AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oral Hygiene: రోజుకి 2 సార్లు దంతాలు తోముకుంటే నోరు శుభ్రం కాదు.. తప్పనిసరిగా ఈ ఐదు పనులు చేయాల్సిందే..

దంతాలు, చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంచుకోవడం ద్వారా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకోవడం ద్వారా నోటిని పరిశుభ్రంగా ఉంచుకుంటారు. నోటి ఆరోగ్యం మొత్తం శరీర ఆరోగ్యంలో ఒక ముఖ్యమైన భాగం కనుక చిగుళ్ళు, దంతాల సమస్యలను అలాగే నోటి దుర్వాసనను నివారించడానికి ఇతర విషయాలను కూడా గుర్తుంచుకోవాలి. ఈ రోజు నోటి పరిశుభ్రంగా ఉంచుకునేందుకు చేయాల్సిన పనులు ఏమిటో తెలుసుకుందాం..

Oral Hygiene: రోజుకి 2 సార్లు దంతాలు తోముకుంటే నోరు శుభ్రం కాదు.. తప్పనిసరిగా ఈ ఐదు పనులు చేయాల్సిందే..
Oral Hygiene Tips
Surya Kala
|

Updated on: Aug 04, 2025 | 12:15 PM

Share

ఆరోగ్యకరమైన చిగుళ్ళు, బలమైన దంతాల కోసం నోటి పరిశుభ్రతను పాటించడం చాలా ముఖ్యం. చాలా మంది ఉదయం నిద్రలేచిన వెంటనే.. రాత్రి నిద్రపోయే ముందు పళ్ళు తోముకోవాలని వైద్యులు చెబుతున్నారు. అయితే ఉదయం మాత్రమే పళ్ళు తోముకునే వారు చాలా మంది ఉన్నారు. అయితే ఈ చెడు అలవాటు నోటి సమస్యలను కలిగిస్తుంది. రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకునే వ్యక్తులు కొన్ని చిన్న విషయాలను కూడా గుర్తుంచుకోవాలి. నిజానికి ప్రతిరోజూ టూత్ బ్రష్ చేసినా దంతాలు, చిగుళ్ళకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని కొంతమంది ఫిర్యాదు చేస్తూ ఉంటారు. ఈ రోజు నోటి పరిశుభ్రత కోసం బ్రష్ చేయడంతో నోటి పరిశుభ్రతను కాపాడుకోవడానికి ఏమి చేయాలో చేయాల్సిన పనులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

పిల్లలు పెద్దలు అనే తేడా లేదు.. రోజూ రెండు సార్లు దంతాలను శుభ్రం చేసుకోవాలని చెబుతారు. లేకపోతే పళ్ళు పుచ్చిపోతాయి. అందుకనే ఉదయం నిద్రలేచిన తర్వాత, రాత్రి పడుకునే ముందు పళ్ళు తోముకుంటారు. ఇలా చేయడం వలన దంతాలపై పేరుకుపోయిన ఫలకం తొలగిపోతుంది.. నోరు శుభ్రపడుతుంది. అయితే నోరు శుభ్రంగా ఉండాలంటే ఇంకా 5 విషయాలను గుర్తుంచుకోవాలి. అవి ఏమిటంటే..

టూత్ బ్రష్ నిర్వహణ దంతాలు, చిగుళ్ల సమస్యలను నివారించడానికి టూత్ బ్రష్‌ను సరిగ్గా నిర్వహించడం చాలా ముఖ్యం. చాలా మంది దంతాలు శుభ్రం చేసుకున్న తర్వాత టూత్ బ్రష్‌ను బేసిన్ దగ్గర తెరిచి బ్రష్ ని కవర్ చేయకుండా అలాగే విడిచి పెడతారు. ఇలా చేయడం వలన దుమ్ము కణాలు అలాగే అనేక రకాల బ్యాక్టీరియా పెరుగుతాయి. అంతేకాదు ప్రజలు తమ బ్రష్‌ను సరిగ్గా ఆరబెట్టరు. ఒకే టూత్ బ్రష్‌ను నెలల తరబడి ఉపయోగిస్తూ ఉంటారు. ఇలాంటి అలవాట్లని మార్చుకోవాలి. టూత్ బ్రష్‌ను ఎల్లప్పుడూ కవర్ చేసి ఉంచాలి. సుమారు మూడు నెలలకు ఒకసారి అయినా సరే బ్రష్ ని మారుస్తూ ఉండాలి. బ్రష్ ని శుభ్రం చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

నాలుకను నిర్లక్ష్యం చేయకండి. దంతాలను శుభ్రం చేసుకోవడం ఒక్కటే సరిపోదు. మొత్తం నోటిని శుభ్రం చేసుకోవడం అవసరం. నాలుకను శుభ్రం చేసుకోవడం కూడా దీనిలో ఒక ముఖ్యమైన భాగం. దీని కోసం ప్రతిరోజూ నాలుక క్లీనర్‌ను ఉపయోగించి లేదా బ్రష్‌తో తేలికగా రుద్దడం ద్వారా నాలుకను శుభ్రం చేసుకోవచ్చు.

రోజూ ఫ్లాసింగ్ తప్పనిసరి దంతాలను బ్రష్‌తో శుభ్రం చేసుకుంటారు. అయితే కొన్నిసార్లు వాటి మధ్య మురికి దాగి ఉంటుంది. దీనిని క్రమం తప్పకుండా ఫ్లాసింగ్ ద్వారా తొలగించాలి. ఇది దంతాల లోపలి భాగాలపై ఫలకం పేరుకుపోకుండా నిరోధిస్తుంది. నోటి దుర్వాసన రాకుండా చేస్తుంది.

తిన్న తర్వాత నోరుని శుభ్రం చేసుకోవడం ఆహారం తిన్నప్పుడు ఆహార కణాలు దంతాల మధ్య, చిగుళ్ళ చుట్టూ చిక్కుకుపోతాయి. ఇది దంత క్షయం, నోటి దుర్వాసనకు కారణమవుతుంది. కనుక ఏదైనా తిన్న తర్వాత నోటిలో నీరు పోసి.. పుక్కిలి పట్టండి. ఇలా చేయడం ద్వారా నోటిని శుభ్రం చేసుకోవచ్చు.

నీరు త్రాగుతూ ఉండండి ఆరోగ్యకరమైన దంతాలు, చిగుళ్ళ కోసం పుష్కలంగా నీరు త్రాగాలి. నీరు త్రాగుతూ ఉన్నప్పుడు నోటిలో లాలాజల ఉత్పత్తి సరిగ్గా ఉంటుంది. లాలాజలం నోటి పరిశుభ్రతను సరిగ్గా ఉంచడానికి అవసరం. ఇది నోటిని కూడా శుభ్రంగా ఉంచుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)