రాత్రిపూట చల్లటి నీళ్లతో స్నానం చేస్తున్నారా..? ఇది తెలిస్తే షాక్ అవుతారు..!

వేసవిలో రాత్రిపూట స్నానం చేయడం ఒంటి ఆరోగ్యానికి మంచిదేనా..? అనే సందేహం మీకు ఎప్పుడైనా కలిగిందా..? రాత్రిపూట తలస్నానం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ కారణంగా, కొంతమంది అన్ని కాలాలలో రాత్రిపూట స్నానం చేసి నిద్రపోతుంటారు. అయితే రాత్రి పడుకునే ముందు తలస్నానం చేయడం నిజంగా ఆరోగ్యానికి మంచిదా, చెడ్డదా అని తెలుసుకుందాం.

రాత్రిపూట చల్లటి నీళ్లతో స్నానం చేస్తున్నారా..? ఇది తెలిస్తే షాక్ అవుతారు..!
Bathing
Follow us
Jyothi Gadda

|

Updated on: May 09, 2024 | 1:50 PM

ఎండలు మండిపోతున్నాయి. వేసవి తాపం తట్టుకోలేక ప్రజలు ఏసీలు, కూలర్లను పరుగులు పెట్టిస్తున్నారు. వేడి ఉబ్బరంతో రాత్రి నిద్రపోయే ముందు కూడా మరోసారి చల్లటి నీళ్లతో స్నానం చేస్తున్నారు. అయిన్నప్పటికీ ఒంటిపై చెమటలు వరదలుగా కారుతున్నాయంటూ వాపోతున్నారు. అయితే, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే..వేసవిలో రాత్రిపూట స్నానం చేయడం ఒంటి ఆరోగ్యానికి మంచిదేనా..? అనే సందేహం మీకు ఎప్పుడైనా కలిగిందా..? రాత్రిపూట తలస్నానం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ కారణంగా, కొంతమంది అన్ని కాలాలలో రాత్రిపూట స్నానం చేసి నిద్రపోతుంటారు. అయితే రాత్రి పడుకునే ముందు తలస్నానం చేయడం నిజంగా ఆరోగ్యానికి మంచిదా, చెడ్డదా అని తెలుసుకుందాం.

వేసవిలో రాత్రిపూట స్నానం చేయడం ఎంతో మేలు చేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజంతా మనిషి శరీరంలో చెమట, ధూళి, విషపదార్థాలు పేరుకుపోతాయి. ఇది ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. కాబట్టి రాత్రిపూట తలస్నానం చేయడం వల్ల మన శరీరం శుభ్రపడుతుంది. మనకు బాగా నిద్ర పడుతుంది. కాబట్టి రాత్రి సమయంలో మీకు నచ్చిన విధంగా చల్లటి నీటితో లేదా గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు. అలాగే రాత్రిపూట స్నానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గి మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

రాత్రిపూట స్నానం చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ, కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవటం తప్పనిసరి. అంటే రాత్రి భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు. ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. వాస్తవానికి, రాత్రి భోజనం తర్వాత మన శరీరం జీర్ణక్రియకు చురుకుగా మారుతుంది. ఈ సమయంలో స్నానం చేయడం వల్ల ఈ ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. రాత్రి భోజనానికి ముందు లేదా పడుకునే ముందు కనీసం 1-2 గంటల ముందు స్నానం చేయాలి. మీకు ఏ రకమైన ఆరోగ్య సమస్య ఉన్నా, రాత్రిపూట స్నానం చేయడం వల్ల మీ సమస్య మరింత తీవ్రమైతే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

ఇవి కూడా చదవండి

అలాగే, ఉదయాన్నే స్నానం మిమ్మల్ని నిద్రనుంచి ఉత్సహపరుస్తుంది. మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తుంది. అయితే నిద్రను ప్రేరేపించడానికి, మీరు తప్పనిసరిగా రాత్రి స్నానం చేయాలి. స్నానం మీ శరీరాన్ని చల్లబరుస్తుంది. మీకు మంచి నిద్ర కోసం దోహదం చేస్తుంది. రాత్రిపూట స్నానం చేయడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. రోజంతా శరీరం వేడిగా ఉంటుంది. దానికి చెక్ పెట్టాలంటే రాత్రిపూట స్నానం చేయడం చాలా ముఖ్యం.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..