Fish Fry Recipe: ఫిష్ ఫ్రై ని ఇలా చేసుకోండి.. చిరుతిండిగా అందిస్తే లోట్టలేసుకుంటూ తినేస్తారు…
సీ ఫుడ్ ప్రియులు ఎక్కువగా చేపలను ఇష్టంగా తింటారు. చేపలు తినడం వలన అనేక ఆరోగ్యకరమైన మేలు చేస్తాయి. చేపలతో రకరకాల ఆహార పదార్ధాలను తయారు చేస్తారు. వాటిల్లో ఒకటి రుచికరమైన వంటకం చేపల వేపుడు. దీనిని స్నాక్ ఐటెం గా మాత్రమే కాదు రసం, సాంబార్ కి అదనపు రుచి కోసం ఫిష్ ప్రై ని నంజుకుని తినొచ్చు. ఈ రోజు టేస్టీ టేస్టీ ఫిష్ ప్రై తయారీ విధానం గురించి తెలుసుకుందాం..

Fish Fry Recipe
ఏదైనా పార్టీని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తూ.. మంచి ఫుడ్ కోసం చూస్తుంటే.. అది కూడా సులభంగా, రుచికరంగా ఉండే వంటకం కోసం చూస్తున్నట్లయితే.. ఫిష్ ఫ్రై మంచి ఎంపిక. దీన్ని తయారు చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. ఫిష్ ఫ్రై ని తిన్న తర్వాత ఇంటికి వచ్చే అతిథులు మిమ్మల్ని ప్రశంసించకుండా ఉండలేరు. ఫిష్ ఫ్రై తయారు చేయడానికి సులభమైన రెసిపీని తెలుసుకోండి.
కావాల్సిన పదార్ధాలు:
- చేప- 1 కేజీ
- పసుపు- 3 టీస్పూన్లు
- అల్లం పేస్ట్- 2 స్పూన్
- పెరుగు- 2 స్పూన్
- వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు
- ఉప్పు- రుచికి సరిపడా
- నూనె- రెండు కప్పులు
ఇవి కూడా చదవండి
తయారీ విధానం:
- ముందుగా శుభ్రం చేసుకున్న చేప ముక్కలను నీటితో బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక ట్రే తీసుకుని అందులో పెరుగు, వెల్లుల్లి పేస్ట్, అల్లం పేస్ట్, పసుపు, ఉప్పు వేసి వీటిని మిశ్రమంగా బాగా కలపాలి.
- ఈ పేస్ట్ లో చేప ముక్కలు వేసి.. వాటికి ఆ అల్లంవెల్లుల్లి పేస్ట్ పట్టుకునే విధంగా బాగా కలిపి.. మిశ్రమం పట్టించిన చేప ముక్కలను ఒక పక్కకు పెట్టుకోవాలి.
- మ్యారినేట్ చేసిన చేప ముక్కలను అరగంట పాటు పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక డీప్ ఫ్రైయింగ్ పాన్ ని తీసుకుని గ్యాస్ స్టవ్ మీద పెట్టి నూనె వేడి చేసి తక్కువ మంట మీద మ్యారినేట్ చేసిన చేప ముక్కలను ఒక్కొక్కటిగా నూనెలో వేసి వేయించాలి.
- చేపలను రెండు వైపులా తిప్పుతూ కనీసం 10-15 నిమిషాలు వేయించాలి.
- వేయించిన చేప ముక్కలను నూనె నుంచి బయటకు తీసి అదనపు నూనెను తొలగించడానికి టిష్యూ పేపర్ మీద వేయాలి.
- అంతే చేపల ఫ్రై రెడీ. ఈ చేపల వేపుడును వేడి వేడిగా గ్రీన్ చట్నీ, ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేయండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..