ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి.. ఏం చేయకూడదు..! ఏవి సరైనవి.. ఏవి సరికానివి.. తెలుసుకోండి..
Health Confusion : చాలామంది ఆరోగ్యంగా ఉండటానికి రోజు10 వేల అడుగులు నడవాలని సలహా ఇస్తారు. కానీ ఈ సంఖ్య సరైనది
Health Confusion : చాలామంది ఆరోగ్యంగా ఉండటానికి రోజు10 వేల అడుగులు నడవాలని సలహా ఇస్తారు. కానీ ఈ సంఖ్య సరైనది కాదు. ఇది ఎక్కడా నిరూపించబడలేదు. కారణం ఏంటంటే ఈ సంఖ్య అందరికీ సమానంగా సరిపోదు. 20 ఏళ్ళ వయస్సులో 10 వేల అడుగులు తక్కువ. అదే 60 ఏళ్ల వయసుకు ఇది చాలా ఎక్కువ. హార్వర్డ్ మెడికల్ స్కూల్ ఆఫ్ అమెరికా పరిశోధన ప్రకారం..ఎవ్వరైనా సరే సగటున 5500 అడుగులు నడిస్తే సరిపోతుందని స్పష్టం చేసింది.
1.ఆరోగ్యంగా ఉండటానికి మీకు 8 గంటల నిద్ర అవసరమా? రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి, మధుమేహం, గుండె వ్యాధులను నివారించడానికి తగినంత నిద్ర అవసరం. అయితే రోజూ ఎన్ని గంటలు నిద్ర అవసరం అనేది మీ శరీర అవసరాలపై ఆధారపడి ఉంటుంది. నేషనల్ స్లీప్ ఫౌండేషన్ అధ్యయనం ప్రకారం రోజుకు 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం.
2. రోజూ 8 గ్లాసుల నీరు తాగడం అవసరమా? శరీరానికి నీరు త్రాగటం చాలా ముఖ్యం కానీ ఇది మీరు ఎలాంటి వాతావరణంలో నివసిస్తున్నారు. మీరు ఎలాంటి శారీరక శ్రమ చేస్తారు. ఎంత బరువు, చెమట మీద ఆధారపడి ఉంటుంది. అలాగే మనం రోజువారీ నీటితో పాటు టీ, కాఫీ, రసం, పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకుంటాం. కనుక కచ్చితంగా రోజూ 8 గ్లాసుల నీరు తాగడం అనవసరం.
3. రోజూ ఐదు భాగాల పండ్లు, కూరగాయలు తినడం అవసరమా? రోజుకు ఐదు పండ్లు, కూరగాయలు కచ్చితంగా తీసుకోనవసరం లేదు. 800 గ్రాముల కూరగాయలు, రెండు మూడు పండ్లు తినడం వల్ల శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది.
4. తక్కువ కాంతిలో చదవడం వల్ల కంటి సమస్యలు వస్తాయా..? తక్కువ కాంతి లేదా మధ్యస్థ కాంతిలో చదవడం, రాయడం మీకు కష్టమవుతుంది. ఇలా చేస్తే కళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. కానీ కాలేజ్ ఆఫ్ ఆప్టోమెట్రిస్ట్ ప్రకారం.. తక్కువ కాంతి, చీకటిలో చదవడం కళ్ళకు హాని కలిగించదని చెబుతోంది.