Parenting Tips: చదువుకునే వయసులో టీనేజ్ లవ్.. తప్పుదోవ పట్టకుండా పిల్లల్ని ఎలా గైడ్ చేయాలి?
టీనేజ్.. ఇది పిల్లలు శారీరక, మానసిక, భావోద్వేగ మార్పులు చోటు చేసుకునే దశ. శారీరక మార్పులతో పాటు హార్మోన్ల కారణంగా భావోద్వేగాలలో కూడా కొన్ని మార్పులు వస్తాయి. ఈ దశలో పిల్లలు ప్రేమ వైపు ఆకర్షితులవుతారు. ముఖ్యంగా కొంతమంది పిల్లలు ప్రేమ విషయంలో దారితప్పి వారి చదువులను, మంచి భవిష్యత్తును నాశనం చేసుకుంటూ ఉంటారు.

పిల్లల జీవితంలో యుక్తవయస్సు అనేది కీలక దశ. ఈ దశలో శారీరక, మానసిక, భావోద్వేగ మార్పులు చోటు చేసుకుంటాయి. శారీరక మార్పులతో పాటు హార్మోన్ల కారణంగా భావోద్వేగాలలో కూడా కొన్ని మార్పులు వస్తాయి. ఈ దశలో పిల్లలు ప్రేమ వైపు ఆకర్షితులవుతారు. ముఖ్యంగా కొంతమంది పిల్లలు ప్రేమ విషయంలో దారితప్పి వారి చదువులను, మంచి భవిష్యత్తును నాశనం చేసుకుంటూ ఉంటారు. ఇటువంటి పరిస్థితిలో తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని టీనేజ్ పిల్లలకు కొంత మార్గదర్శకత్వం ఇవ్వడం చాలా ముఖ్యం. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
పిల్లలు ప్రేమలో పడకుండా ఉండాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలి?
పిల్లలతో ఓపెన్‌గా మాట్లాడగలగాలి
పిల్లలతో కఠినంగా ఉండటానికి బదులుగా, వారితో అన్ని విషయాలు ఓపెన్‌గా మాట్లాడగలిగే స్వేచ్ఛ ఉండాలి. ప్రతిరోజూ స్కూల్, కాలేజీల్లో ఏం జరిగిందో వారిని స్నేహపూర్వకంగా అడగాలి. అప్పుడు పిల్లలు కూడా మీతో కలుపుగోలుగా మాట్లాడటానికి ఇష్టపడతారు. వారు టీనేజ్‌లో ప్రేమ వైపు ఆకర్షితులైతే, వారిని తిట్టడానికి బదులుగా.. మంచి మార్గంలో నడిపించడం ద్వారా వారి మనసు మార్చడానికి ప్రయత్నించాలి.
ప్రాధాన్యతల గురించి వివరించాలి
తల్లిదండ్రులు తమ టీనేజ్ పిల్లలకు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలో చెప్పాలి. ఈ వయస్సులో విద్య, భవిష్యత్తు వారి ప్రధాన ప్రాధాన్యతలుగా ఉండాలని చెప్పగలగాలి. వారికి ప్రేరణాత్మక కథలు, కష్టపడి పనిచేయడం, లక్ష్యాలను సాధించడం వంటి వాటి ముఖ్యమైన జీవిత విలువల ప్రాముఖ్యతను చెప్పాలి. అంతేకాకుండా తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రేమ, స్నేహం మధ్య వ్యత్యాసాన్ని వివరించాలి. వారిని మానసికంగా బలంగా మార్చడానికి క్రీడలు, కళలు, సామాజిక కార్యకలాపాలు వంటి సానుకూల కార్యకలాపాలలో పాల్గొనేలా చేయాలి.
తల్లిదండ్రులు మార్గదర్శకులుగా మారాలి
తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి స్నేహితులు, మార్గదర్శకులుగా ఉండాలి. తమ పిల్లల పట్ల సరైన మార్గదర్శకత్వం, స్నేహపూర్వకంగా వ్యవహరించడం ద్వారా వారు ప్రేమ విషయాలలో తప్పుదారి పట్టకుండా నిరోధించవచ్చు. అలాగే తల్లిదండ్రులు కఠినమైన సలహా ఇచ్చే బదులు పిల్లలతో స్నేహంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. వారి భవిష్యత్తు గురించి వారికి అవగాహన కలిగించే పనులు చేయించాలి. ఈ విధహైన మార్గదర్శకత్వం పిల్లలు ప్రేమలో పడకుండా నిరోధిస్తుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి.