Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Self Hugging: ఎవరూ లేరని చింతించకండి.. మిమ్మల్ని మీరే కౌగిలించుకోండి.. అదే డబుల్‌ బూస్టర్‌..!

Benefits Of Self Hugging: ఉరుకులు పరుగుల జీవితంలో పనిభారం, ఎన్నో సమస్యలు.. ఇలా చాలామంది ఒత్తిడితో బాధపడుతుంటారు. అయితే, భావోద్వేగాలతో బాధపడుతున్నవారికి ఆనందం, ఉత్సాహం అనేవి కనిపించవు.

Self Hugging: ఎవరూ లేరని చింతించకండి.. మిమ్మల్ని మీరే కౌగిలించుకోండి.. అదే డబుల్‌ బూస్టర్‌..!
Self Hugging
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 24, 2023 | 7:55 AM

Benefits Of Self Hugging: ఉరుకులు పరుగుల జీవితంలో పనిభారం, ఎన్నో సమస్యలు.. ఇలా చాలామంది ఒత్తిడితో బాధపడుతుంటారు. అయితే, భావోద్వేగాలతో బాధపడుతున్నవారికి ఆనందం, ఉత్సాహం అనేవి కనిపించవు. ఏదో తెలియని బాధ, ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. అలాంటి వారికి ప్రియమైనవారి ఓదార్పు అవసరమని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ఎదుటి వ్యక్తితో తన సంతోషాన్ని, కష్టాలను పంచుకునే వారి కోసం పరితపిస్తుంటారు. దగ్గరైన వారితో ఉంటే.. ఇలాంటి సమస్యలన్నింటికి ఉపశమనం లభిస్తుంది. అందుకే బాధల్లో ఉన్నప్పుడు.. ఇష్టమైన వారితో మాట్లాడలని పేర్కొంటారు. ఇంకా మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి.. దగ్గరున్న వారు ఓ హగ్ ఇస్తే నిజంగానే ప్రయోజనం కలుగుతుందని పరిశోధనలో కూడా రుజువైంది. ఒత్తిడి నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది. అయితే.. చాలామంది లోలోపల కుములుతూనే.. వేరే వ్యక్తులతో తమ విషయాలను అస్సలు పంచుకోరు. ఒంటరితనంతోనే తమలో తామే బాధలను దిగమింగుతుంటారు. అలాంటివారు ఒంటరిగా కూడా.. సమస్యలనుంచి బయటపడొచ్చు. ఉంటే.. సంతోషంగా లేకున్నా.. ఒంటరిగా ఉన్నా.. కొన్ని భావోద్వేగాలతో బాధపడుతున్న మిమ్మల్ని మీరు కౌగిలించుకోవడానికి ప్రయత్నించాలంటూ సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.. ఇది కొంచెం వింతగా అనిపించవచ్చు, కానీ ఇలా చేయడం ద్వారా మీకు మీరు చాలా ప్రయోజనాలను పొందవచ్చంటున్నారు. సెల్ఫ్ హగ్గింగ్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

సెల్ఫ్ హగ్గింగ్ ప్రయోజనాలు..

  1. మిమ్మల్ని మీరు కౌగిలించుకోవడం వల్ల మీ స్వంత శక్తి మీకు లభిస్తుంది. మిమ్మల్ని మీరు ఓదార్చగలిగినప్పుడు.. ఎవరైనా మీకు మంచి అనుభూతిని కలిగించే వరకు ఎందుకు వేచి ఉండాలి. అందుకే దీనికి సెల్ఫ్ హగ్గింగ్ బెటర్ అంటున్నారు నిపుణులు. సెల్ఫ్ హగ్గింగ్ బాధను తగ్గించడంలో సహాయపడుతుందని 2011 అధ్యయనం కనుగొంది. ఈ అధ్యయనంలో, పరిశోధకులు 20 మంది వ్యక్తులకు లేజర్‌ టెక్నాలజీతో పరిశోధనలు జరిపారు. ఈ వ్యక్తులు ఎవరినైనా కౌగిలించుకున్నట్లుగా చేతులతో తమను తాము పట్టుకున్నప్పుడు, వారిలో ఉన్న ఒత్తిడి, బాధ, నొప్పలు వంటివి తగ్గి.. హాయినిచ్చిందని కనుగొన్నారు.
  2. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు, మీకు సన్నిహితంగా ఉండే ఎవరైనా మీకు మద్దతు ఇస్తే మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఎవరైనా మిమ్మల్ని కౌగిలించుకున్నప్పుడు, మీరు తేలికగా, తక్కువ ఒంటరితనం ఫీలింగ్ లభిస్తుంది. అదే విధంగా, మిమ్మల్ని మీరు కౌగిలించుకోవడం కూడా సౌకర్యం, భద్రత భావాన్ని సృష్టించవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైనా కలత చెందినప్పుడు, ఎవరినైనా కౌగిలించుకోలేనప్పుడు ఈ ఎంపికను ప్రయత్నించవచ్చు.
  3. ఏదో ఒక రోజు మీరు పని కారణంగా చాలా అలసిపోతారు లేదా విచారంగా ఉంటారు. అప్పుడు మిమ్మల్ని మీరు కౌగిలించుకోవాలి. ఇది మీ శరీరంలోని కార్టిసాల్ హార్మోన్ స్థాయిని తగ్గిస్తుంది. దీంతో మీకు రిలాక్స్‌గా అనిపిస్తుంది.
  4. తనను తాను కౌగిలించుకోవడం, ఓదార్పునివ్వడం వల్ల తన పట్ల ప్రేమ, ఆప్యాయత పెరుగుతుందని పరిశోధకులు విశ్వసిస్తారు. మీరు ఎలా ఉన్నారో అలానే అంగీకరించండి. తప్పులు చేసిన తర్వాత కూడా మిమ్మల్ని మీరు శాంతింపజేయడం సులభం అవుతుంది. దీంతో మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మొదలుపెడతారు.

అందుకే బాధపడుతున్నప్పుడు సెల్ఫ్ హగ్గింగ్ మెడిసెన్ లా పనిచేస్తుందని పేర్కొంటున్నారు మానసిక ఆరోగ్య నిపుణులు..

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

అబద్ధం చెప్పేవారికి యముడు ఏ శిక్ష వేస్తాడో తెలుసా..?
అబద్ధం చెప్పేవారికి యముడు ఏ శిక్ష వేస్తాడో తెలుసా..?
మీ కలలలో వీటిని చూసినట్లయితే అమ్మవారు మీ పట్ల దయతో ఉందని అర్థమట
మీ కలలలో వీటిని చూసినట్లయితే అమ్మవారు మీ పట్ల దయతో ఉందని అర్థమట
నా కొడుకును బలి పశువును చేస్తున్నారు.. పృథ్వీరాజ్ సుకుమార్ తల్లి.
నా కొడుకును బలి పశువును చేస్తున్నారు.. పృథ్వీరాజ్ సుకుమార్ తల్లి.
యూపీఐ నుండి బ్యాంకుల వరకు.. ఏప్రిల్ 1 నుండి అనేక నియమాలు మార్పు!
యూపీఐ నుండి బ్యాంకుల వరకు.. ఏప్రిల్ 1 నుండి అనేక నియమాలు మార్పు!
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో వీడుతున్న చిక్కుముళ్లు..
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో వీడుతున్న చిక్కుముళ్లు..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రిజక్ట్ చేసిన టాప్ 5 సినిమాలు ఇవే!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రిజక్ట్ చేసిన టాప్ 5 సినిమాలు ఇవే!
పెళ్లివేడుకలో కూతురు ఆద్య, భార్య ఐష్‌తో కలిసి సందడి చేసిన అభిషేక్
పెళ్లివేడుకలో కూతురు ఆద్య, భార్య ఐష్‌తో కలిసి సందడి చేసిన అభిషేక్
Tv9 సమ్మిట్‌..అబుదాబిలో మోదీ ప్రసంగాన్ని విన్న లులు గ్రూప్ అధినేత
Tv9 సమ్మిట్‌..అబుదాబిలో మోదీ ప్రసంగాన్ని విన్న లులు గ్రూప్ అధినేత
వీరిని అస్సలు నమ్మకూడదు.. విదుర నీతి ఏం చెబుతుందో తెలుసా..?
వీరిని అస్సలు నమ్మకూడదు.. విదుర నీతి ఏం చెబుతుందో తెలుసా..?
ఏంటీ కీర్తి ఇలా మారిపోయింది.. బ్లాక్ చీరలో కీర్తిసురేష్ ఫొటోస్!
ఏంటీ కీర్తి ఇలా మారిపోయింది.. బ్లాక్ చీరలో కీర్తిసురేష్ ఫొటోస్!