ఆత్మలు కొంతమందికే ఎందుకు కనిపిస్తాయో తెలుసా?
చాలా మంది హర్రర్ మూవీస్, హర్రర్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఇక ఆత్మల గురించి చెప్పే కథలు వింటుంటే ఆ ఫీలింగ్ చాలా బాగా ఉంటుంది. ఇక చాలా మంది ఆత్మలు గురించి అనేక విషయాలు చెబుతుంటారు. కానీ ఇవి కొంత మందికి మాత్రమే కనిపిస్తుంటాయి. మరి ఎందుకు ఆత్మలు కొందరికే కనిపిస్తాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం.
Updated on: Jun 01, 2025 | 4:59 PM

దెయ్యాలు, ఆత్మలు ఉంటాయని చాలా మంది చెబుతుంటారు. అంతే కాకుండా మనం కూడా అనేక కథలు, సినిమాల్లో చూస్తుంటాం. ఇక విలేజ్‌క వెళ్తే వీటి గురించి చెప్ప కథలు వింటే వణుకు పుట్టాల్సిందే అంతలా చెబుతుంటారు.

ముఖ్యంగా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే చాలు దెయ్యం పట్టిందంటూ తెగ హంగామా చేస్తుంటారు. కానీ కొంత మంది దెయ్యాలు, ఆత్మలు ఏవి ఉండవు అని కొట్టిపారేస్తారు. ఇక ఎవరి నమ్మకం వారిది. కానీ చాలా వరకు దెయ్యాలు కానీ ఆత్మలను కొంత మంది మాత్రమే చూస్తారు. చాలా మందికి దెయ్యాలు కనిపించవు అని చెబుతుంటారు.

అసలు ఎవరికి కనిపిస్తాయంటే? ఆత్మలు కనిపించాలంటే ఆ వ్యక్తి ఇక్కడ ఆత్మ ఉందని గట్టిగా నమ్మాలి. అలాంటి వారికే ఆత్మలు కనిపిస్తాయంటున్నాడు ఒక సామాజిక శాస్త్ర వేత్త.మన ఆలోచనలు,మన అంచనాలు, మనం ఇంద్రియ స్పందన వీట్నింటితో పరిసిరాలలో జరిగే దానిని గుర్తించడందానిపై ఆత్మలు కనిపించడం అనేది ఆధారపడి ఉంటుందంట.

అంటే మనం దెయ్యాలు లేదా ఆత్మలు ఉన్నాయని నమ్మితే అవి ఉన్నట్లు లేకుంటే లేదు. అంటే మీరు ఏదైతే నమ్ముతారో అదే జరుగుతుంది అంటున్నారు శాస్త్రవేత్తలు.ఆత్మలు ఉన్నాయి మన ఇంట్లో తిరుగుతున్నాయని ఇంట్లో ఉన్నవారిలో ఒక వ్యక్తిగా గట్టిగా నమ్మితే తప్పకుండా ఆ వ్యక్తికే ఆత్మలు కనిపిస్తాయంట. లేవు అని కొట్టిపారేసే వారికి అవి కనిపించవంట.

ఇక ముఖ్యంగా ఈ ఆత్మలు, దెయ్యాలు వంటి నమ్మకాలు స్త్రీలలో ఎక్కువగా ఉంటాయంట. వీరు చిన్నతనం నుంచి వీటిపై ఎక్కువ ఆసక్తికనబరచడం వలన వీరు ఇలాంటి వాటికి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఆస్కారం ఉన్నదంటున్నారు మానసిక నిపుణులు.



