Banana Benefits: అరటిపండుతో పొట్ట పెరుగుతుందా.. తగ్గుతుందా.. ? పరిశోధకులు తేల్చిన వాస్తవాలు ఏంటో మీకు తెలుసా.

Melt Belly Fat With Banana : అరటి పండ్లు తింటే ఎలా బరువు తగ్గుతారు అనే ప్రశ్నకు పరిశోధకులు చెప్పే సమాధానం ఏమిటంటే ఎక్కువ అరటి

Banana Benefits: అరటిపండుతో పొట్ట పెరుగుతుందా.. తగ్గుతుందా.. ? పరిశోధకులు తేల్చిన వాస్తవాలు ఏంటో మీకు తెలుసా.
Follow us

| Edited By: Team Veegam

Updated on: Mar 08, 2021 | 1:51 PM

Melt Belly Fat With Banana : అరటి పండ్లు తింటే ఎలా బరువు తగ్గుతారు అనే ప్రశ్నకు పరిశోధకులు చెప్పే సమాధానం ఏమిటంటే ఎక్కువ అరటి పండ్లను తింటే బరువు పెరుగుతారనీ, అదే రోజుకు 2 మాత్రమే తింటే… బరువు తగ్గుతారని చెప్పారు. అది ఎలాగో తెలుసుకుందాం. అరటి పండ్లలో ఎక్కువగా ఉండే పొటాషియం శరీరం లో అదనంగా నీరు చేరకుండా రక్షణ కల్పిస్తుంది. కొన్ని సార్లు , అనారోగ్యాలు కలిగినప్పుడు నీరు పొట్ట లోకి చేరుతుంటుంది . దాం తో పొట్ట ఉబ్బి రోజు రోజు కి సైజు పెరిగిపోతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే… రోజూ రెండు అరటి పండ్లను తినడం వలన అవి పొట్టలో నీరు చేరకుండా చేస్తాయి. అలాగే వేపిన ఆహారాల కు బదులుగా ఉడికించిన ఆహారాలు, కూరలు ఎక్కువగా తినాలి. ఇలా చేయడం తో మీరు సన్నగా అవుతారని పరిశోధకులుసూచిస్తున్నారు.

ప్రో-బయోటిక్ గుణాల ను అరటి పండు కలిగి ఉండడం వలన శరీరం లో మంచి బ్యాక్టీరియా పెరిగేలా చేస్తాయి. ఈ బ్యాక్టీరియా మనం తిన్న ఆహారాన్ని అది ఆరగిస్తూ,జీర్ణక్రియసక్రమం గా జరిగేలా చేస్తాయి. ఎప్పుడైతే… జీర్ణక్రియ బాగా జరుగుతుందో అప్పుడు కొవ్వు పేరుకుపోయే పరిస్థితిరాదు . ఫలితంగా పొట్ట,నడుం చుట్టూ కొవ్వు తగ్గి తద్వారా పొట్ట మాయం అవుతుంది. అరటి పండ్లలో B విటమిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరం లో కొవ్వును పెరగనివ్వదు . కొవ్వును పోగేసే జన్యువులు మన శరీరం లో ఉంటాయి. వాటిని చురుగ్గా లేకుండా చేస్తుంది ఈ విటమిన్. ఎప్పుడై తే ఆ జీన్స్ పనిచేయకుండా అయిపోతాయో,అప్పుడు ఇక కొవ్వు నిల్వ అనేది ఉండదు .పొట్ట రాదు .ఒక వేళ పొట్ట యున్న కూడా అది తగ్గిపోతుంది.

మీరు నిజంగా, సీరియస్‌గా పొట్ట రాకూడదు అని అనుకుంటే… 2 అరటి పండ్లను రోజూ తినడంతో పాటూ, స్పైసీ ఫుడ్ ఫ్రైలు, మసాలాలు, పిజ్జాలు, బర్గర్లు, చిప్స్ వంటివి తినడం తగ్గించుకోవాలి . మీరు ఇలా చేయడం మొదలు పెట్టగానే చాలా త్వరగా నే మీకు పొట్ట తగ్గిపోతుంది, అని పరిశోధకులు తెలియచేస్తున్నారు.తినే ఆ అరటి పళ్ళు కూడా బాగా పండినవి అయిఉండాలట.

ఇవి చదవండి : బైక్ ప్రియులు రైడింగ్‌కి సిద్ధంకండి.. వచ్చేసింది సరికొత్త అపాచీ ఆర్‌టీఆర్‌ 200.. ధర, ఫీచర్లు ఇలా..

తెలంగాణలోని ఆ ప్రాంతంలో చేపలు విషపూరితం.. తిన్నారో అంతే సంగతులు

Corona Effect: ఆ రాష్ట్రానికి వెళ్లాలంటే ఈ-పాస్‌ తప్పనిసరి… ఆ మూడు రాష్ట్రాలకు మాత్రం మినహాయింపు: ఆరోగ్యశాఖ