Vaccination Rules: మారిన టీకా నిబంధనలు..ఇకపై ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ఉండవు..వ్యాక్సిన్ కేంద్రంలోనే నమోదు

Vaccination Rules: టీకా నియమాలను ప్రభుత్వం మార్చింది. ఇది 18-44 వయస్సు గల ప్రజలకు గణనీయమైన ఉపశమనం కలిగిస్తుంది. ఈ వయస్సు వారికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ఉండవు.

Vaccination Rules: మారిన టీకా నిబంధనలు..ఇకపై ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ఉండవు..వ్యాక్సిన్ కేంద్రంలోనే నమోదు
Vaccination Rules
Follow us
KVD Varma

|

Updated on: May 24, 2021 | 6:26 PM

Vaccination Rules: టీకా నియమాలను ప్రభుత్వం మార్చింది. ఇది 18-44 వయస్సు గల ప్రజలకు గణనీయమైన ఉపశమనం కలిగిస్తుంది. ఈ వయస్సు వారికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ఉండవు. కొత్త నిబంధన ప్రకారం, ఈ వయసు గ్రూపు వ్యక్తులు టీకా కేంద్రాలలో నమోదు చేసుకొని అపాయింట్‌మెంట్ పొందగలుగుతారు. ఈ సదుపాయాన్ని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ టీకా కేంద్రాల్లో అందించనున్నారు. కేంద్రం ఈ నోటిఫికేషన్లను అన్ని రాష్ట్రాలకు పంపించి, రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని ఆన్-సైట్లో ప్రారంభించాలని కోరింది. ఈ సదుపాయాన్ని వారు స్వయంగా ప్రారంభిస్తారా లేదా అనేది రాష్ట్రాలదే తుది నిర్ణయం అని కూడా ఆ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

వృధా అరికట్టడానికే.. వాస్తవానికి అనేక విభాగాల ప్రజలు రాష్ట్రాల నుంచి టీకా కోసం ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారు. వారిలో చాలా మంది టీకా సెంటర్ కు చేరడం లేదు. దీంతో ఆ సమయంలో ఇచ్చిన టీకా స్లాట్ వల్ల వ్యాక్సిన్ వృధా అయిపోతుంది. దాంతో టీకా వ్యర్థాల కేసులు పెరుగుతున్నాయి. ఈ నివేదికల ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇది కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఈ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఆఫీసుల్లో టీకాలు.. అంతకుముందు శనివారం, కేంద్ర ప్రభుత్వం టీకాపై ఒక అడుగు ముందుకు వేసింది. ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాల్లో వ్యాక్సిన్ ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోని ఉద్యోగులతో పాటు వారి కుటుంబాలకు కూడా టీకాలు వేయగలుగుతారు. దీనివలన ఎక్కువ మందికి టీకాలు వేయడానికి, కంపెనీలు తయారీదారుల నుండి నేరుగా ఆసుపత్రుల ద్వారా వ్యాక్సిన్లను కొనుగోలు చేసుకునే అవకాశం లభిస్తుంది.

ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం, 21.80 కోట్లకు పైగా టీకా మోతాదు రాష్ట్రాలకు ఇచ్చారు. భారత ప్రభుత్వం ఇప్పటివరకు 21.80 కోట్లకు పైగా కోవిడ్ వ్యాక్సిన్‌ను రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు అందించింది. ప్రస్తుతం 1.80 కోట్లకు పైగా వ్యాక్సిన్ మోతాదులు ఇప్పటికీ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో అందుబాటులో ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 18 నుంచి 44 సంవత్సరాల వయస్సు గల కోటి మందికి పైగా కరోనా వ్యాక్సిన్‌తో టీకాలు వేశారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ వయస్సు గలవారికి ఇప్పటి వరకు ఒక కోటి 6 లక్షల 21 వేల 235 మోతాదులు ఇవ్వబడ్డాయి. టీకా డ్రైవ్ మూడవ దశ కింద మే 1 నుంచి ఈ వయసు వారికి టీకాలు వేయడం ప్రారంభించారు.

Also Read: Foods In Refrigerator: వీటిని ఫ్రిజ్‌లో పెడుతున్నారా.? అయితే డేంజరే.! ఏవి పెట్టాలో తెలుసుకోండి.!

Corona Medicine: కరోనాను అణిచివేసే కొత్త మందు..ఎలుకల్లో చేసిన ప్రయోగాలు సక్సెస్..శుభవార్త చెప్పిన శాస్త్రవేత్తలు

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే