oats pancake: ఓట్స్‌తో పాన్‌కేక్‌ చేసి పెట్టండి.. చిన్నారులు ఇష్టంగా తింటారు

ఓట్స్‌ ఆరోగ్యానికి మేలు చేస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఎన్నో మంచి గుణాలు ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడతాయి. అందుకే ఓట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలని చెబుతుంటారు. మరీ ముఖ్యంగా ఓట్స్‌ను టిఫిన్‌గా తీసుకుంటే బరువు అదుపులో ఉండడం మొదలు, ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి...

oats pancake: ఓట్స్‌తో పాన్‌కేక్‌ చేసి పెట్టండి.. చిన్నారులు ఇష్టంగా తింటారు
Oats Pancake
Follow us

|

Updated on: Jun 20, 2024 | 9:29 AM

స్కూల్లు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో ఉదయం లేవగానే పిల్లల్ని స్కూల్లకు పంపడం, వారికి టిఫిన్‌ చేయడం వంటి వాటితో ఇంట్లో బిజీ వాతవరణం నెలకొంది. ఇక చిన్నారులు టిఫిన్‌ విషయంలో మారాం చేస్తుంటారు. దీంతో ఏం టిఫిన్‌ చేయాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అయితే చిన్నారులు ఎంతో ఇష్టంగా తినే ఓ మంచి టిఫిన్‌ ఐడియా గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ఓట్స్‌ ఆరోగ్యానికి మేలు చేస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఎన్నో మంచి గుణాలు ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడతాయి. అందుకే ఓట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలని చెబుతుంటారు. మరీ ముఖ్యంగా ఓట్స్‌ను టిఫిన్‌గా తీసుకుంటే బరువు అదుపులో ఉండడం మొదలు, ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అయితే ఓట్స్‌ను నేరుగా తీసుకోవడానికి చిన్నారులు పెద్దగా ఆసక్తి చూపించరు. అలాంటి వారి కోసం ఓట్స్‌తో పాన్‌కేక్‌ను చేసి పెట్టండి. ఎంతో ఇష్టంగా తింటారు. ఇంతకీ ఓట్స్ పాన్‌ కేక్‌ను ఎలా తయారు చేసుకోవాలి.? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం..

ఓట్స్‌ పాన్‌కేక్‌ను తయారు చేయడానికి ఒక కప్పు ఓట్స్‌, అరకప్పు గోధుమపిండి, అరకప్పు మజ్జిగ, ఒక గుడ్డు, ఒక ఉల్లిపాయ, ఒక క్యారెట్‌, క్యాప్సికం, ఒక స్పూన్‌ బేకింగ్ పౌండర్‌, అరస్పూన్‌ బేకింగ్ సోడా, రుచికి సరిపడా ఉప్పు, అర స్పూన్ జిలకర్ర పొడి, రెండు పచ్చి మిర్చిలు, వేయించుకోవడానికి సరిపడ నూనె కావాల్సి ఉంటుంది.

తయారీ విధానం..

ఇందుకోసం ముందుగా ఓట్స్‌ను తీసుకొని వాటిని మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి. అనంతరం అందులో గోధుమపిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ తరుగు, క్యాప్సికం తరుగు, క్యారెట్ తరుగు వేసి బాగా కలపాలి. ఇప్పుడు మజ్జిగను కూడా వేసి బాగా కలుపుకోవాలి. అనంతరం ఈ మిశ్రమంలో గుడ్డును పగలగొట్టివేసి బాగా కలుపుకోవాలి. అవసరమైతే కొన్ని నీళ్లు కూడా పోసుకోవచ్చు. అనంతరం స్టవ్‌పై పెనం పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వెడెక్కగానే అంతకు ముందు చేసుకున్న మిశ్రమాన్ని ఉతప్పలాగా పెనంపై వేసుకోవాలి. రెండు వైపులా బంగారు రంగులోకి మారే వరకు కాల్చుకోవాలి. అంతే స్పైసీ, క్రిస్పీగా ఉండే ఓట్స్‌ పాన్‌ కేక్‌ రడీ అయినట్లే.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..