AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Okra: బెండకాయ ఆరోగ్యానికి మంచిదే.. పొరపాటున కూడా వీటితో కలిపి తినొద్దు.. ఎందుకంటే..

కూరగాయల్లో బెండకాయలో పోషకాలు మెండు. దీనిలో విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు బెండకాయలో ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ సమ్మేళనాలతో పాటుగా యాంటీ ఆక్సిడెంట్లుతో పాటు కరిగే ఫైబర్, సహజ గమ్ ఉన్నాయని నిపుణులు చెప్పారు. అయితే బెండకాయతో పాటు పెరుగు, పుల్లని మజ్జిగ లేదా నిమ్మకాయతో చేసిన గ్రేవీతో తినడం వల్ల కడుపులో గ్యాస్ వస్తుంది. అందువల్ల బెండకాయతో పాటు కొన్నిటిని కలిపి తినొద్దు. ఎందుకంటే..

Okra: బెండకాయ ఆరోగ్యానికి మంచిదే.. పొరపాటున కూడా వీటితో కలిపి తినొద్దు.. ఎందుకంటే..
Okra And Digestion
Surya Kala
|

Updated on: Jun 01, 2025 | 5:19 PM

Share

చాలా మందికి బెండకాయ అంటే ఇష్టం. ఈ కూరగాయ వేసవిలో అందరి ఇళ్లలోనూ సులభంగా దొరుకుతుంది. ఇది అద్భుతమైన పోషకాలతో సమృద్ధిగా ఉండే రుచికరమైన కూరగాయ. బెండకాయ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అయితే బెండకాయని తిన్న వారు కొన్నిటిని తింటే చాలా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. నిజానికి బెండకాయ వండేటప్పుడు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ముఖ్యం. బెండకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే దీనిని సరిగ్గా ఉడికించకపోతే.. దీనిని తిన్న తర్వాత ఆమ్లత్వం లేదా గ్యాస్ సమస్య ఏర్పడవచ్చని ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ కిరణ్ గుప్తా చెప్పారు. అంతేకాదు పొరపాటున కూడా బెండకాయతో పాటు ఏ వస్తువులను తినకూడదో చెప్పారు. ఈ రోజు అవి ఏమిటో తెలుసుకుందాం..

పొరపాటున కూడా బెండకాయతో కలిపి వీటిని తినొద్దు..

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి

మినప పప్పు : బెండకాయ చల్ల దనం కలిగి ఉంటుంది. అయితే మినప పప్పు వేడి స్వభావం కలిగి ఉంటుంది. రెండింటి స్వభావం ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటుంది.. కనుక వీటిని కలిపి తిన్నా.. ఒకదాని తర్వాత వెంటనే ఒకటి తిన్నా.. జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా జీర్ణ సమస్యలు ఉన్నవారు లేదా వృద్ధులు ఈ కలయికను నివారించాలి.

శనగ పిండి: బెండకాయ పిండిలో సహజమైన జిగురు లాంటి పదార్థం ఉంటుంది. ఇది జీర్ణం కావడానికి కొంచెం సమయం తీసుకుంటుంది. శనగ పిండి కూడా బరువైన ఆహార పదార్థం. ఇది కూడా జీర్ణం కావడానికి సమయం పడుతుంది. కనుక ఈ రెండింటినీ కలిపి తింటే కడుపులో జిగట, బరువు పెరుగుతుంది. ఇది మలబద్ధకం లేదా గ్యాస్ సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా వేసవిలో ఈ కలయిక శరీరంలో అసమతుల్యతను సృష్టిస్తుంది.

డ్రై ఫ్రూట్స్: బాదం, జీడిపప్పు, పిస్తా మొదలైన డ్రై ఫ్రూట్స్ శక్తివంతమైనవి, వేడి స్వభావాన్ని కలిగి ఉంటాయి. మరోవైపు బెండకాయ ఒక తేలికైన, చల్లని కూరగాయ. ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల శరీరంలో వేడి, చల్లని శక్తి ఘర్షణకు కారణమవుతుంది. ఇది జీర్ణ ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. అలాగే కొంతమందికి వీటిని కలిపి తినడం వలన అలెర్జీలు లేదా చర్మ సమస్యలు ఏర్పడవచ్చు.

ప్రతి ఆహార పదార్థానికి దాని సొంత ప్రభావం, జీర్ణ ప్రక్రియ ఉంటుంది. కనుక విరుద్ధ స్వభావాలున్న పదార్థాలను కలిపి తిన్నప్పుడు.. అవి శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అందువల్ల బెండకాయను తేలికైన, సరళమైన ఆహారంతో తినడానికి ప్రయత్నించండి. బెండకాయతో మినపప్పు, శనగపిండి లేదా డ్రై ఫ్రూట్స్ లాంటి వాటిని కలిపి తినొద్దు. ఈ అలవాటు మీ జీర్ణక్రియకు , మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)