AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Infertility: మీరు తండ్రి అవుతారో లేదో చిన్న‌ ర‌క్త ప‌రీక్ష చెబుతుంది.. ఏఐ టెక్నాల‌జీతో..

మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు ఒత్తిడితో కూడుకున్న జీవితం.. కార‌ణం ఏదైనా ఇటీవ‌ల మ‌గ‌వారిలోనూ సంతానలేమి స‌మ‌స్య‌లు ఎక్కువుతున్నాయి. ఒక‌ప్పుడు కేవ‌లం స్త్రీల‌లోనే ఎక్కువ‌గా క‌నిపించే ఈ స‌మ‌స్య ఇప్పుడు పురుషుల్లోనూ క‌నిపిస్తోంది. జీవ‌న విధానంలో వ‌స్తున్న మార్పులు,...

Infertility: మీరు తండ్రి అవుతారో లేదో చిన్న‌ ర‌క్త ప‌రీక్ష చెబుతుంది.. ఏఐ టెక్నాల‌జీతో..
men
Narender Vaitla
|

Updated on: Aug 04, 2024 | 9:33 AM

Share

మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు ఒత్తిడితో కూడుకున్న జీవితం.. కార‌ణం ఏదైనా ఇటీవ‌ల మ‌గ‌వారిలోనూ సంతానలేమి స‌మ‌స్య‌లు ఎక్కువుతున్నాయి. ఒక‌ప్పుడు కేవ‌లం స్త్రీల‌లోనే ఎక్కువ‌గా క‌నిపించే ఈ స‌మ‌స్య ఇప్పుడు పురుషుల్లోనూ క‌నిపిస్తోంది. జీవ‌న విధానంలో వ‌స్తున్న మార్పులు, వేడి ఎక్కువ‌గా ఉండే ప్ర‌దేశాల్లో ప‌నిచేయ‌డం, గ్యాడ్జెట్స్ వినియోగం పెర‌గ‌డం, నిద్ర‌లేమి వంటివి కూడా సంతాన‌లేమికి కార‌ణ‌వ‌మ‌తున్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

ఇక సంతాన‌లేమితో బాధ‌ప‌డుతూ ఓ జంట వైద్యుల‌ను సంప్ర‌దిస్తే మ‌హిళ‌ల‌కు ప‌రీక్షించిన‌ట్లుగానే, పురుషుల‌ను కూడా ప‌రీక్షిస్తున్నారు. అయితే పురుషుల్లో సంతాన సామ‌ర్థ్యాన్ని ప‌రీక్షించేందుకు ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న మార్గం వీర్య ప‌రీక్ష‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ప‌రీక్ష ద్వారానే మ‌గ‌వారిలో సంతానోత్ప‌త్తి సామ‌ర్థ్యాన్ని గుర్తిస్తున్నారు. అయితే ఇది కాస్త ఇబ్బంది, స‌మ‌యంలో కూడుకున్న అంశం. అలా కాకుండా ఒక చిన్న ర‌క్త ప‌రీక్ష ద్వారా ఈ విష‌యాన్ని క‌నిపెట్టే అవ‌కాశం ఉంటే ఎలా ఉంటుంది.? దీనినే నిజం చేసి చూపించారు ప‌రిశోధ‌కులు.

ఇందుకోసం ఓ కృత్రిమ మేధ మోడ‌ల్‌ను అభివృద్ధి చేశారు. జ‌పాన్‌లోని టోహో యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు ఈ కొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. కేవ‌లం ఒక చిన్న ర‌క్త ప‌రీక్ష‌తోనే పురుషుల్లో సంతాన‌లేమి స‌మ‌స్య‌ను గుర్తించ‌వ‌చ్చ‌ని చెబుతున్నారు. ఈ విధానం ద్వారా రక్తంలో ఎఫ్‌ఎస్‌హెచ్‌, ఎల్‌హెచ్‌, పీఆర్‌ఎల్‌, టోటల్‌ టెస్టోస్టిరోన్‌, ఈ2 వంటి వివిధ హార్మోన్ల స్థాయిలను విశ్లేషించి 74 శాతం కచ్చితత్వంతో పురుషుల వంధ్యత్వాన్ని గుర్తిస్తుందని, కొందరు పురుషుల్లో ఉండే అజూస్పెర్మియా సమస్యను 100 శాతం ఖచ్చితత్వంతో గుర్తించవచ్చని ప‌రిశోధ‌కులు అంటున్నారు.

ప‌రిశోధ‌కులు ఇందులో భాగంగా.. 3,662 మంది రోగుల వైద్య నివేదికన ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నారు. ఈ స‌మాచారం ఆధారంగా ఈ ఏఐ మోడ‌ల్‌ను అభివృద్ధి చేసినట్టు అసోసియేట్‌ ప్రొఫెసర్‌ హిడెయుకి కొబయషి తెలిపారు. ఈ ఏఐ మాడల్‌ను 2021, 2022లో పలువురిపై పరీక్షించగా వంధ్యత్వానికి సంబంధించి 68 శాతం, అజూస్పెర్మియాకు సంబంధించి 100 శాతం ఖచ్చితత్వంతో ఫలితాలు వచ్చినట్టు తెలిపారు.

మ‌రిన్ని లైఫ్ స్టైల్ వార్త‌ల కోసం క్లిక్ చేయండి..

Follow Us
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
ఆధ్యాత్మిక భారతం.. ఏ ఆలయం చూసినా కిక్కిరిపోతున్న భక్తజనం..
ఆధ్యాత్మిక భారతం.. ఏ ఆలయం చూసినా కిక్కిరిపోతున్న భక్తజనం..