AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navratri 2022: నవరాత్రుల్లో తినే ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి నిషేధం.. ఈ సంప్రదాయాన్ని ఎందుకు పాటిస్తామంటే..

ఉపవాసం చేసే సమయంలో తినే ఆహారం జీర్ణం కావడానికి సమయం పడుతుంది. అయితే సాత్వికాహారం తినడం వలన జీవక్రియ పెరుగుతుంది. రోగనిరోధక పనితీరును మెరుగుపడడంతో పాటు..

Navratri 2022: నవరాత్రుల్లో తినే ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి నిషేధం.. ఈ సంప్రదాయాన్ని ఎందుకు పాటిస్తామంటే..
Navaratri 2022 Food
Surya Kala
|

Updated on: Sep 20, 2022 | 8:47 PM

Share

Navratri 2022: సనాతన హిందూ ధర్మంలో పండగలకు, పర్వదినాలు విశిష్టస్థానం ఉంది. పూజాదికార్యక్రమాలకు తినే ఆహారానికి ప్రత్యేక నియమాలున్నాయి. ముఖ్యంగా నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధించే భక్తులు సాత్వికాహారాన్నీ తినాలని సూచిస్తారు. ఉల్లిపాయలు, వెల్లుల్లిని తినే ఆహారంలో నిషేధించారు. నవరాత్రుల సమయంలో మాంసాన్ని నిషేధించి.. పండ్లు, కాయలు, కూరగాయలు, విత్తనాలు, పాలు, చిక్కుళ్ళు వంటి సాత్వికాహారాన్ని తినే ఆహారంలో చేర్చుకోవాలి.

ఆయుర్వేద నిపుణులు సాత్విక ఆహారం ఉత్తమమైనదని నమ్ముతారు. ఇది సులభంగా జీర్ణమవుతుంది. ఉపవాసం చేసే సమయంలో తినే ఆహారం జీర్ణం కావడానికి సమయం పడుతుంది. అయితే సాత్వికాహారం తినడం వలన జీవక్రియ పెరుగుతుంది. రోగనిరోధక పనితీరును మెరుగుపడడంతో పాటు, చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచే అద్భుత సంజీవని సాత్వికాహారం. కనుక తినే ఆహారంలో నియమ నిబంధనలు అనుసరిస్తూ.. ఆహారాన్ని వండడం, తినడం సాంప్రదాయ ఆచారంగా మారింది.

నవరాత్రి సమయంలో.. హిందూ భక్తులు ప్రాసెస్ చేసిన, లేదా నిల్వ చేసిన ఆహారపదార్ధాలను తినరు. తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు, ఆకులు వంటి నీటి సాంద్రతతో సమృద్ధిగా ఉన్న వాటిని చేర్చుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఆయుర్వేదం ఆహార పదార్థాలను మూడు విభిన్న గుణాలుగా వర్గీకరిస్తుంది. అవి సత్వ లేదా సాత్విక, రాజస లేదా తామస పదార్ధాలుగా పేర్కొన్నారు. ఇక్కడ సాత్విక అంటే స్వచ్ఛమైన, సహజమైన, శక్తివంతం ఆహారం అని అర్ధం.

వెల్లుల్లిని రాజోగిని అని పిలుస్తారు. ఉల్లిపాయలు, వెల్లుల్లి కోరికలు కలిగిస్తాయని హిందూ భక్తులు నమ్ముతారు. ఉల్లి పాయలు శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తున్నప్పుడు వారి ప్రవృత్తిపై పట్టు కోల్పోతుందని నమ్మకం. నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిది రోజులు భక్తులు ప్రాపంచిక సుఖాలకు దూరంగా స్వచ్ఛమైన,    సరళమైన జీవితాన్ని అలవర్చుకోవాల్సిన సమయం. అయితే నవరాత్రి పండుగ రోజుల్లో రాజస, తామసిక ఆహారాలు తినడం వలన దృష్టి దైవం నుంచి మరలి.. ప్రాపంచిక విషయాలపై పడుతుందని నమ్మకం. కనుకనే నవరాత్రుల సమయంలో ఉల్లిపాయలు, వెల్లుల్లి తినడం నిషేధించబడింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..