Watch Video: పులినే పరిగెత్తించాలనుకున్న ఎలుగుబంటి.. కానీ, చివర్లో ఊహించని ట్విస్ట్.. వీడియో చూస్తే అవాక్కే..!
ఊహించిన ఈ ఘటనతో పులి ఏమాత్రం బెదరలేదు. అంతే ఠీవిగా నిల్చొని ఉంది. ఆ తర్వాత ఆ ఎలుగుబంటి తిరిగి పొదల్లోకి వెళ్లిపోయింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అయితే ఈ సంఘటన చూస్తున్న ప్రేక్షకులు కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ రవి గుప్తా ఈ వీడియోను షేర్ చేస్తూ.. పులి, ఎలుగుబంటి మధ్య అరుదైన ఘర్షణ దృశ్యమని పేర్కొన్నారు.
ఎలుగుబంటిని అత్యంత సోమరి జంతువుగా పిలుస్తారు. అయితే ఎలుగుబంటి పులిని అధిగమించగలదంటూ ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా పులి, ఎలుగుబంటి మధ్య ఎలాంటి ఘర్షణ జరగదు. గతంలో కూడా ఇలా జరిగిన దాఖలాలు తక్కువే. అయితే ఈ రెండు ఎదురుపడినప్పుడు జరిగిన అరుదైన ఘర్షణకు సంబంధించి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఉత్తర ప్రదేశ్‌లోని పిలిభిత్ టైగర్ రిజర్వ్‌లో జరిగిన సంఘటన తెలిసింది. అటవీ ప్రాంతంలోని దారి మార్గంలో ఒక పులి షికారు చేస్తుండగా, సఫారీ వాహనంలో ఉన్న పర్యాటకులు ఆ పులిని ఆసక్తిగా చూశారు. అయితే, శాకాహారులు, మాంసాహారులు ఒకరికొకరు ఎదురుపడినప్పుడు, కడుపు నింపుకోవడం కోసం వేటాడే జంతువు మధ్య జీవన్మరణ పోరాటం ప్రారంభమవుతుంది. అయితే ఎదురైన రెండు జంతువులు మాంసాహారులైతే? వీరిద్దరిలో ఎవరు గెలుస్తారు? మీరు ఈ వీడియోలో చూడండి.
ఎలుగుబంటి, ఇతర జంతువుల పోరాటాల వీడియోలను సోషల్ మీడియాలో మనం చాలానే చూసి ఉంటాం. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియో జనాలను తమ కళ్లను తామే నమ్మకుండా చేస్తోంది. అందులో ఎలుగుబంటి, సింహం ఎదురెదురుగా వస్తుంటాయి. కానీ ఆశ్చర్యకరంగా ఇద్దరూ ఒకరినొకరు అస్సలు తాకరు. ఈ వీడియో రిటైర్డ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారి డా. రవి గుప్తా ఎక్స్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. వీడియోలో గంభీరమైన పులి, ఎలుగుబంటి ముఖాముఖిగా ఎదురుపడ్డాయి. అప్పుడు రెండు జంతువుల మధ్య ఏం జరుగుతుందోనని జీపులో ఉన్న పర్యాటకులు దూరం నుండి చూస్తున్నారు.
పులికి ఎదురుగా వచ్చిన ఎలుగుబంటి పొదల్లోంచి బయటకు వచ్చింది. పులి ముందు నుంచి దారి మార్గాన్ని దాటి వెళ్లింది. ఎలుగుబంటి వెళ్లిన పొదల వైపు పులి తొంగి చూసింది. ఆ తర్వాత పక్కకు వెళ్లింది. అయితే తిరిగి వెనక్కి వచ్చిన ఎలుగుబంటి ఉన్నట్టుండి పులి మీద దాడి చేసేందుకు ముందుకు దూకింది. ఊహించిన ఈ ఘటనతో పులి ఏమాత్రం బెదరలేదు. అంతే ఠీవిగా నిల్చొని ఉంది. ఆ తర్వాత ఆ ఎలుగుబంటి తిరిగి పొదల్లోకి వెళ్లిపోయింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అయితే ఈ సంఘటన చూస్తున్న ప్రేక్షకులు కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు.
A rarest of rare sight of a bear charging towards a tigress, captured today at Pilibhit Tiger Reserve- A CATS( Conservation Assured Tiger Standards) habitat developed assiduously by UP Forest Department. Pl don’t miss the calm and composure of Big Cat even in face of attack &… pic.twitter.com/jU48UWpTqJ
— Dr Rajiv Kumar Gupta IAS (Retd) (@drrajivguptaias) April 30, 2024
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ రవి గుప్తా ఈ వీడియోను షేర్ చేస్తూ.. పులి, ఎలుగుబంటి మధ్య అరుదైన ఘర్షణ దృశ్యమని పేర్కొన్నారు. ఎలుగుబంటి భయంతో దాడికి ప్రయత్నించినప్పటికీ బెదరని పులి ప్రశాంతత కోల్పోలేదని అన్నారు.. ‘మానవులకు ప్రకృతి ఎన్నో పాఠాలు నేర్పుతుంది’ అని క్యాప్షన్‌లో రాసుకొచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, దీనిపై ప్రజలు భిన్నమైన స్పందనలు తెలియజేస్తున్నారు. ఈ వీడియోకు వేల సంఖ్యలో లైక్‌లు, షేర్లు వస్తున్నాయి. దీనిపై జనాలు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..