- Telugu News Photo Gallery Don Not take these things that belong to others for free, do you know why?
వీటిని ఇతరుల నుంచి ఫ్రీగా తీసుకున్నారో.. కొంపకొల్లేరే! మీరూ ఎవరికీ ఇవ్వకూడదు..
కొంతమంది వంట కోసం ఉప్పు కూడా ఇతరుల నుంచి ఉచితంగా తీసుకుంటూ ఉంటారు. మరికొందరు ఇతరుల బట్టలు తీసుకుంటారు. అయితే వీటిని ఇతరుల నుంచి తీసుకుంటే ఎన్నో అనర్ధాలు జరుగుతాయని శాస్త్ర నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా కొన్ని రకాల వస్తువులను ఇతరుల నుంచి తీసుకుంటే ప్రతికూలత వ్యాప్తి చెందుతుందట. అనారోగ్యం, ఆర్థిక నష్టంతో సహా అనేక సమస్యలు చుట్టుముడతాయట.
Updated on: Jun 18, 2025 | 12:36 PM

చాలా మంది తమ స్నేహితులు, బంధువులు, పొరుగింటి వారు ఇచ్చే కొన్ని వస్తువులను అప్పుగా తీసుకుంటూ ఉంటారు. కొంతమంది వంట కోసం ఉప్పు కూడా ఉచితంగా తీసుకుంటారు. మరికొందరు ఇతరుల బట్టలు తీసుకుంటారు. అయితే వీటిని ఇతరుల నుంచి తీసుకుంటే ఎన్నో అనర్ధాలు జరుగుతాయని శాస్త్ర నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా కొన్ని రకాల వస్తువులను ఇతరుల నుంచి తీసుకుంటే ప్రతికూలత వ్యాప్తి చెందుతుందట. అనారోగ్యం, ఆర్థిక నష్టంతో సహా అనేక సమస్యలు చుట్టుముడతాయట. ఇతరుల బట్టలు అస్సలు ధరించకూడదు. బట్టలు ప్రతికూల శక్తిని కలిగి ఉంటాయి. మీరు వేరొకరి బట్టలు ధరిస్తే, ఆ వ్యక్తి ప్రతికూల శక్తి మీకు వ్యాపించే అవకాశం ఉంది. మరొక కారణం.. వారికి అలెర్జీలు వంటి సమస్యలు ఉంటే ఆ బట్టల ద్వారా మీకు వ్యాపించే అవకాశం ఉంది. శాస్త్రాల ప్రకారం ఎవరి నుంచి కర్చీఫ్‌లు ఉచితంగా తీసుకోకూడదు. బహుమతిగా కూడా ఇవ్వకూడదు. దీనివల్ల గొడవలు, ఉద్రిక్తత, ఆర్థిక నష్టం వంటి సమస్యలు వస్తాయట.

సాధారణంగా వాచ్‌ను అదృష్టంకి సంకేతంగా భావిస్తుంటారు. అందుకే మీరు ధరించే వాచ్ ఇతరులకు ఇవ్వడంల లేదా ఇతరులు ధరించిన వాచ్ మీరు తీసుకోవడం చేయకూడదు. ఇలా చేస్తే వారి ప్రతికూల శక్తిని మీకు వ్యాపింపజేస్తుందని శాస్త్ర నిపుణులు అంటున్నారు. అలాగే చెప్పుడు, బూట్లు వంటివి కూడా ఇతరుల నుంచి తీసుకోకూడదు. అలాగే వాటిని ఇతరుల నుంచి ఉచితంగా తీసుకోకూడదు. ఇది మీరు చేసే పనిలో అడ్డంకులు కలిగించి, లేనిపోని సమస్యలకు దారితీస్తుందట.

ఉప్పును సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. అయితే ఇతరుల నుంచి ఉప్పు ఉచితంగా స్వీకరిస్తే, అది మీ ఇంట్లోకి ప్రతికూల శక్తిని తీసుకొస్తుందట. అందువల్ల ఉప్పును ఉచితంగా స్వీకరించడం వల్ల అప్పులు సహా ఆర్థిక సమస్యలు వస్తాయని నమ్మకం.

పెన్ను జ్ఞానం, అభ్యాసానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. వేరొకరు ఉపయోగించిన పెన్ను ఉపయోగించడం వల్ల అభ్యాసానికి ఆటంకం కలుగుతుంది. పెట్టుబడికి సంబంధించిన విషయాలలో ఆర్థిక నష్టం సంభవించడం వంటివి జరుగుతుంటాయి. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ వేరొకరి పెన్నును ఉపయోగించకూడదు.

ఎవరి దగ్గరా అప్పు తీసుకోకండి. అత్యవసర పరిస్థితిలో మీకు డబ్బు అవసరమైతే, రుణం తీసుకున్న తర్వాత వీలైనంత త్వరగా తిరిగి ఇవ్వడం మంచిది. లేకుంటే అది మీకు దురదృష్టాన్ని తెస్తుంది. ఇతరుల డబ్బును దుర్వినియోగం చేయడం ప్రతికూలతకు సంకేతమని వేదాలు చెబుతున్నాయి.



















