Kidney Health: కిడ్నీ సమస్యలున్న వారు మర్చిపోయి కూడా ఈ ఆహారాలు తినకూడదు..
నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. ఆహార అలవాట్లు, జీవనశైలి కారణంగా ఏ వయసు వారికైనా కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయి. తక్కువ నీళ్లు తాగడం నుంచి ఆహారంలో అధిక ఉప్పు తీసుకోవడం వరకు అనేక కారణాలు కిడ్నీ సమస్యలకు కారణం అవుతున్నాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడటం, ఇన్ఫెక్షన్ వంటి పలురకాల సమస్యలు తలెత్తుతున్నాయి. కిడ్నీ సమస్యలున్న వారు ఏం తింటున్నారు? ఏ సమయంలో తింటున్నారు అనే విషయాలు నిపుణుల మాటల్లో మీ కోసం..

ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా..
ఫుడ్ యాప్‌ల కారణంగా ప్రాసెస్ చేసిన ఫుడ్‌కి జనాల్లో డిమాండ్ పెరిగింది. బర్గర్లు, పిజ్జాలు వంటి ఆహారాల్లో ప్రాసెస్ చేసిన మాంసంను ఉపయోగిస్తారు. అవి కిడ్నీ ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కావు.
అధిక ఉప్పు ఆహారాలు
అధిక ఉప్పు ఉన్న ఆహారాలు కిడ్నీ ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కావు. ప్రాసెస్ చేసిన స్నాక్స్, క్యాన్డ్ సూప్‌లలో సోడియం ఎక్కువగా ఉంటుంది. అలాగే రోజు వారీ ఆహారాల్లో ఉప్పును తగ్గించాలి. రోజుకు 3-5 గ్రాముల ఉప్పు కంటే ఎక్కువ తినకూడదు. అన్నం, కూరల్లో కొద్దిగా ఊరగాయ పచ్చళ్లు వేసుకుని తినడం వల్ల ఆహారం రుచి పెరుగుతుంది. కానీ రోజూ పచ్చళ్లు తినే అలవాటు కిడ్నీలకు అంత మంచిది కాదు. ఊరగాయల్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది.
పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు
పొటాషియం ఆరోగ్యానికి అవసరమైన ముఖ్యమైన మినరల్. అయితే ఈ ఖనిజాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. అరటిపండ్లు, నారింజ, టమోటాలు వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటిల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. బదులుగా ఆపిల్, కాలీఫ్లవర్ వంటి పండ్లు, కూరగాయలను తీసుకొవచ్చు. వీటిల్లో పొటాషియం తక్కువగా ఉంటుంది.
రెడ్ మీట్
రెడ్ మీట్ ఆరోగ్యానికి ఎప్పుడూ మంచిది కాదు. ప్రాసెస్ చేసిన మాంసాహారాలు కూడా కిడ్నీ సమస్యలతో బాధపడేవారికి అంత మంచిది కాదు. కిడ్నీ సమస్యలను పెంచడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్, రక్తపోటు, గుండె సమస్యలు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి ఈ రకానికి పూర్తిగా దూరంగా ఉండటం మంచిది.
షుగర్ ఫుడ్స్
షుగర్ ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. చక్కెరను కలిగి ఉన్న అనేక పానీయాలు కూడా ఉన్నాయి. కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఇలాంటి ఆహారాలు తినకపోవడమే మంచిది. అంతేకాకుండా ఇటువంటి ఆహారాలు మధుమేహం, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి.
పాల ఉత్పత్తులు
పాల ఉత్పత్తుల్లో భాస్వరం అధికంగా ఉంటుంది. ఈ ఖనిజాలు మూత్రపిండాలను కూడా ప్రభావితం చేస్తాయి. బదులుగా ఫాస్పరస్ తక్కువగా ఉన్న పాల ఉత్పత్తులను తీసుకోవడం బెంటర్.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.