Instant Masala Tea: ఇన్ స్టెంట్ మసాలా టీ.. క్షణాల్లో తయారు చేసుకోవచ్చు!

చాలా మందికి టీ, కాఫీలు అంటే చాలా ఇష్టం. ఉదయం లేవగానే ఓ చుక్క కాఫీ లేదా టీ తాగకపోతే.. రోజు మొదలవ్వదు. ఇండియాలో కాఫీ కంటే టీకి లవర్స్ ఎక్కువ. టీల్లో ఎన్నో రకాలు వచ్చాయి. బ్లాక్ టీ, గ్రీన్ టీ, మసాలా టీ, బాదం టీ ఇలా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. ఎవరి ఇష్టాన్ని బట్టి వారు తాగుతూ ఉంటారు. అలాగే కొన్ని టీలు పాలతో తయారు చేస్తారు. ఇంకొన్ని పాలు లేకుండా చేస్తారు. టీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన వంటి వాటిని..

Instant Masala Tea: ఇన్ స్టెంట్ మసాలా టీ.. క్షణాల్లో తయారు చేసుకోవచ్చు!
Instant Masala Tea
Follow us

|

Updated on: Apr 26, 2024 | 4:46 PM

చాలా మందికి టీ, కాఫీలు అంటే చాలా ఇష్టం. ఉదయం లేవగానే ఓ చుక్క కాఫీ లేదా టీ తాగకపోతే.. రోజు మొదలవ్వదు. ఇండియాలో కాఫీ కంటే టీకి లవర్స్ ఎక్కువ. టీల్లో ఎన్నో రకాలు వచ్చాయి. బ్లాక్ టీ, గ్రీన్ టీ, మసాలా టీ, బాదం టీ ఇలా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. ఎవరి ఇష్టాన్ని బట్టి వారు తాగుతూ ఉంటారు. అలాగే కొన్ని టీలు పాలతో తయారు చేస్తారు. ఇంకొన్ని పాలు లేకుండా చేస్తారు. టీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన వంటి వాటిని తగ్గించుకోవచ్చు. ఇంకొన్ని రకాల హెర్బల్ టీలు తాగితే.. దీర్ఘకాలిక సమస్యలకు కూడా బైబై చెప్పొచ్చు. అయితే ఇండియాలో ఎక్కువగా మసాలా టీని ఇష్టంగా తాగుతారు. మసాలా టీ పౌడర్‌ను బటయ కొంటూ ఉంటారు. అయితే ఇకపై మసాలా టీ పౌడర్‌ను బయట కొనాల్సిన పని లేదు. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి అదెలాగో ఇప్పుడు చూద్దాం.

మసాలా టీ పొడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్ఆలు ఏంటంటే.. శొంటి ముక్క, లవంగాలు, నల్ల మిరియాలు, యాలకులు, బిర్యానీ ఆకులు తీసుకోవాలి. ఓ పాన్ తీసుకుని వీటిని దోరగా వేయించు కోవాలి. ఇందులో బయట దొరికే సాధారణ టీ పౌడర్ వేసి బాగా వేయించాలి. వీటిని కాస్త చల్లార నివ్వాలి.

ఇప్పుడు ఫ్రై చేసిన పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసి.. అందులో పటిక బెల్లం, కొద్దిగా పాల పొడి వేసి మిక్సీ పట్టాలి. ఇప్పుడు పౌడర్‌లా అవుతుంది. దీన్ని జల్లెడ పట్టి.. ఓ డబ్బాలో వేసి.. గాలి తగల కుండా స్టోర్ చేయండి. గ్లాస్ కంటైనర్ లేదంటే స్టీల్ డబ్బాలో వేసుకోవడం ఉత్తమం. ఇలా మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోవచ్చు. అలాగే మీకు మసాలాలు ఎంత పరిమాణంలో కావాలన్నా తీసుకోవచ్చు. మీ రుచిని బట్టి తీసుకోండి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు నీటిని బాగా మరిగించి అందులో కొద్దిగా టీ పౌడర్ కలపండి. అంతే క్షణాల్లో మసాలా టీ సిద్ధం అవుతుంది. ఈ టీ పౌడర్‌ను మీరు ఎక్కడికైనా ఈజీగా ట్రావెల్ చేయవచ్చు. లాంగ్ డ్రైవ్ వంటివి వెళ్తున్నప్పుడు ఈజీగా మీకు టీ సిద్దం అవుతుంది. అయితే ఈ టీని మరీ ఎక్కువగా తీసుకోకూడదు. జీర్ణ సమస్యలు రావచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles
ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..
ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే
మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 11 నెలల తర్వాత నిషేధం ఎత్తివేత!
మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 11 నెలల తర్వాత నిషేధం ఎత్తివేత!
కింగ్ కోబ్రాకి ఫ్యామిలీ పూజలు.. అకస్మాత్తుగా వ్యక్తిపై దాడి
కింగ్ కోబ్రాకి ఫ్యామిలీ పూజలు.. అకస్మాత్తుగా వ్యక్తిపై దాడి
సరదాకు కూడా అటు చూడకండి.. నిట్టనిలువునా నష్టపోతారు
సరదాకు కూడా అటు చూడకండి.. నిట్టనిలువునా నష్టపోతారు
స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్రజ.. కారణం ఏంటంటే
స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్రజ.. కారణం ఏంటంటే
ఆకాశం నుంచి చేపల వాన.. ఏరుకోవడానికి ఎగబడిన జనం..
ఆకాశం నుంచి చేపల వాన.. ఏరుకోవడానికి ఎగబడిన జనం..
ఎంతటి విషాదం.. సరదాగా క్రికెట్ ఆడుతుండగా.. బలంగా వచ్చిన బంతి..
ఎంతటి విషాదం.. సరదాగా క్రికెట్ ఆడుతుండగా.. బలంగా వచ్చిన బంతి..
ఈ నెల 10న పరశురాముడి జయంతి.. తండ్రి ఆజ్ఞతో తల్లి తల నరిన తనయుడు..
ఈ నెల 10న పరశురాముడి జయంతి.. తండ్రి ఆజ్ఞతో తల్లి తల నరిన తనయుడు..
పర్పుల్ క్యాప్ రేసులో బుమ్రా దూకుడు.. టాప్ 5 లిస్ట్‌ ఇదే..
పర్పుల్ క్యాప్ రేసులో బుమ్రా దూకుడు.. టాప్ 5 లిస్ట్‌ ఇదే..