సంతానోత్పత్తికి సూపర్ పవర్.. పిల్లల్ని కనాలనుకునే వారికి ఈ పండు ఓ వరం..
వాస్తవానికి శీతాకాలంలో, ప్రతి ఒక్కరి రోగనిరోధక శక్తి సాధారణంగా బలహీనపడుతుంది. ఇది అనేక వ్యాధులకు దారితీస్తుంది. హార్మోన్లు తగ్గుతాయి.. పురుషులు, స్త్రీలలో సంతానోత్పత్తి తగ్గుతుంది. కొత్తగా పెళ్లైన లేదా పిల్లలు కనాలనుకునే జంటకు సంతానోత్పత్తి తక్కువగా ఉంటే, పిల్లలు పుట్టడం ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది.

ఉరుకులు పరుగుల జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. ముఖ్యంగా.. తీసుకునే ఆహారం.. అవలంభిస్తున్న జీవనశైలి మన ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది.. క్రమంగా.. ఎన్నో వైద్య పరిస్థితులకు దారితీస్తుంది.. ముఖ్యంగా.. పెళ్లైన తర్వాత బిడ్డ పుట్టాలనుకునుకుంటారు.. దీని కోసం ఎన్నో కలలు కంటారు.. కానీ.. ప్రస్తుత కాలంలో సంతానోత్పత్తి అనేది పెను సమస్యగా మారుతోంది.. ఇది ఇద్దరిలో లోపం వల్ల కూడా కావొచ్చు..
వాస్తవానికి శీతాకాలంలో, ప్రతి ఒక్కరి రోగనిరోధక శక్తి సాధారణంగా బలహీనపడుతుంది. ఇది అనేక వ్యాధులకు దారితీస్తుంది. హార్మోన్లు తగ్గుతాయి.. పురుషులు, స్త్రీలలో సంతానోత్పత్తి తగ్గుతుంది. కొత్తగా పెళ్లైన లేదా పిల్లలు కనాలనుకునే జంటకు సంతానోత్పత్తి తక్కువగా ఉంటే, పిల్లలు పుట్టడం ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో ఆహారం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.. సంతానోత్పత్తి కోసం మేలు చేసే ఆహారాలలో ఖర్జూరం ఒకటి.. ఇది ఫెర్టిలిటిని పెంచడంతోపాటు.. శరీర ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది..
సంతానోత్పత్తికి ఖర్జురాలు ఎలా మేలు చేస్తాయంటే..

Dry Dates
ఖర్జూరాలు శరీరానికి చాలా ప్రయోజనకరమైన పండు. ఎందుకంటే ఆయుర్వేదంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది.. ఖర్జూరాలు శరీరం నుండి వాత మలినాలను తొలగించడంలో సహాయపడతాయి. అవి పురుషులు, స్త్రీలలో సంతానోత్పత్తిని పెంచుతాయి.
ఖర్జూరాలు ఫైబర్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉండే పోషకమైన పండు.
ఈ పండులోని పోషకాలు మహిళల్లో ఋతుచక్రాన్ని క్రమబద్ధీకరించడంలో, సరైన సమయంలో అండోత్సర్గము జరిగేలా చూసుకోవడంలో సహాయపడతాయి. దీనివల్ల గర్భం సులభతరం అవుతుంది.
కొంతమంది స్త్రీల గర్భాశయం తగినంత బలంగా ఉండదు.. దీని వలన గర్భస్రావం జరుగుతుంది. ఇది శీతాకాలంలో ఎక్కువగా జరుగుతుంది.
స్త్రీలలో గర్భాశయ కండరాలు బలంగా మారుతాయి. ఖర్జూరాలు గర్భాశయానికి పిండం పెరగడానికి శక్తిని ఇస్తాయి.
సంతానం కావాలనుకునే వారు రెండు ఖర్జూరాలను రాత్రిపూట తినాలి. పురుషులు కూడా తినడం వల్ల వారిలో శక్తి పెరుగుతుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




