BP: మీకు బీపీ రాకూడదని ఆశిస్తున్నారా.? రోజూ 45 నిమిషాలు కేటాయించండి చాలు
ఒకప్పుడు 50 ఏళ్లు దాటి వారిలోనే బీపీ సమస్య కనిపించేది. కానీ ప్రస్తుతం తక్కువ వయసు ఉన్న వారిలో కూడా ఈ సమస్య వేధిస్తోంది. బీపీ కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా హృదయ సంబంధిత సమస్యలకు బీపీ ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఒక్క బీపీ కంట్రోల్‌లో ఉంచుకోవడం వల్ల ఎన్నో రకాల వ్యాధులకు...
రక్తపోటు.. ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో ఇదీ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ బీపీ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, ఒత్తిడితో కూడుకున్న జీవితం కారణం ఏదైనా బీపీతో బాధపడేవారు ఎక్కువవుతున్నారు. ముఖ్యంగా ఒత్తిడితో కూడుకున్న పని కారణంగా చాలా మంది బీపీ బారినపడుతున్నారు.
ఒకప్పుడు 50 ఏళ్లు దాటి వారిలోనే బీపీ సమస్య కనిపించేది. కానీ ప్రస్తుతం తక్కువ వయసు ఉన్న వారిలో కూడా ఈ సమస్య వేధిస్తోంది. బీపీ కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా హృదయ సంబంధిత సమస్యలకు బీపీ ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఒక్క బీపీ కంట్రోల్‌లో ఉంచుకోవడం వల్ల ఎన్నో రకాల వ్యాధులకు చెక్ పెట్టొచ్చని సూచిస్తున్నారు. అందుకే తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
అయితే కేవలం ఆహారం విషయంలో మాత్రమే కాకుండా.. జీవన విధానంలోనూ పలు మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బీపీ కంట్రోల్‌లోకి రావడంలో వ్యాయామాన్ని మించిన మార్గం మరోటి లేదని చెబుతున్నారు. అయితే వ్యాయామం అనగానే గంటలకొద్ది జిమ్ముల్లో కుస్తీలు పట్టాల్సిన పనిలేదు. రోజూ కేవలం 45 నిమిషాలు వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ లేదా స్విమ్మింగ్ వంటివి చేస్తే చాలని చెబుతున్నారు. ఈ కాస్త శారీరక శ్రమ చేసినా రక్తపోటు నియంత్రణంలో ఉంటుందని చెబుతున్నారు.
ఇక మానసిక ఆరోగ్యం కూడా బీపీ రాకుండా ఉంచడంలో ఉపయోగడపడుతుందని వైద్యులు చెబుతున్నారు. మానసిక ప్రశాంతతో బీపీ కంట్రోల్ అవుతుందని అంటున్నారు. యోగా, మెడిటేషన్ వంటి వాటితో మాత్రమే కాకుండా ఉదయం నడక కూడా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో అలా కాసేపు నడిస్తే బీపీ నార్మల్ అవుతుందని చెబుతున్నారు. వీటితో పాటు జంక్‌ఫుడ్, ప్యాకేజ్ ఫుడ్‌కు దూరంగా ఉంటూ.. స్మోకింగ్, మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..