Guava: చలికాలం జామ పండు తినలా వద్దా అనే సంశయంలో ఉన్నారా.? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..
కాలానికి అతీతంగా లభించే వాటిలో జామ పండు ఒకటి. దాదాపు అన్ని సీజన్స్‌లో ఇవి లభిస్తాయి. రుచిగా ఉండే జామ వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. అయితే చలికాలంలో జామ పండ్లు తింటే జలుబు చేస్తుందని చాలా మంది భావిస్తుంటారు. అందుకే జామ పండును..

కాలానికి అతీతంగా లభించే వాటిలో జామ పండు ఒకటి. దాదాపు అన్ని సీజన్స్‌లో ఇవి లభిస్తాయి. రుచిగా ఉండే జామ వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. అయితే చలికాలంలో జామ పండ్లు తింటే జలుబు చేస్తుందని చాలా మంది భావిస్తుంటారు. అందుకే జామ పండును చలికాలంలో తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపరు. అయితే చలికాంలోనూ జామ పండ్లను ఎలాంటి సంశయం లేకుండా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జామ గింజల వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఇంతకీ జామ గింజల వల్ల ఆరోగ్యానికి కలిగే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
* జామ గింజలను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలంగా మారుతుంది. జామ గింజల్లో పీచు పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జామ గింజలను తీసుకోవడం ద్వారా, మలబద్ధకం సమస్య దూరమవుతుంది. అందుకే చలికాలంలో దీన్ని తప్పనిసరిగా తీసుకోవాలి.
* బరువు తగ్గడంలోనూ జామ గింజలు ఉపయోగపడతాయి. జామపండులో కొలెస్ట్రాల్ అస్సలు ఉండకపోవడమే కారణం. అంతేకాకుండా వీటిలో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావన కలిగిస్తుంది. దీంతో సహజంగానే తీసుకునే ఆహారం సైతం తగ్గుతుంది.
* మధుమేహ వ్యాధిగ్రస్తులకు జామ గింజలు మేలు చేస్తాయి. ఇందులో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది, ఇది చక్కెర, చక్కెర సమ్మేళనాలను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి షుగర్ పేషెంట్స్ ఎలాంటి సంశయం లేకుండా జామ పండ్లను తీసుకోవచ్చు.
నోట్: పైన తెలిపిన విషయాలు పలువురు నిపుణుల అభిప్రాయాల మేరకు అందించినవి మాత్రమే. ఆరోగ్యం విషయంలో నేరుగా వైద్యులను సంప్రదించడమే ఉత్తమమం.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..