Benefits Sabudana: నవరాత్రికి ఉపవాసం ఉంటున్నారా.. తినే ఆహారంలో ఆరోగ్యానికి మేలు చేసే సగ్గుబియ్యం ఖిచిడీని చేర్చుకోండి..
నవరాత్రి ఉపవాస సమయంలో రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు మీరు సగ్గుబియ్యం ఖిచిడీని ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈరోజు ఉపవాస సమయంలో సగ్గుబియ్యం ఖిచిడీని తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
Updated on: Sep 20, 2022 | 8:42 PM

ఈసారి నవరాత్రులు సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభంకానున్నాయి. నవరాత్రి అమ్మవారిని పూజిస్తూ.. చాలా మంది ఉపవాసం ఉంటారు. ఉపవాస సమయంలో ఎనర్జిటిక్‌గా ఉండేందుకు మీరు సగ్గుబియ్యం ఖిచిడీని ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇందులో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా చాలా ఆరోగ్యకరమైనది కూడా.

సగ్గుబియ్యంలో ఐరన్, కాపర్, విటమిన్ బి6, కాపర్ పుష్కలంగా ఉన్నాయి. కనుక సగ్గుబియ్యంతో తయారు చేసిన ఖీర్ , ఇతర ఆహారపదార్ధాలను కూడా తినవచ్చు. ఇవి చాలా రుచికరమైనవి అలాగే చాలా ఆరోగ్యకరమైనవి.

సగ్గుబియ్యం ఖిచిడీలో పొటాషియం ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది కండరాలకు కూడా చాలా మేలు చేస్తుంది.

సగ్గుబియ్యం ఖిచిడీలో కాల్షియం ఉంటుంది. ఇందులో ఐరన్, విటమిన్ కె కూడా పుష్కలంగాఉన్నాయి. ఇది ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి. ఎముకలకు సంబంధించిన సమస్యల నుంచి రక్షణగా పనిచేస్తుంది.

సగ్గుబియ్యం ఖిచిడీలో కేలరీలు చాలా తక్కువ. దీన్ని తీసుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు. మీరు బరువును తగ్గడానికి డైట్ ను పాటిస్తుంటే.. తినే ఆహారపదార్ధాల్లో సగ్గుబియ్యం ఖిచిడీని చేర్చుకోవచ్చు.




