Beauty Tips: కలబందను ఇలా ఉపయోగిస్తే.. మొటిమలు సులభంగా తొలగిపోతాయి.. ఎలా వాడాలంటే..

Aloe Vera Benefits: మెరుస్తున్న చర్మం, అందమైన ముఖం కోసం చాలా రకాల ప్రయాత్నాలు చేస్తుంటారు చాలా మంది అమ్మాయిలు. ఇక ముఖంపై ఏర్పడే

Beauty Tips: కలబందను ఇలా ఉపయోగిస్తే.. మొటిమలు సులభంగా తొలగిపోతాయి.. ఎలా వాడాలంటే..
Aloe Vera Jel
Follow us
Rajitha Chanti

|

Updated on: May 25, 2021 | 1:08 PM

Aloe Vera Benefits: మెరుస్తున్న చర్మం, అందమైన ముఖం కోసం చాలా రకాల ప్రయాత్నాలు చేస్తుంటారు చాలా మంది అమ్మాయిలు. ఇక ముఖంపై ఏర్పడే చిన్న చిన్న మొటిమలను తగ్గించుకోవడానికి అనేక రకాల కెమికల్ ప్రోడక్ట్స్ వాడుతుంటారు. దీంతో సమస్య తగ్గగకపోగా.. మరింత పెద్దదిగా మారుతుంటుంది. మార్కెట్లో దొరికే కెమికల్ ప్రోడక్ట్స్ వాడడం వలన చర్మ సమస్యలు రావడమే కాకుండా…. ముఖంపై మొటిమలు మరింత పెద్దగా మారే ఛాన్స్ ఉంటుంది. అయితే వాటిని సహజ పద్ధతిలోనే తగ్గించుకోవచ్చు. ఇందుకోసం కలబంద ఎక్కువగా సహయపడుతుంది. ఈ వేసవిలో కలబంద చర్మ సంరక్షణకు మంచింది.

ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది మొటిమలను, చర్మ సమస్యలను తగ్గిస్తుంది. అలాగే పొడి చర్మం, మొటిమల సమస్యలు ఉంటే కలబంద జెల్ ఉపయోగిస్తే సరి. ఇది చర్మాన్ని హైడ్రేటెడ్, తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. కలబంద అనేది చర్మానికి పోషకాలను ఇచ్చే సహజమైన తేమ. పొడి చర్మం ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

వేసవిలో చర్మ సంరక్షణకు మాత్రమే కాకుండా.. సూర్యరశ్మి నుంచి కాపాడుతుంది. స్కీన్ ఎర్రగా మారడం.. దురద వంటి సమస్యలను కలబంద తగ్గిస్తుంది. అలాగే కలబంద మంటను తగ్గిస్తుంది. కలబందలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది మొటిమలను తగ్గించడానికి సహయపడుతుంది. అలాగే చర్మంపై ఉండే జిడ్డు నూనెను తగ్గిస్తుంది. అలాగే స్కీన్ నిత్యం తేమగా ఉండేలా చేస్తుంది.

Also Read: రెమ్యునరేషన్ భారీగా పెంచిన పాన్ ఇండియా డైరెక్టర్.. ఎన్టీఆర్ సినిమా కోసం ప్రశాంత్ నీల్ అంత తీసుకుంటున్నాడా ?

మహేశ్ సినిమా కోసం రూటు మార్చుకున్న డైరెక్టర్.. సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ రోల్ అలా ఉండబోతుందా ?

Vaccination Rules: మారిన టీకా నిబంధనలు..ఇకపై ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ఉండవు..వ్యాక్సిన్ కేంద్రంలోనే నమోదు

Corona Medicine: కరోనాను అణిచివేసే కొత్త మందు..ఎలుకల్లో చేసిన ప్రయోగాలు సక్సెస్..శుభవార్త చెప్పిన శాస్త్రవేత్తలు