Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fall in Love : ప్రేమలో పడితే ఈ మూడు విషయాలు కోల్పోతారంట..! ఎందుకో కారణాలు తెలుసుకోండి..?

Fall in Love : ప్రేమ ప్రతి ఒక్కరిలో ఉండే ఫీలింగ్. ఇది ఎవ్వరిలోనైనా ఎప్పుడైన కలగవచ్చు. ప్రేమించుకునే జంటలకు కొదువేలేదు.

Fall in Love : ప్రేమలో పడితే ఈ మూడు విషయాలు కోల్పోతారంట..! ఎందుకో కారణాలు తెలుసుకోండి..?
Fall In Love
Follow us
uppula Raju

| Edited By: Phani CH

Updated on: May 26, 2021 | 7:05 AM

Fall in Love : ప్రేమ ప్రతి ఒక్కరిలో ఉండే ఫీలింగ్. ఇది ఎవ్వరిలోనైనా ఎప్పుడైన కలగవచ్చు. ప్రేమించుకునే జంటలకు కొదువేలేదు. ఆక్సీటోసిన్, వాసోప్రెస్సిన్ వంటి హార్మోన్లు ప్రేమను ఎక్కువ కాలం నిలుపుకోవడానికి సహాయం చేస్తాయట. వీటి కారణంగా ప్రేమ పుట్టేందుకు ఎక్కువ అవకాశం ఉంటుదట. ఒక వ్యక్తికి ప్రేమ పుట్టడానికి కేవలం సెకన్లో ఐదో వంతు సమయం సరిపోతుందట. ఇది సైన్స్ ప్రకారం నిరూపించబడింది. అయితే ప్రేమలో పడేంత వరకు బాగానే ఉంటుంది.. పడ్డాకే అసలు కథ మొదలవుతుంది. కొంతమంది నిపుణుల అధ్యయనం ప్రకారం ప్రేమలో పడిన వ్యక్తులు ఈ మూడు విషయాలను వారికి తెలియకుండానే కోల్పోతున్నారని తెలిసింది. ఈ విషయంలో వారికి బాగానే ఉన్నా ఇతరుల నుంచి మాత్రం చివాట్లు తప్పవు.

1. ఆకలి, నిద్ర తెలియదట.. ప్రేమలో పడిన కొత్తలో చాలా మందికి ఆకలి తెలియదట. అంతే కాదు నిద్ర పట్టే అవకాశం కూడా తక్కువని చెబుతుంటారు. ఇదంతా నిజమేనని తాజా అధ్యయనంలో తేలింది. ప్రేమలో ఉన్న సమయంలో డోపమైన్, నోర్ పైన్ ఫ్రైన్ హార్మోన్లు విడుదల అవ్వడం వల్ల ఓ వ్యక్తికి ఎక్కువ సంతోషం, ఉత్సాహం పెరుగుతాయట. దీంతో ఆకలి, నిద్ర పోవాలని ఆశ తగ్గిపోతాయట. ఎప్పుడేం చేస్తారో వారికే తెలియదట.

2. అలవాట్లలో మార్పులు.. ప్రేమలో పడిన వారిలో వారికి తెలియకుండానే చాలా మార్పులు వస్తుంటాయట. ముఖ్యంగా వారి చూపులు డ్రస్సులు, ప్రవర్తన పూర్తిగా మారిపోతుందట. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారట. ఒక వ్యక్తి ప్రేమలో పడ్డాడని తెలుసుకునేందుకు అతడి అలవాట్లను గమనిస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రేమ ఆ వ్యక్తి జీవితంలోని భావోద్వేగాలకు మంచి ఉపశమనంగా మారుతుందట.

3. కేరింగ్ ఎక్కువ.. ప్రేమలో ఉండే వారు తమ భాగస్వామి నుంచి ఎక్కువ కేరింగ్ కోరుకుంటారు. అంతేకాదు పొగడ్తలను, గిఫ్టుల వంటిని కోరుకుంటారు. ప్రతి చిన్న విషయానికీ థ్యాంక్స్ చెబుతుంటారు. ప్రేమలో పడిన వారిలో గ్రాటిట్యూడ్ కూడా బాగా పెరుగుతుందట. ఒకరినొకరు గౌరవించుకోవడం, మెచ్చుకోవడం చేస్తుంటారు. చేసే పని మీద ధ్యాస పెట్టకుండా నిత్యం వారి గురించే ఆలోచిస్తారు.

Oxygen Trees: ఈ ఐదు మొక్కలు రాత్రిపూట ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి.. అనేక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి..

Kishan Reddy Coments : ఈటల ఎపిసోడ్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ.. హుజురాబాద్ ఉప ఎన్నిక గురించి ఏం చెప్పారంటే..?

Jaggareddy on Etela : బహిష్కృత మంత్రి ఈటల రాజేందర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..