AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిద్రను అశ్రద్ధ చేస్తే ఆస్తమా బారినపడినట్టే..! తాజా అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు..

రాత్రుళ్లు సరైన నిద్రలేకపోవటం అనేక ఆరోగ్య సమస్యలకు కారణమని చెబుతున్నారు. అయితే అనూహ్యంగా ఈ జాబితాలో ఆస్తమా కూడా చేరింది. ఇటీవలి అధ్యయనం ప్రకారం, సరైన నిద్ర లేని వ్యక్తి ఆస్తమాతో బాధపడే అవకాశం ఉందని, ఇంకా..

నిద్రను అశ్రద్ధ చేస్తే ఆస్తమా బారినపడినట్టే..! తాజా అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు..
Irregular Sleep Cause Asthm
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 19, 2023 | 8:53 AM

ప్రతి మనిషికి నిద్ర చాలా అవసరం. దాదాపు 7 నుండి 8 గంటల నిద్ర మనిషి ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ఒక వ్యక్తి సరిగ్గా నిద్రపోకపోతే, అతని మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్యులు అంటున్నారు. సరైన నిద్ర లేకపోవడం మధుమేహం, గుండె జబ్బులు, జ్ఞాపకశక్తి కోల్పోవడం, అధిక రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలకు కారణమని చెబుతున్నారు. అయితే అనూహ్యంగా ఈ జాబితాలో ఆస్తమా కూడా చేరింది. ఇటీవలి అధ్యయనం ప్రకారం, సరైన నిద్ర లేని వ్యక్తి ఆస్తమాతో బాధపడే అవకాశం ఉంది.

UK బయోబ్యాంక్ అధ్యయన డేటా ఆధారంగా చైనీస్ షాన్‌డాంగ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనం అనేక వాస్తవాలను వెల్లడించింది. 38 నుంచి 73 ఏళ్ల మధ్య వయసున్న 4,05,455 మందిపై ఈ సర్వే నిర్వహించారు. అధ్యయనం వారి నిద్ర అలవాట్ల ఆధారంగా ప్రజలను కొన్ని ప్రశ్నలు అడిగారు. అధ్యయనంలో మనుషులు నిద్రపోయే సమయం, గురక, నిద్ర లేమి, రోజంతా నిద్రపోతారా? వంటి ప్రశ్నలు ఇటువంటి ప్రశ్నల ఆధారంగా పొందిన డేటా నిద్ర సమస్యలతో బాధపడేవారికి ఆస్తమా ప్రారంభ లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది.

నిద్ర సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు, జన్యు సిద్ధత ఉన్నవారిలో కూడా ఉబ్బసం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఒక వ్యక్తి సరైన నిద్ర అలవాట్లను అనుసరిస్తే, వారికి ఆస్తమా వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. నిద్రలేమి రుగ్మతలను ముందస్తుగా గుర్తించడం, సరైన చికిత్స చేయడం వలన ఆస్తమాతో సహా అనేక సమస్యలను నివారించవచ్చునని పరిశోధకులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నిద్రపోవడానికి కొన్ని చిట్కాలు!! ప్రతిరోజూ సరైన సమయానికి పడుకోవడం, ఉదయం సరైన సమయానికి నిద్రలేవడం అలవాటు చేసుకోండి. ఈ స్లీప్ షెడ్యూల్‌ను నిరంతరం అనుసరించడం వల్ల మీకు సరైన నిద్ర పడుతుంది. రాత్రి 10 గంటలకు నిద్రపోవడం మంచిది. పెద్దలు ఆరోగ్యకరమైన జీవితానికి 7 నుండి 8 గంటల మంచి నిద్ర అవసరం. పిల్లలు 12 గంటల వరకు నిద్రపోవచ్చు. సరైన నిద్ర అలవాట్లు పాటిస్తే రోగనిరోధక శక్తి పెరిగే అవకాశం ఉంది. తల, ఛాతీ కొద్దిగా పైకి లేపి నిద్రించడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ నివారిస్తుంది. మంచి నిద్ర వస్తుంది.

కెఫిన్, నికోటిన్, అధిక ఆహారం తీసుకోవడం నిద్రను ప్రభావితం చేస్తుంది. వాటిని తగ్గించాలి. రాత్రిపూట మొబైల్ ఫోన్ వాడకం తగ్గించాలి. నిద్రపోవడానికి 30 నిమిషాల ముందు మీ ఫోన్‌ని చూడటం మానుకోండి.

రోజు వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. శ్వాస సమస్యలు ఉండవు. రాత్రి బాగా నిద్రపడుతుంది. కొంతమంది తమ గత, ప్రస్తుత సమస్యల గురించి రాత్రిపూట ఆలోచిస్తారు. ఇది మానుకోవాల్సిన విషయం. పడుకునే ముందు మంచి విషయాలు మాత్రమే ఆలోచించండి. సంతోషంగా నిద్రపోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..