Interesting Facts: మీ అలవాట్లలో ఈ మార్పులు చేయండి.. ఆయుష్షును పెంచుకోండి!
ఆరోగ్యంగా పది కాలాలు పాటు ఉండాలని కోరుకుని మనిషి ఉండడు. చనిపోయేటప్పుడు కూడా ఎవరికీ ఎలాంటి నష్టం కలిగించకుండా, శ్రమ పెట్టకుండా మరణించాలని అనుకుంటారు. ఆరోగ్యంగా, ఆనందంగా ఎక్కువ కాలం పాటు జీవించాలని కోరకుంటారు. కానీ దాని కోసం మాత్రం ఎలాంటి ప్రయత్నాలు చేయరు. ప్రయత్నం చేయనిదే ఫలితం రాదు కదా. ఇప్పుడున్న బిజీ లైఫ్ ప్రకారం అంతా ఈజీగా, ఫాస్ట్‌గా అయిపోవాలి. తమ ఆరోగ్యం గురించి కూడా సరిగ్గా..

ఆరోగ్యంగా పది కాలాలు పాటు ఉండాలని కోరుకుని మనిషి ఉండడు. చనిపోయేటప్పుడు కూడా ఎవరికీ ఎలాంటి నష్టం కలిగించకుండా, శ్రమ పెట్టకుండా మరణించాలని అనుకుంటారు. ఆరోగ్యంగా, ఆనందంగా ఎక్కువ కాలం పాటు జీవించాలని కోరకుంటారు. కానీ దాని కోసం మాత్రం ఎలాంటి ప్రయత్నాలు చేయరు. ప్రయత్నం చేయనిదే ఫలితం రాదు కదా. ఇప్పుడున్న బిజీ లైఫ్ ప్రకారం అంతా ఈజీగా, ఫాస్ట్‌గా అయిపోవాలి. తమ ఆరోగ్యం గురించి కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదు. ఏం తింటున్నారో.. ఎప్పుడు పడుకుంటున్నారో కూడా తెలీడం లేదు. ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా జీవించాలంటే ఖచ్చితంగా మీ లైఫ్ స్టైల్‌లో మార్పులు చేసుకోవాలి. కొన్ని రకాల పద్దతులను తప్పకుండా పాటిస్తే.. ఆరోగ్యంగా ఆయుష్షును పెంచుకోవచ్చు. ఇప్పుడు చెప్పే కొన్ని రకాల నియమాలను పాటిస్తే.. పది సంవత్సరాలు పాటు ఎక్కువగా జీవిస్తారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకోండి.
వ్యాయామం చేయాలి:
ప్రతి రోజూ ఉదయం కనీసం అరగంట సేపు అయినా వ్యాయామం చేయాలి. వాకింగ్, జాగింగ్, యోగా లేదా మీకు ఇష్టమైన వ్యాయామాలు ఏదో ఒకటి ఇంటి వద్ద అయినా చేయడం అలవాటు చేసుకోవాలి. సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివి కూడా చేయవచ్చు. వ్యాయామం చేయడం వల్ల రక్త ప్రసరణ వేగంగా జరుగుతుంది. మధుమేహం, బీపీ, గుండె జబ్బులు వంటివి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
హెల్దీ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి:
ఉదయం వీలైనంత వరకూ ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. వాటిల్లో పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, ప్రోటీన్, క్యాల్షియం, విటమిన్స్, మినరల్స్, ఖనిజాలు ఉండేలా చూసుకోవాలి. జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ఉప్పు, షుగర్ ఉన్న పదార్థాలను దూరంగా పెట్టడమే బెటర్. సరైన ఆహారంతోనే తింటేనే మీ ఆరోగ్యం బావుంటుంది.
నిద్ర:
నిద్ర అనేది శరీరానికి చాలా ముఖ్యం. ప్రతి రోజూ కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు అయినా నిద్ర పోవాలి. సరైన నిద్ర ఉంటేనే పని మీద ఏకాగ్రత అనేది పెరుగుతుంది. సరిగ్గా నిద్రపోతే వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసిక ఆందోళన మెరుగు పడుతుంది.
హైడ్రేట్‌గా ఉండాలి:
శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. ప్రతి రోజూ నాలుగు నుంచి ఐదు లీటర్ల నీటిని తాగితే.. శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. కేవలం నీటిని మాత్రమే కాకుండా పండ్ల రసాలు కూడా తీసుకుంటూ ఉండాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.








