International Women’s Day 2021: అందమైన అతివలకు… అదిరిపోయే డ్రెస్సింగ్ ఐడియాస్.. ఉమెన్స్ డే సందర్బంగా ఓ లుక్కేయండి!
International Women’s Day 2021: మారుతున్న కాలానుగుణంగా మన జీవనశైలీ మారిపోయింది. సంప్రదాయపు దుస్తులు ధరించాలంటే అది పండగల రోజు మాత్రమే ధరించే స్థితి వచ్చింది.
International Women’s Day 2021: మారుతున్న కాలానుగుణంగా మన జీవనశైలీ మారిపోయింది. ఇక హడావిడీ జీవన విధానంలోనూ అమ్మాయిలు నేటి తరం ఫ్యాషన్లను ఫాలో అవుతూనే.. సంప్రదాయబద్ధంగానూ మెరిసిపోతుంటారు. ఇక కేవలం పండగలకే కాకుండా స్పెషల్ డేస్‌లలో కూడా సంప్రదాయపు దుస్తులను ధరించడమే ద్వారా మీరు మరింత అందంగా కనిపించవచ్చు. ఇక ఈ ఉమెన్స్ డేను సంప్రదాయపు దుస్తులు ధరించి సెలబ్రెట్ చేసుకోండి. ఈ ఉమెన్స్ డేకు ఈసారి ఇలాంటి డ్రెస్సులను ట్రై చేయండి.
ఎక్కువగా జువెల్లరీ అవసరం లేకుండా ప్రింట్లున్న చేనేత దుస్తులు ప్రాముఖ్యత ఇవ్వండి. అవి మీకు సౌకర్యంగా ఉండడమే కాకుండా.. ప్రొఫెషనల్‌గా కనిపించేలా చేస్తాయి. ఈ విధంగా చూస్తే దేశవాళీ కాటన్‌తో తయారైన ఫ్యాబ్రిక్ దుస్తులను ఎంచుకోవడం మంచిది. ఇవి ఒంటికి హాయిని, చెమటను పీల్చుకోదగినవి. కాంతిమంతమైన రంగులు ఎంచుకున్నప్పటికి సౌకర్యానికి ప్రాధాన్యమిచ్చేలా వదులుగా ఉండే దుస్తులను ఎంపిక చేసుకోవడం ఉత్తమం.
ముఖ్యంగా డార్క్ కలర్స్ కాకుండా… లేత రంగులను ఎంచుకోండి. కంటికి, ఒంటికి హాయినిస్తాయి. ఇందులో గులాబీ, బ్లూ, లావెండర్, బేబీ పింక్ రంగులను ఎంచుకోవడం వలన మీరు మరింత అందంగా కనిపిస్తారు. డ్రెస్‌కి తగిన మాస్క్ ను ఎంచుకోవడం వలన మరింత అందంగా కనిపిస్తారు. అలాగే కంఫర్ట్ గాను ఉంటారు. అలాగే చుడీదార్స్, జీన్స్ వంటివి మీ శారీరానికి నప్పేలా వేసుకోవడం ఉత్తమం. ఓహ్, ఫ్లేర్డ్ జీన్స్ సౌకర్యంగా ఉంటాయి. ఎక్కువ మంది మహిళలు మంచి జత ఫ్లేర్డ్ జీన్స్ ధరించాలి. ఇక మరీ హెవీ జువెల్లరీని కాకుండా.. లైట్ వేట్ జువెల్లరీని ధరించడం వలన రోజంతా సౌకర్యంగా ఉంటారు. అలాగే మీ డ్రెస్సుకు నప్పెలా లైట్ కలర్ నెయిల్ పాలిష్ ధరించడం ద్వారా మరింత అందంగా కనిపిస్తారు. కాంతిమంతమైన రంగులు ఎంచుకున్నప్పటికి సౌకర్యానికి ప్రాధాన్యమిచ్చేలా వదులుగా ఉండే దుస్తులను ఎంచుకోండి. క్కడకు వెళ్లాలన్నా ముందు మాస్క్ తప్పనిసరి కాబట్టి వీటి మీద దృష్టి పెట్టడం ఉత్తమం.
Also Read:
బరువు తగ్గాడానికి ప్రయత్నిస్తున్నారా ? అయితే ఈ టిప్స్ ఫాలో అయితే ప్రయోజనాలెన్నో…