Paneer: మీరు తినే పన్నీర్‌ అసలైనదేనా..? తెలుసుకోవడం ఎలా..?

నిత్యం తినే ఆహార పదార్థాల్లో ఏవి కల్తీవో, ఏవి అసలైనవో తెలుసుకోవడం చాలా కష్టం. వాటి ప్రభావం మన ఆరోగ్యంపై తీవ్రంగా చూపుతుంది. అందులోనూ ప్రస్తుతం సమాజంలో పాల ఉత్పత్తులు, పాల పదార్థాల్లో చాలా వరకు నకిలీవి రాజ్యమేలుతున్నాయి. అందులో పన్నీర్ కూడా ఒకటి. పన్నీర్ అంటే తెలియని వారు ఉండరు. రోటీలోకి నంజుకునే పన్నీర్ బట్టర్ మసాలా మొదలు కబాబ్స్ లో తినే పన్నీర్ టిక్కా వరకు అందరూ చూడటమే కాదు, రుచి కూడా చూసి ఉంటారు.

Paneer: మీరు తినే పన్నీర్‌ అసలైనదేనా..? తెలుసుకోవడం ఎలా..?

|

Updated on: May 09, 2024 | 2:18 PM

నిత్యం తినే ఆహార పదార్థాల్లో ఏవి కల్తీవో, ఏవి అసలైనవో తెలుసుకోవడం చాలా కష్టం. వాటి ప్రభావం మన ఆరోగ్యంపై తీవ్రంగా చూపుతుంది. అందులోనూ ప్రస్తుతం సమాజంలో పాల ఉత్పత్తులు, పాల పదార్థాల్లో చాలా వరకు నకిలీవి రాజ్యమేలుతున్నాయి. అందులో పన్నీర్ కూడా ఒకటి. పన్నీర్ అంటే తెలియని వారు ఉండరు. రోటీలోకి నంజుకునే పన్నీర్ బట్టర్ మసాలా మొదలు కబాబ్స్ లో తినే పన్నీర్ టిక్కా వరకు అందరూ చూడటమే కాదు, రుచి కూడా చూసి ఉంటారు. ప్రస్తుతం దోశలో కూడా పన్నీర్ బటర్ మసాలా దోశ అంటూ కొత్త రుచిని అందిస్తున్నాయి కొన్ని హూటల్స్. అయితే ఈ పన్నీర్ మంచిదేనా, కల్తీదా అనేది కనుక్కోవడం చాలా కష్టం అని భావిస్తుంటారు చాలా మంది. అయితే సింపుల్‌ చిట్కాలతో మీ ఇంట్లోనే పన్నీర్‌ అసలుదా..నకిలీదా తేల్చేయవచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.

నిజమైన పన్నీర్, డూప్లికేట్ పన్నీర్ కు మధ్య ఉంటే వ్యత్యాసం ఏంటంటే ఒరిజినల్ పన్నీర్ వాసన చూస్తే చాలా మంచి పాల వాసన వస్తుంది. కొద్దిగా తుంచి రుచి చూస్తే పాల రుచిని తలపిస్తుంది. డూప్లికేట్ అయితే రబ్బర్ లాగా సాగుతూ ఉంటుంది. అలాగే కొద్దిగా పనీర్‌ను ఒక పాత్రలోకి తీసుకుని నీరు పోసి వేడి చేయండి. అందులో నాలుగైదు చుక్కల అయోడిన్‌ వేయండి. పనీర్‌ నీలం రంగులోకి మారితే అది కల్తీ అని అర్థం. అసలైన పనీర్‌ అయితే రంగు మారదు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
Latest Articles