Money Saving: డబ్బు ఖర్చువుతుందని చింతించకండి..! పొదుపు కోసం ఈ 4 మార్గాలు ఎంచుకోండి..
Money Saving: డబ్బు సంపాదించడం ఎంత కష్టమో పొదుపు చేయడం కూడా అంతే కష్టం. అందరు ప్రతి నెలా ఎంతో కొంత సంపాదిస్తారు. కానీ దానిని ఎక్కడ ఖర్చు చేస్తున్నారో
Money Saving: డబ్బు సంపాదించడం ఎంత కష్టమో పొదుపు చేయడం కూడా అంతే కష్టం. అందరు ప్రతి నెలా ఎంతో కొంత సంపాదిస్తారు. కానీ దానిని ఎక్కడ ఖర్చు చేస్తున్నారో మాత్రం తెలియదు. దీనికి కారణం కోరికలు. ఇవి ఎప్పటికీ అంతం కావు. ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత ఎక్కువ ఖర్చు చేస్తాం. అటువంటి పరిస్థితిలో మనీ పొదుపు కోసం ఈ నాలుగు మార్గాలు పాటించండి.
1. ఖర్చులను అదుపులో ఉంచాలి ఆదాయం పెరిగినప్పుడల్లా ఖర్చులను కూడా పెంచకూడదు. మీరు గతంలో ఎంత మొత్తంలో సర్దుకున్నారో అలాగే ఇప్పుడు కూడా ఉండటానికి ప్రయత్నించాలి. తద్వారా మీరు పెరిగిన డబ్బును పొదుపుగా మార్చవచ్చు.
2. భవిష్యత్ ముఖ్యం.. మనుషులు ఎప్పుడు కూడా వర్తమానంలో బతకాలని అంటారు. ఇది నిజమే కానీ భవిష్యత్ పరిస్థితులకు కూడా తగిన విధంగా ఉండాలి. ఈ రోజుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియడం లేదు. ఈ రోజు బాగుండవచ్చు కానీ రేపు ఏదైనా ఆపద రావొచ్చు. అప్పుడు డబ్బు అవసరం కచ్చితంగా ఉంటుంది. అందుకే మనీ సేవింగ్ అనేది చాలాముఖ్యం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి.
3. డబ్బును ట్రాక్ చేయండి కొందరు వ్యక్తులు ఇష్టారాజ్యంగా డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు. ఎక్కడ ఖర్చు చేశారో కూడా వారికి తెలియదు. అటువంటి పరిస్థితిలో డబ్బు అదుపులో ఉండదు. అందుకే ఒక డైరీ సిద్దం చేసుకొని మీ ఖర్చుల వివరాలను అందులో రాస్తే ప్రతి లెక్క సులభంగా తెలుస్తుంది. అప్పుడు మీరు డబ్బులు పొదుపు చేయడానికి అవకాశం ఉంటుంది.
4. నెలవారీ బడ్జెట్ పూర్వ కాలంలో ప్రజలు ఇంటి ఖర్చుల కోసం నెలవారీ బడ్జెట్‌ను తయారు చేసేవారు. అవసరమైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేసేవారు. మీరు కూడా ఈ విధానాన్ని పాటించాలి. ఇది ఇంటి ఖర్చును పరిమితం చేస్తుంది. డబ్బు ఆదా చేస్తుంది. ప్రయత్నించి చూడండి. అవసరమైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయండి.
5. ఒక గంట వ్యాయామం 24 గంటలలో ఒక గంట మీ కోసం కేటాయించుకోండి. వ్యాయామం, యోగా మొదలైనవి చేయండి. ఇది మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మీరు పనైనా చేస్తారు. ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. ఎక్కువ పొదుపు చేస్తారు.