అయ్యో దేవుడా.. అయ్యప్ప దర్శనానికి వెళ్లి వస్తుండగా ఊహించని ఘటన.. సెకన్ల వ్యవధిలోనే..
అయ్యప్ప స్వామి దర్శనం పూర్తి చేసుకొని ప్రైవేట్ ట్రావెల్స్‌లో.. భక్తులతో కలిసి కన్యాకుమారికి వెళ్లారు సత్యనారాయణ, రమ దంపతులు.. కన్యాకుమారిలో సముద్రస్నానం ముగించుకుని రోడ్డు దాటుతుండగా.. వేగంగా వచ్చి ఢీకొట్టింది గుర్తు తెలియని వాహనం. ప్రమాదంలో సత్యనారాయణ, రమాదేవి దంపతులు అక్కడికక్కడే చనిపోయారు. వీరి మృతదేహాలను కన్యాకుమారి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మరణంలోనూ భార్యభర్తల బంధం వీడలేదు.. అయ్యప్ప స్వామి మాల ధరించిన దంపతులు.. తెలంగాణ నుంచి శబరిమల దర్శనానికి వెళ్లారు.. అయ్యప్ప దర్శనం అనంతరం తిరిగివస్తుండగా.. తమిళనాడు కన్యాకుమారి పర్యటనకు వెళ్లారు.. ఇక్కడ జరిగిన ఊహించని ప్రమాదంతో ఇద్దరూ చనిపోయారు.. రోడ్డు దాటుతుండగా.. ఓ వాహనం ఢీకొనడంతో ఇద్దరూ మరణించారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. శబరిమల యాత్రకు వెళ్లిన లక్సెట్టిపేట పట్టణానికి చెందిన సత్యనారాయణ జనరల్ స్టోర్ యజమాని పాలకుర్తి సత్యనారాయణ (63), ఆయన భార్య రమాదేవి (59) రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే చనిపోయారు. అయ్యప్ప మాలలో ఉన్న ఈ దంపతులు ఈనెల 8 న కోరుట్ల నుండి 30 మంది బృందంతో కలిసి శబరిమల యాత్రకు ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ లో బయలు దేరారు.
ఈనెల 14న బుధవారం అయ్యప్ప స్వామిని దర్శించుకున్న భక్తులు తిరిగి కన్యకుమారి పర్యటనకు బయలుదేరారు. గురువారం రాత్రి కన్యాకుమారిలో సముద్ర స్నానం చేశారు.. అయితే.. స్నానమాచరించిన సత్యనారాయణ.. ఆయన భార్య రమాదేవి.. బస్ ఎక్కేందుకు రోడ్ దాటుతున్నారు. ఈ క్రమంలోనే.. ఓ ప్రైవేట్ ఆటో వారిని బలంగా ఢీకొట్టింది.. దీంతో తీవ్రగాయాల పాలైన దంపతులిద్దరు అక్కడికక్కడే చనిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కన్యాకుమారి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం దంపతుల మృతదేహాలను లక్సెట్టిపేట పట్టణానికి తరలించనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
