Antibody Cocktail: కరోనా కోసం కొత్త మందు..యాంటీ బాడీ కాక్‌టెయిల్‌..దీంతో ఇమ్యునైజేషన్ పెరుగుతుందట..ఖరీదు ఎంతంటే..

Antibody Cocktail: కోరనా విరుచుకుపడుతుంటే ప్రజలు కకావికలు అవుతున్నారు. వైద్యం విషయంలో ఎన్నో తిప్పలు పడుతున్నారు. టీకా కరోనా పాలిట బ్రహ్మాస్త్రం అని చెబుతున్నా.. ఇప్పటివరకూ పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు.

Antibody Cocktail: కరోనా కోసం కొత్త మందు..యాంటీ బాడీ కాక్‌టెయిల్‌..దీంతో ఇమ్యునైజేషన్ పెరుగుతుందట..ఖరీదు ఎంతంటే..
Antibody Cocktail
Follow us

|

Updated on: May 24, 2021 | 6:38 PM

Antibody Cocktail: కోరనా విరుచుకుపడుతుంటే ప్రజలు కకావికలు అవుతున్నారు. వైద్యం విషయంలో ఎన్నో తిప్పలు పడుతున్నారు. టీకా కరోనా పాలిట బ్రహ్మాస్త్రం అని చెబుతున్నా.. ఇప్పటివరకూ పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. మరోవైపు కరోనా రెండో వేవ్ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయింది. ప్రజలపై మరణశాసనం రాస్తోంది. ఇక త్వరలో మూడో వేవ్ కూడా వస్తుందని అంటున్నారు. ఈ నేపధ్యంలో ప్రజల్లో భయాందోళనలు పెరిగిపోతున్నాయి. రెండో వేవ్ లో ఆక్సిజన్ కొరత తో దేశవ్యాప్తంగా వేలాది మంది మరణించారు. అదేవిధంగా పడకలు దొరకక కోవిడ్ సోకిన వారికి వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. దీంతో కరోనా సోకితే తగ్గించడానికి ఏదైనా మంచి మందు దొరికితే బావుండునని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అనేక మందులపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. తాజాగా యాంటీ బాడీ కాక్‌టెయిల్‌ పేరు కరోనా మందుల లిస్టులో వినిపిస్తోంది.

యాంటీ బాడీ కాక్‌టెయిల్‌ అంటే ఏమిటి?

యాంటీబాడీ కాక్టెయిల్ (కాసిరివిమాబ్ మరియు ఇమ్డేవిమాబ్) ఒక వైద్య ఉత్పత్తి. అనాఫిలాక్సిస్ వంటి ఇన్ఫ్యూషన్ ప్రతిచర్యకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ఇది వాడితే కరోనా రోగుల్లో ఇమ్యునైజేషన్ పెరుగుతుంది. అందువల్ల ఆసుపత్రికి వెళ్ళే పరిస్థితి రాకుండా ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండడం ద్వారా కరోనా నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు. దీనిని ఇంట్రా వీనస్ అంటే నరాలలోకి ఎక్కిస్తారు. దీనికి 20 నుంచి 30 నిమిషాల సమయం పడుతుంది. ఒకేసారి పొట్ట లేదా తొడలోని నాలుగు వేరు వేరు ప్రాంతాల్లోని నరాలకు ఒకేసారి ఈ ఇంజక్షన్ ఇస్తారు. ఒక్కో ఇంజక్షన్ 1,200 mg ఉంటుంది. వీటిలో రెండు కాసిరివిమాబ్, రెండు ఇమ్డేవిమాబ్ ఉంటాయి. ఈ ఇంజక్షన్ ఇచ్చిన తరువాత కనీసం గంట పాటు పేషెంట్ వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుంది. ఈ ఇంజక్షన్లను 2 డిగ్రీల నుంచి 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో నిలువ చేయాల్సి ఉంటుంది. ఈ ఇంజక్షన్ ఖరీదు 59,750 రూపాయలుగా నిర్ణయించారు. భారత్‌లో సిప్లా కంపెనీ దీనిని పంపిణీ చేస్తోంది.

దీనిని ఉత్పత్తి చేస్తున్న రోచె ఇండియా అలాగే సిప్లా లిమిటెడ్ సంయుక్త ప్రకటనలో, యాంటీబాడీ కాక్టెయిల్ యొక్క మొదటి బ్యాచ్ – కాసిరివిమాబ్ మరియు ఇమ్దేవిమాబ్ – ఇప్పుడు భారతదేశంలో లభిస్తున్నట్టు తెలిపాయి. రెండవ బ్యాచ్ జూన్ మధ్య నాటికి అందుబాటులో ఉంటుంది. ప్రతి రోగి మోతాదుకు, 1,200 మి.గ్రా (600 మి.గ్రా కాసిరివిమాబ్ మరియు 600 మి.గ్రా ఇమ్దేవిమాబ్) కలిపి, అన్ని పన్నులతో కలిపి 59,750 రూపాయలు ఉంటుందని వెల్లడించాయి.

Also Read: Vaccination Rules: మారిన టీకా నిబంధనలు..ఇకపై ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ఉండవు..వ్యాక్సిన్ కేంద్రంలోనే నమోదు

Corona Medicine: కరోనాను అణిచివేసే కొత్త మందు..ఎలుకల్లో చేసిన ప్రయోగాలు సక్సెస్..శుభవార్త చెప్పిన శాస్త్రవేత్తలు

ఎవరూ ఊహించని ప్లేస్‌లో గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్‌ఈవెంట్..
ఎవరూ ఊహించని ప్లేస్‌లో గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్‌ఈవెంట్..
అమెరికా ఏమాత్రం సరితూగలేనంత బంగారం మనదేశంలో..!
అమెరికా ఏమాత్రం సరితూగలేనంత బంగారం మనదేశంలో..!
వీరికి దూరంగా ఉండండి.. లేకపోతే మీ జీవితం నాశనం అవ్వడం ఖాయం..!
వీరికి దూరంగా ఉండండి.. లేకపోతే మీ జీవితం నాశనం అవ్వడం ఖాయం..!
'టెట్‌' ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. కారణం ఇదే!
'టెట్‌' ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. కారణం ఇదే!
పచ్చిది ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. ఇది తెలిస్తే మైండ్ బ్లాంకే..
పచ్చిది ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. ఇది తెలిస్తే మైండ్ బ్లాంకే..
Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..
Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి