Oats Dosa Health Benefits: ఓట్స్ దోశ పర్ఫెక్ట్‌గా ఇలా చేసి తిన్నారంటే.. రుచి అదుర్స్.. ఆరోగ్యం రెట్టింపు!
ఓట్స్ దోశ అంటే సాధారణ దోశ స్థానంలో ఓట్స్ పిండిని కలిపి తయారు చేస్తారు. కానీ, ఇది పూర్తి ఆరోగ్యకరమైన వంటకంగా ప్రసిద్ధి. ఇందులో అద్భుమైన పోషకాలు ఉంటాయి. ఓట్స్ లో పోషక విలువ ఎక్కువగా ఉంటాయి. ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, ముఖ్యంగా విటమిన్ బి కలిగి ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ప్రతిరోజు ఉదయం ఓట్స్ దోశ తీసుకోవడం వల్ల శరీరానికి కలిగే ఆరోగ్యలాభాలు ఏంటో మనం తెలుసుకుందాం. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ దోశ తీసుకోవడం వల్ల కలిగే లెక్కలేనన్నీ బెనిఫిట్స్ పొందుతారు. అయితే, ఎంతో రుచికరమైన, ఆరోగ్యవంతమైన ఓట్స్ దోశ తయారీ ఎలాగో ఇప్పుడు చూద్దాం..

ఓట్స్ దోశ పర్ఫెక్ట్‌గా రావాలంటే కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ముందుగా ఓట్స్ దోశ కోసం కావాల్సిన పదార్థాలను పరిశీలించినట్టయితే.. ఓట్స్, బియ్యం పిండి, ఉప్మా రవ్వ, పెరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, జీలకర్ర, కొత్తిమీర, అల్లం పేస్ట్, ఇంగువ, కరివేపాకు, మిరియాల పొడి, మెంతులు, ఉప్పు తగినంత, నూనె కావాల్సినంత తీసుకోవాలి.
ముందుగా ఓట్స్ బాగా వేయించి అందులో మెంతులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ ఓట్స్ పొడిని ఓ గిన్నెలోకి తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు కలుపుకోవాలి. ఇందులోనే బియ్యం పిండి, ఉప్మా రవ్వ, పెరుగు, కరివేపాకు, కొత్తిమీర తరుగు, అల్లం పేస్ట్, జీలకర్ర, ఇంగువ, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి దోశ పిండిలాగా బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు, మూడు చుక్కల నూనె వేసి కలుపుకోవాలి. ఉల్లిగడ్డ కట్ చేసి కలిపితే మంచిది. ఇప్పుడు పిండిని పెనంపై దోశలాగా పర్చుకోవాలి. దానిమీద తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేయాలి. రంగు మారే వరకు రెండు వైపులా దోశను బాగా కాల్చుకోవాలి. పైన కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసుకోవచ్చు. అంతే.. టేస్టీ, హెల్తీ ఓట్స్ దోశ రెడీ అయినట్లే. బ్రేక్‌ఫాస్ట్‌లోకి తింటే రోజంతా ఉల్లాసంగా ఉంటారు.








