Viral Video: నిద్రపోయిన స్టేషన్‌ మాస్టర్‌.. అరగంట నిలిచిపోయిన రైలు

Viral Video: నిద్రపోయిన స్టేషన్‌ మాస్టర్‌.. అరగంట నిలిచిపోయిన రైలు

Anil kumar poka

|

Updated on: May 09, 2024 | 2:10 PM

అసలే వేసవికాలం..ఎండలు మండిపోతున్నాయి. ఇంటినుంచి జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు. వాతావరణం ఎలా ఉన్నా ఉద్యోగులు తమ విధులు తప్పక నిర్వర్తించాలి. ఇక ఈ వేసవి సమయంలో కడుపులో కాస్త ఆహారం పడగానే నిద్ర ముంచుకొచ్చేస్తుంది. అలా విధుల్లో ఉన్న ఓ స్టేషన్‌ మాస్టర్‌కి నిద్ర ముంచుకురావడంతో పాపం రైలు వచ్చిన సంగతే అతను గమనించలేదు. అరగంటపాటు పట్టాలపై ట్రైన్‌ నిలిచిపోయింది.

అసలే వేసవికాలం..ఎండలు మండిపోతున్నాయి. ఇంటినుంచి జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు. వాతావరణం ఎలా ఉన్నా ఉద్యోగులు తమ విధులు తప్పక నిర్వర్తించాలి. ఇక ఈ వేసవి సమయంలో కడుపులో కాస్త ఆహారం పడగానే నిద్ర ముంచుకొచ్చేస్తుంది. అలా విధుల్లో ఉన్న ఓ స్టేషన్‌ మాస్టర్‌కి నిద్ర ముంచుకురావడంతో పాపం రైలు వచ్చిన సంగతే అతను గమనించలేదు. అరగంటపాటు పట్టాలపై ట్రైన్‌ నిలిచిపోయింది. ఆ తర్వాత అధికారులకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. అధికారుల వివరాల ప్రకారం.. పట్నా- కోటా మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌ రైలు మే 3న ఉడిమోర్‌ జంక్షన్‌కు చేరుకుంది. అయితే.. అప్పటికే అక్కడున్న స్టేషన్‌ మాస్టర్‌ నిద్రలోకి జారుకున్నాడు.

మరోవైపు గ్రీన్‌ సిగ్నల్‌ లేకపోవడంతో రైలును లోకోపైలట్‌ అక్కడే నిలిపేశాడు. స్టేషన్ మాస్టర్‌ను మేల్కొలిపేందుకు లోకోపైలట్‌ అనేక సార్లు హారన్ కొట్టినా ఫలితం లేదు. దాంతో రైలు పట్టాలపై అరగంటపాటు నిలిచిపోయింది. దీంతో ఆ రైలులోని ప్రయాణికులు అసహనానికి గురైయ్యారు. విధుల్లో నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిన ఆగ్రా డివిజన్ రైల్వే అధికారులు.. స్టేషన్ మాస్టర్‌నుంచి వివరణ కోరారు. అనంతరం తగు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఆగ్రా రైల్వే డివిజన్ పీఆర్‌వో ప్రశస్తి శ్రీవాస్తవ వెల్లడించారు. స్టేషన్ మాస్టర్ తన తప్పును అంగీకరించాడని, తప్పిదానికి క్షమాపణ చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తనతోపాటు డ్యూటీలో ఉన్న పాయింట్‌మెన్ ట్రాక్ తనిఖీకి వెళ్లడంతో.. తాను స్టేషన్‌లో ఒంటరిగా ఉన్నట్లు తెలిపాడని వెల్లడించాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.