌ పట్టుకుని తుక్కురేగ్గొట్టింది. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని బెకన్‌గంజ్ మార్కెట్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకెళ్తే..

ఈ వీడియోలో బిజీ మార్కెట్లో బుర్ఖా ధరించిన మహిళ పండ్ల దుఖాణం వద్ద నిలబడి ఉండటం కనిపిస్తుంది. ఇంతలో ఆమె వెనుకగా వచ్చిన ఓ వ్యక్తి ఆమెను అనుచితంగా తాకేందుకు యత్నించాడు. దీంతో ఆ మహిళ పట్టరాని కోపంతో ఆ వ్యక్తి కాలర్ పట్టుకుని చెంపపై వాయించడం కనిపిస్తుంది. ఇలా కేవలం 48 నిమిషాల్లో ఏకంగా 14 సార్లు చెంపదెబ్బలు కొట్టింది. అయితే ఆమె కొట్టే దెబ్బలు తట్టుకోలేక మార్కెట్లో చోద్యం చూస్తున్న వారిని సాయం కోరగా.. ఎవరూ స్పందించలేదు. దీంతో ఆ మహిళ కింద పడేసి చితక్కొట్టడం వీడియోలో కనిపిస్తుంది. సదరు వ్యక్తి మార్కెట్‌లో మహిళలను తరచూ వేధిస్తున్నాడని స్థానికులు పలువురు తెలిపారు. దీంతో చుట్టూ ఉన్న జనాలు నిందితుడి ప్రవర్తనను ఖండిస్తూ ఆ మహిళకు మద్దతు ఇవ్వడంతో చివరికి చేసేదిలేక.. మహిళ పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు. ఆమె అతన్ని వదిలేయడంతో వెనక్కి చూడకుండా అక్కడి నుంచి ఉడాయించాడు.

ఇవి కూడా చదవండి

ఈ సంఘటన ఫిబ్రవరి 25న జరిగగా.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానిక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని బజారియా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసిస్తున్న దివంగత అబ్దుల్ మబూద్ కుమారుడు అద్నాన్‌గా గుర్తించామన్నారు. నిందితుడి మానసిక పరిస్థితి స్థిరంగా లేదని, చికిత్స పొందుతున్నాడని అతని కుటుంబం తెలిపినట్లు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అన్వర్‌గంజ్ తెలిపారు. దర్యాప్తు అనంతరం తదుపరి చర్యలు చేపడతామన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.