లైట్ తీసుకోకండి.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే లివర్ షెడ్డుకే.. గుండెకు కూడా డేంజరేనట
కొవ్వు కాలేయం రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుందని, దీనివల్ల గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫ్యాటీ లివర్ సమస్యను ముందుగానే గుర్తించడం ద్వారా.. సరైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలితో నియంత్రించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫ్యాటీ లివర్ లక్షణాలు.. దాని ప్రభావం, వైద్యుల సూచనలను తెలుసుకోండి..

ఈ రోజుల్లో తప్పుడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా ఫ్యాటీ లివర్ (కొవ్వు కాలేయం) సమస్య వేగంగా పెరుగుతోంది. కాలేయంలో అదనపు కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమైనప్పుడు ఈ వ్యాధి వస్తుంది. ప్రారంభంలో, ఇది పెద్దగా లక్షణాలను చూపించదు.. కానీ సకాలంలో నియంత్రించకపోతే అది గుండె జబ్బులకు కారణమవుతుంది. కొవ్వు కాలేయం రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుందని, దీనివల్ల గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫ్యాటీ లివర్ సమస్యను ముందుగానే గుర్తించడం ద్వారా.. సరైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలితో నియంత్రించవచ్చని పేర్కొంటున్నారు. ఫ్యాటీ లివర్ ప్రారంభ దశలో ఉంటే దానిని నయం చేయడం సులభమమని.. అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
కొవ్వు కాలేయం – గుండె జబ్బులు:
కాలేయంలో అదనపు కొవ్వు పేరుకుపోయినప్పుడు, అది వాపుకు కారణమవుతుంది.. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) ను పెంచుతుంది.. మంచి కొలెస్ట్రాల్ (HDL) ను తగ్గిస్తుంది. దీనివల్ల గుండె ధమనులలో అడ్డంకులు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. రక్తపోటు-మధుమేహం వంటి సమస్యలు కూడా ఫ్యాటీ లివర్ వల్ల సంభవించవచ్చు.. ఇది గుండెను మరింత బలహీనపరుస్తుంది. ఫ్యాటీ లివర్ ప్రభావం గుండె సంబంధిత వ్యాధులను ప్రేరేపిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
ఎవరికి ఎక్కువ ప్రమాదం..
ముఖ్యంగా ఊబకాయంతో బాధపడేవారికి, కొంతమందికి ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్ పేషెంట్లు, ఎక్కువగా మద్యం సేవించే వ్యక్తులు, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయని వారిలో ఫ్యాటీ లివర్ అభివృద్ధి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మీరు వెంటనే మీ జీవనశైలిని మార్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇలాంటి లక్షణాలను అశ్రద్ద చేయకండి..
ఫ్యాటీ లివర్ (కొవ్వు కాలేయం) లక్షణాలు చాలా నెమ్మదిగా కనిపిస్తాయి.. కానీ మీరు ఈ సంకేతాలను చూసినట్లయితే అప్రమత్తంగా ఉండండి. కడుపులో కుడివైపున తేలికపాటి నొప్పి లేదా భారంగా అనిపించడం, ఎప్పుడూ నీరసంగా ఉండటం.. బలహీనంగా అనిపించడం, ఆకలి లేకపోవడం లేదా ఆహారం జీర్ణం కావడంలో ఇబ్బంది, వేగంగా బరువు పెరగడం లేదా తగ్గడం వంటివి ఫ్యాటీ లివర్ సమస్య కావచ్చు. మీకు ఈ లక్షణాలలో ఏవైనా అనిపిస్తే, దానిని తేలికగా తీసుకోకండి.. వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందండి..
కాలేయం – గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా?
మీ కాలేయం – గుండె రెండూ ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరుకుంటే.. మీరు జీవనశైలిలో.. దినచర్యలో కొన్ని మార్పులు చేసుకోవాలి.
మీ ఆహారాన్ని మార్చుకోండి – జంక్ ఫుడ్, వేయించిన ఆహారాలు, ఎక్కువ తీపి పదార్థాలు తినడం మానుకోండి. ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తినండి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి- ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడక, యోగా లేదా తేలికపాటి వ్యాయామం చేయండి.
మద్యం, సిగరెట్లు మానుకోండి- మద్యం, ధూమపానం కాలేయాన్ని దెబ్బతీస్తాయి.. వాటిని పూర్తిగా మానేయండి.
మీ బరువును అదుపులో ఉంచుకోండి- ఊబకాయం కాలేయానికి మాత్రమే కాకుండా గుండెకు కూడా ప్రమాదకరం.. కాబట్టి ఆరోగ్యకరమైన బరువును నిర్వహించండి.
తగినంత నిద్రను పొందండి- తక్కువ నిద్ర శరీరంలో హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది.. ఇది కాలేయం, గుండె రెండింటిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్డక క్లిక్ చేయండి..