Heart attack: ఉదయం లేవగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? గుండెపోటుకు సంకేతం కావచ్చు..!

ప్రస్తుత రోజుల్లో గుండెపోటు సమస్యలు పెరిగిపోతున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు వచ్చి మరణానికి కూడా కారణమవుతోంది. ఎక్కడో జిమ్ చేస్తూ టైమ్ ఎటాక్, డ్యాన్స్ చేస్తూ ఎక్కడో గుండెపోటు. రెండు రోజుల..

Heart attack: ఉదయం లేవగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? గుండెపోటుకు సంకేతం కావచ్చు..!
Heart Attack
Follow us
Subhash Goud

|

Updated on: Jan 23, 2023 | 8:00 PM

ప్రస్తుత రోజుల్లో గుండెపోటు సమస్యలు పెరిగిపోతున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు వచ్చి మరణానికి కూడా కారణమవుతోంది. ఎక్కడో జిమ్ చేస్తూ టైమ్ ఎటాక్, డ్యాన్స్ చేస్తూ ఎక్కడో గుండెపోటు. రెండు రోజుల క్రితం బీహార్‌లో ఉపన్యాసం ఇస్తుండగా గుండెపోటు వచ్చిన ఓ వ్యక్తి మరణించాడు. ఈ వ్యాధి బారిన పడి అక్కడికక్కడే మరణించిన సందర్భాలు చాలా ఉన్నాయి. సరిగ్గా లేని జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, కోవిడ్‌ వైరస్‌ కారణంగా గుండె జబ్బులు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.

గుండె జబ్బులు కూడా నియంత్రణలో ఉంటాయి. అయితే దీని కోసం లక్షణాలను సకాలంలో గుర్తించడం చాలా ముఖ్యం. చాలా సందర్భాలలో ఉదయం నిద్రలేవగానే గుండె జబ్బుల గురించి శరీరం హెచ్చరిస్తుంది. కానీ ప్రజలు దానిని పెద్దగా పట్టించుకోరు. స్థూలకాయం, మధుమేహం లేదా కరోనా తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉన్నవారు గుండెపోటు లక్షణాలను అస్సలు విస్మరించకూడదని వైద్యులు అంటున్నారు.

  1. ఈ లక్షణాలు కనిపిస్తాయి: గుండెపోటు వచ్చే ప్రమాదం చాలాసార్లు ఉదయాన్నే ఎక్కువగా ఉంటుందని కార్డియాలజిస్ట్ డాక్టర్ అజిత్ కుమార్ వివరిస్తున్నారు. వైద్యులు దీనిని సిర్కాడియన్ రిథమ్ అని పిలుస్తారు. ఉదయాన్నే బీపీ కూడా పెరగడం మొదలవుతుంది. దీంతో గుండెపోటు రావచ్చు. అటువంటి పరిస్థితిలో ఈ లక్షణాలు ఉదయం కనిపిస్తే అప్పుడు అప్రమత్తంగా ఉండండి.
  2. గ్యాస్ మందు వేసినా తగ్గని ఛాతీ నొప్పి: చాలా సార్లు ఉదయం పూట ఛాతీలో మంట, నొప్పి వస్తుందని డాక్టర్ చెబుతున్నారు. చాలా సందర్భాలలో ప్రజలు దీనిని గ్యాస్ సమస్యగా భావిస్తారు. అలా నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తున్నారు. ఉదయం ఛాతీ నొప్పి ఉంటే, ఎడమ చేయి లేదా భుజం వరకు నొప్పి ఉన్నా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు.
  3. వాంతులు లేదా వికారం సమస్యలు: చాలా సార్లు మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే వాంతులు లేదా వికారం సమస్య ఉంటుంది. కానీ ప్రజలు వాంతులను కడుపు సమస్యగా భావిస్తారు. కానీ చాలా సందర్భాలలో ఇది గుండెపోటు లక్షణం కూడా కావచ్చు. ఛాతీ నొప్పి వాంతులు లేదా వికారం సమస్యలు ఉంటే విస్మరించకూడదు. వెంటనే వైద్యులను సంప్రదించంచాలని ఆయన సూచిస్తున్నారు.

(ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)