AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: ఇయర్‌బడ్స్‌తో చెవులను శుభ్రం చేసుకుంటున్నారా.. అవి సురక్షితం కాకపోవచ్చు.. ఇలా ట్రై చేయండి..

మన ఇంటిని, పరిసరాలను, దుస్తులను ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో.. శరీరాన్ని అంతే శుభ్రంగా ఉంచుకోవాడానికి రోజూ స్నానం చేస్తుంటాం. కేవలం స్నానం చేసి శరీరాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోదు. శరీర భాగాలను శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా స్నానం చేసే సమయంలో కొంతమంది..

Health: ఇయర్‌బడ్స్‌తో చెవులను శుభ్రం చేసుకుంటున్నారా.. అవి సురక్షితం కాకపోవచ్చు.. ఇలా ట్రై చేయండి..
Ears
Amarnadh Daneti
|

Updated on: Nov 19, 2022 | 9:34 PM

Share

మన ఇంటిని, పరిసరాలను, దుస్తులను ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో.. శరీరాన్ని అంతే శుభ్రంగా ఉంచుకోవాడానికి రోజూ స్నానం చేస్తుంటాం. కేవలం స్నానం చేసి శరీరాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోదు. శరీర భాగాలను శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా స్నానం చేసే సమయంలో కొంతమంది తమ చెవులను శుభ్రం చేసుకుంటారు. మరికొంతమంది స్నానం తరువాత ఇయర్‌ బడ్స్‌తో చెవులను క్లీన్ చేసుకుంటారు. మరికొంతమంది అయితే అసలు అవేం పట్టించుకోరు. అందుకే కొందరు చెవి పోటు వస్తుందంటూ చాలా బాధపడుతూ ఉంటారు. తరచూ చెవులను శుభ్రం చేసుకోకపోవడం ద్వారా చెవులో చెవిలో గులిమి పడుతుంది. అది తీయడానికి తర్వాత కష్టపడే బదులు.. తరచూ చెవులను శుభ్రం చేసుకుంటే బెటర్ అంటున్నారు నిపుణులు. అలాగే ఇయర్‌ బడ్స్‌తో కాకుండా చెవులు శుభ్ర పర్చుకోవడానికి సింపుల్ చిట్కాలను సూచిస్తున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో చెవులు మూసుకుపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో చెవులను శుభ్రంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యంమని సూచిస్తున్నారు నిపుణులు. చెవులు ఇయర్ వాక్స్ అనే సహజమైన మైనపు పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది చెవులను రక్షిస్తుంది. దుమ్ము, ధూళి రానీయకుండా నిరోధిస్తుంది. అయితే చెవి వ్యాక్స్ పేరుకుపోతే.. వినికిడి సమస్యలు వచ్చే ప్రమాదమూ ఉంది. ఈ సమస్యలు రాకుండా ఉండేందుకు.. చెవులను తరచుగా శుభ్రం చేసుకోవాలి. చెవులను శుభ్రం చేయడానికి ఇయర్‌బడ్స్‌ను సాధారణంగా అందరూ ఉపయోగిస్తారు.. కాని అవి అంత సురక్షితం అనే గ్యారంటీ ఇవ్వలేమంటున్నారు నిపుణులు. కొన్ని సహజమైన ఇంటి నివారణలతో ఈ సమస్యను క్లియర్ చేసుకోవచ్చు అంటున్నారు.

ఉప్పు నీరు

ఉప్పు నీరు మీ చెవిలో పేరుకుపోయిన మైనపును మృదువుగా చేయడంలో సహాయపడుతుంది. తద్వారా దానిని సులువుగా శుభ్రం చేయవచ్చు. దీనికోసం గోరువెచ్చని నీరు తీసుకుని, దానిలో ఉప్పు కలపాలి. అందులో కాటన్ బాల్స్ ఉంచాలి. ఏ చెవిని శుభ్రం చేసుకోవాలనుకుంటే దానిలో కొన్ని చుక్కలు వేయాలి. మూడు నుంచి ఐదు నిమిషాలు నీరు దానిలో ఉండేలా పట్టుకోవాలి. ఆ వాటర్ బయటకు పోయేలా తలను వంచాలి. మెత్తబడిన డస్ట్​ని కాటన్‌తో సున్నితంగా క్లీన్ చేసుకోవచ్చు.

ఆలివ్ నూనె

చెవులను శుభ్రం చేయడానికి ఆలివ్ ఆయిల్ ఒక గొప్ప హోం రెమెడీ. ఇది చెవిని నీటి ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. చెవి పొరలను లైన్ చేయడంలో సహాయపడుతుంది. క్రిమినాశక లక్షణాలతో ప్యాక్ నిండి ఈ ఆయిల్.. చెవిలోని మైనాన్ని సజావుగా తొలగించడంలో దోహదపడుతుంది. చెవిలో మూడు-నాలుగు చుక్కల గోరువెచ్చని ఆలివ్ నూనె పోసి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తలను వంచి నూనె, మైనాన్ని తొలగించడానికి ఇయర్‌బడ్స్‌ను ఉపయోగించవచ్చు.

ఇవి కూడా చదవండి

బేకింగ్ సోడా

గట్టిపడిన ఇయర్‌వాక్స్‌ను మృదువుగా చేయడంలో బేకింగ్ సోడా అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది సురక్షితమైనది. చెవి ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. బేకింగ్ సోడాను కొన్ని చుక్కల నీటిలో కరిగించి.. డ్రాపర్ సహాయంతో చెవిలో పోయాలి. ఇది అధిక చెవి వ్యాక్స్‌ను బయటకు పంపుతుంది. పూర్తయిన తర్వాత చెవులను మృదువైన కాటన్ క్లాత్‌తో శుభ్రం చేసుకోవాలి.

ఆపిల్ సైడర్ వెనిగర్

యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో నిండిన ఆపిల్ సైడర్ వెనిగర్ చెవిలోని హానికరమైన సూక్ష్మజీవులను చంపడానికి, తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే శిలీంధ్రాలతో పోరాడటానికి సహాయపడుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్‌ను గోరువెచ్చని నీటితో కలపాలి. ఇయర్ డ్రాపర్ ఉపయోగించి చెవిలో ఐదు నుంచి 10 చుక్కలు వేయాలి. చుక్కలు చెవిలో ఐదు నిమిషాలు ఉంచి అనంతరం క్లీన్ చేసుకోవాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us