Soup: చలికాలంలో మంచి బ్రేక్ ఫాస్ట్ తినాలనుకంటే.. తప్పకుండా దీనిని ట్రై చేయండి.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా..
రెగ్యులర్‌గా తినే అల్పాహరంతో చాలా మందికి బోర్ కొడుతుంది. అందుకే వెరైటీగా ట్రై చేద్దామనుకుంటారు. కొత్తగా ఏమి చేద్దామని తెగ ఆలోచిస్తారు. అసలే శీతాకాలం చల్లారిపోయిన పదార్థాలు తినాలనిపించదు. ఏదైనా వేడివేడిగా లాగిద్దాం అనుకునేవాళ్లకి ఓ మంచి డిష్ క్లియర్..
రెగ్యులర్‌గా తినే అల్పాహరంతో చాలా మందికి బోర్ కొడుతుంది. అందుకే వెరైటీగా ట్రై చేద్దామనుకుంటారు. కొత్తగా ఏమి చేద్దామని తెగ ఆలోచిస్తారు. అసలే శీతాకాలం చల్లారిపోయిన పదార్థాలు తినాలనిపించదు. ఏదైనా వేడివేడిగా లాగిద్దాం అనుకునేవాళ్లకి ఓ మంచి డిష్ క్లియర్ మష్రూమ్ సూప్. కేవలం బ్రేక్ ఫాస్ట్‌గానే కాకుండా.. ఆరోగ్యానికి ఇది మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. వాస్తవానికి మష్రూమ్స్ ఆరోగ్యానికి మంచివని అందరికీ తెలుసు. బరువు తగ్గాలి అనుకునేవారికి మంచి ఆప్షన్ కూడా. చలికాలంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలనుకునేవారు.. ఆరోగ్యంగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరూ తమ డైట్లో మష్రూమ్స్ తీసుకోవచ్చు. దీనిని సూప్ రూపంలో తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. టెస్టీగా ఉండటంతో పాటు ఇది హెల్తీ కూడా అంటున్నారు.శీతాకాలంలో ఉదయాన్నే ఓ కప్పు మష్రూమ్ సూప్‌తో డే స్టార్ట్ చేస్తే.. మీరు కావాల్సిన పోషకాలు అందుతాయి. అంతేకాదు చలిలో వెచ్చదనాన్ని పొందవచ్చు. క్లియర్ మష్రూమ్ సూప్ ను ఎలా తయారుచేసుకోవచ్చు. కావల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
మష్రూమ్‌లు – 200 గ్రాములు
స్ప్రింగ్ ఆనియన్స్ – 2 కప్పులు
నువ్వుల నూనె – 1/2 టేబుల్ స్పూన్
సన్నగా తరిగిన వెల్లుల్లి – 1 టేబుల్ స్పూన్
సన్నగా తరిగిన అల్లం – 1/2 టేబుల్ స్పూన్
సన్నగా తరిగిన సెలరీ – 1 టేబుల్ స్పూన్
పెప్పర్ – 1/2 టీస్పూన్
సోయా సాస్ – 1 టేబుల్ స్పూన్
నీళ్లు – 3 కప్పులు
ఉప్పు – తగినంత
ఉల్లిపాయలు – 5 టేబుల్ స్పూన్స్
లవంగాలు – 2
తయారుచేసే విధానం
మష్రూమ్‌లను బాగా కడిగి.. వాటిని తుడవాలి. ఆ తర్వాత వాటిని ముక్కలు చేయాలి. ముందుగా పాన్‌లో నూనె వేసి వేడి చేసి దానిలో వెల్లుల్లి, అల్లం వేసి కొన్ని సెకన్లు వేయించాలి. స్పింగ్ ఆనియన్స్, ఉల్లిపాయలు వేసి.. ఒక నిమిషం పాటు వేయించాలి. దానిలో పుట్టగొడుగులను, సెలెరీని వేసి బాగా కలపాలి. మీడియం మంట మీద రెండు నిమిషాలు వేయించాలి. తరువాత 3 కప్పుల నీరు వేసి కలిపి.. మరగనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత.. దానిలో సోయా సాస్, పెప్పర్, సాల్ట్ వేసి బాగా కలపాలి. మష్రూమ్స్ ఉడికే వరకు దానిపై మూత పెట్టి ఉడకనివ్వాలి. అనంతరం స్టౌవ్ ఆపేసి.. రుచి చూసుకోవాలి. మీ రుచికి తగ్గట్లు ఏమైనా అవసరమైతే.. వాటిని జోడించుకుని.. వేడిగా సర్వ్ చేసుకుని తినొచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి