ఏం చేసినా జుట్టు పెరగట్లేదా.. ఇలా చేసి చూడండి..! జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది..!
పొడవాటి, దట్టమైన, ఆరోగ్యమైన జుట్టు కోసం సహజమైన పరిష్కారాలు చాలా అవసరం. ప్రస్తుతం కాలుష్యం, ఆహారపు అలవాట్లు, తప్పు ఉత్పత్తుల వాడకం వల్ల జుట్టు నష్టాన్ని ఎదుర్కొంటున్నాం. అందుకే వేప ఆకులతో కొబ్బరి నూనె తయారు చేసి ఉపయోగించడం చాలా మేలైన పరిష్కారం. ఇది తలచుండ్రు, జుట్టురాలడం తగ్గించి, జుట్టు బలంగా పెరగటానికి సహాయపడుతుంది.

ఎవరైనా పొడవాటి, దట్టమైన జుట్టు కలిగి ఉండాలనుకోవడం తప్పు కాదు. అయితే పర్యావరణ కాలుష్యం, చెడు ఆహారపు అలవాట్లు, తప్పు ఉత్పత్తులు వాడటం వల్ల జుట్టు బలహీనమవుతుంది. ఈ సమస్యలు ఉన్నప్పుడు జుట్టు వేగంగా రాలడం ప్రారంభమవుతుంది. ఈ పరిస్థితుల్లో మనం కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది.
ఒకవేళ ఎవరైనా వ్యక్తికి నిరంతరం జుట్టు రాలడం ఉంటే జుట్టు పెరుగుదల ఆగిపోతుంది. ఇది చాలా మందిని ఆందోళనకు గురి చేస్తుంది. జుట్టు రాలడాన్ని అడ్డుకోవడానికి మహిళలు, పురుషులు చాలా రకాల నూనెలు, షాంపూలను వాడటం మొదలు పెడుతారు. అయితే ఈ ఉత్పత్తులు సరిగా పనిచేయకపోవడం లేదా ఉపయోగపడకపోవడం సాధారణమే.
ఇంట్లో సహజంగా జుట్టు సమస్యలను ఎదుర్కొనే పద్ధతులు చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి వేప ఆకులతో కొబ్బరి నూనె తయారు చేయడం. వేప ఆకులు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. ముందుగా తాజా వేప ఆకులను కడిగి ఆరబెట్టాలి. తరువాత కొబ్బరి నూనెను ఒక పాత్రలో వేడి చేసి వేప ఆకులను దానిలో వేసి బాగా మరిగించాలి.
నూనె ముదురు రంగులోకి మారే వరకు ఉడకబెట్టాలి. నూనె రంగు మారిన తర్వాత దాన్ని వడకట్టి చల్లబరచాలి. దీనిని ఒక సీసాలో నిల్వ చేయవచ్చు. ఈ నూనెను తలకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. కనీసం రెండు గంటలపాటు లేదా రాత్రంతా జుట్టుకి అప్లై చేసి ఉంచాలి.
వేపతో కలిపిన కొబ్బరి నూనె తలపై ఉన్న మురికి, చుండ్రు, ఇన్ఫెక్షన్లను తొలగిస్తుంది. ఇది జుట్టు మూలాలను బలపరుస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఈ నూనెను వారానికి రెండుసార్లు వాడటం వల్ల తల శుభ్రంగా ఉంటుంది. జుట్టు పెరుగుదల సాధారణం కంటే వేగంగా ఉంటుంది.
ఇలా కొబ్బరి నూనెను వేపతో కలిపి ఉపయోగించడం వల్ల జుట్టుకు తేమ, పోషణ లభిస్తాయి. ఇది మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచటంలో సహాయపడుతుంది.
