AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బరువు తగ్గాడానికి ప్రయత్నిస్తున్నారా ? అయితే ఈ టిప్స్ ఫాలో అయితే ప్రయోజనాలెన్నో…

బరువు తగ్గడానికి చాలా మంది అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కొందరు వర్క్ అవుట్స్ చేయడం.. జాగింగ్, రన్నింగ్, యోగా ఇలాంటివి చేస్తుంటారు. ఇక మరికొందరు

బరువు తగ్గాడానికి ప్రయత్నిస్తున్నారా ? అయితే ఈ టిప్స్ ఫాలో అయితే ప్రయోజనాలెన్నో...
Rajitha Chanti
|

Updated on: Mar 05, 2021 | 9:45 PM

Share

బరువు తగ్గడానికి చాలా మంది అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కొందరు వర్క్ అవుట్స్ చేయడం.. జాగింగ్, రన్నింగ్, యోగా ఇలాంటివి చేస్తుంటారు. ఇక మరికొందరు తినకుండా ఉండడం వలన బరువు తగ్గోచ్చు అనుకుంటారు. టైంకి తినకుండా ఉండడం వలన అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోస్తుంటారు. అయితే ఈ టిప్స్ ఫాలో అవడం వలన బరువు తగ్గుతారట.

నిద్రపోవడం..

ప్రస్తుత స్మార్ట్ యూగంలో చాలా మంది ఫోన్లతో కాలం వెల్లదీస్తుంటారు. అర్ధరాత్రి వరకు ఫోన్లను చూడడం… లేట్ గా పడుకోవడం.. మళ్లీ ఉదయాన్నే లెవడం చేస్తుంటారు. సరైన నిద్ర లేకపోవడం వలన కూడా బరువు పెరుగుతుంటారట. నిద్రలో తేడాలకీ మెటబాలిజం ఎఫెక్ట్ అవుతందట. బరువు తగ్గాలనుకునే వారు రోజూకు ఎనిమిది గంటలు నిద్ర అవసరం.

పోషకాహరం..

బరువు తగ్గాలని ట్రై చేస్తున్న వారందరూ డైటింగ్ చేస్తుంటారు. ఇందుకు ఆహారాన్ని ఎక్కువగా తీసుకోరు. అయితే పోషకాలతో నిండిన అన్ శాచ్యురేటేడ్ ఫ్యాట్స్ తినడం వలన కడుపు నిండుగా ఉండటమే కాకుండా.. బింజ్ ఈటింగ్ ఉండదు. బరువు కూడా తగ్గుతారు.

నీరు ఎక్కువగా తాగాలి…

శరీరానికి నీరు ముఖ్యం. నీరు అరుగుదలకి సహకరించడమే కాక ఇమ్యూన్ సిస్టమ్ ని కూడ బలోపేతం చేస్తుంది. కడుపు నిండుగా ఉండడం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది, అక్కర్లేని ఫుడ్ తీస్కోకుండా ఉంటాం, బరువు తగ్గే లక్ష్యానికి చేరువ అవుతూ ఉంటాం.

నూనె తగ్గించాలి…

ఇది చాలా ముఖ్యం. బరువు తగ్గాలనుకునేవారు వంటల్లో నూనే తక్కువగా ఉండేలా చూసుకోండి. అవకాడో ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ వంటివి ఆరోగ్యకరం కావచ్చు. ఏ ఆయిల్ వాడినా తక్కువగానే వాడుకోవడం అవసరం.

ఫైబర్ అధికం..

మీ రోజూ వారి డైట్ లో ఫైబర్ ఎక్కువగా ఉన్న పదార్థాలు చేర్చుకొండి. వీటి వలనల్ డైజెస్టివ్ హెల్త్ ఉండడమే కాకుండా క్యాలరీ ఇన్ టేక్ కూడా రెడ్యూస్ చేసుకోవచ్చు. పండ్లు, ఆకు కూరలు, నట్స్, హోల్ గ్రెయిన్స్, బీన్స్, పప్పులు వంటివాటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

ప్రోటీన్ ఇన్‌టేక్ పెంచండి..

బాడీలో ప్రోటీన్ ఒక ముఖ్యమైన ఎనర్జీ సోర్స్. ప్రోటీన్ ని మీ బ్రేక్ ఫాస్ట్ లో కన్నీ, లేదా ఇంకే ఇతర మీల్ లో కానీ తీసుకోవడం వల్ల మజిల్స్ బిల్డ్ అవ్వడమే కాక రోజంతా అతి ఆకలి వేయకుండా ఉంటుంది, ఫలితంగా క్యాలరీ ఇన్‌టేక్ కూడా తగ్గుతుంది.

కూరగాయలు ఎక్కువ తీసుకోండి..

మీరు బరువు తగ్గదల్చుకుంటే తప్పని సరిగా వెజిటబుల్స్ తీసుకోవాలి. హెల్దీ న్యూట్రియెంట్స్, విటమిన్స్ ఆకుపచ్చని కూరగాల ద్వారా లభిస్తాయి. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేయడమే కాక హై క్యాలరీ ఫుడ్స్ తీసుకోకుండా నిరోధిస్తాయి. వీటిని అన్ని మీల్స్ లో నూ తీసుకోవడం మంచిది.

Also Read:

జుట్టు రాలిపోవడంతో బాధపడుతున్నారా ? అయితే ఈ 5 టిప్స్ ఫాలో అవ్వండి.. రిజల్ట్ పక్కా..