Post Corona symptoms: క‌రోనా నుంచి కోలుకున్నా ఈ ల‌క్ష‌ణాలు వెంటాడుతూనే ఉన్నాయి.. కొన్ని సార్లు నెల‌లు గ‌డిచినా..

Post Corona symptoms: కంటికి క‌నిపించ‌ని ఓ వైర‌స్ యావ‌త్ ప్ర‌పంచాన్ని అత‌లాకుతలం చేసేస్తోంది. ప్ర‌జ‌ల ఆరోగ్యాల‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేస్తోందీ మాయ‌దారి రోగం. క‌రోనా బారిన ప‌డిన‌వారు క్ష‌ణాల్లో ఆక్సిజ‌న్...

Post Corona symptoms: క‌రోనా నుంచి కోలుకున్నా ఈ ల‌క్ష‌ణాలు వెంటాడుతూనే ఉన్నాయి.. కొన్ని సార్లు నెల‌లు గ‌డిచినా..
Corona Post Symptoms
Follow us
Narender Vaitla

|

Updated on: May 24, 2021 | 7:05 PM

Post Corona symptoms: కంటికి క‌నిపించ‌ని ఓ వైర‌స్ యావ‌త్ ప్ర‌పంచాన్ని అత‌లాకుతలం చేసేస్తోంది. ప్ర‌జ‌ల ఆరోగ్యాల‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేస్తోందీ మాయ‌దారి రోగం. క‌రోనా బారిన ప‌డిన‌వారు క్ష‌ణాల్లో ఆక్సిజ‌న్ అంద‌క ప్రాణాలు వ‌దులుతున్న సంఘ‌ట‌న‌లు తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ఇదిలా ఉంటే క‌రోనా సోకిన స‌మ‌యంలో ద‌గ్గు, జ‌లుబు, త‌ల‌తొప్పి వంటి ఎన్నో ల‌క్ష‌ణాలు తీవ్రంగా బాధించిన విష‌యం తెలిసిందే. అయితే క‌రోనా నుంచి కోలుకున్న త‌ర్వాత కూడా కొన్ని ల‌క్ష‌ణాలు క‌నిపిస్తూనే ఉన్నాయి. ఇక ఇందులో కొన్ని ధీర్ఘ‌కాలంగా కొన‌సాగుతూనే ఉన్నాయి. క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత క‌రోనా నుంచి కోలుకున్న ప్ర‌తీ 10 మంది భార‌తీయుల్లో ఒక‌రు క‌రోనా జ‌యించిన త‌ర్వాత కూడా తీవ్ర ల‌క్ష‌ణాలు ఎదుర్కొంటున్న‌ట్లు గుర్తించారు. అలాంటి కొన్ని క‌రోనా ల‌క్ష‌ణాల‌పై ఓ లుక్కేయండి..

ఎడ‌తెరపి లేని ద‌గ్గు..

క‌రోనా బాధితుల్లో ఎక్కువ‌గా క‌నిపించే ల‌క్ష‌ణాల్లో ద‌గ్గు ప్రధాన‌మైంది. అయితే ఇది కొంద‌రిలో త‌క్కువ మోతాదులో ఉంటే మ‌రి కొంద‌రిలో తీవ్రంగా క‌నిపిస్తోంది. అయితే క‌రోనా నుంచి బ‌య‌ట ప‌డ్డ త‌ర్వాత కూడా ద‌గ్గు కొన‌సాగుతున్నట్లు గుర్తించారు.

ఒళ్లు నొప్పులు..

క‌రోనా సోకిన స‌మ‌యంలో చాలా మంది ఒళ్లు నొప్పులు స‌మ‌స్య‌తో బాధ‌పడే ఉంటారు. అయితే క‌రోనా నుంచి కోలుకున్న‌త‌ర్వాత కొన్ని నెల‌ల వ‌ర‌కు కూడా ఈ ల‌క్ష‌ణం కొన‌సాగుతూనే ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, కండ‌రాల నొప్పులు, త‌ల‌నొప్పి వంటి ల‌క్ష‌ణాలు దీర్ఘ‌కాలికంగా కొన‌సాగుతున్న‌ట్లు గుర్తించారు.

నిద్ర‌లేమి స‌మ‌స్య‌..

క‌రోనా నుంచి కోలుకున్న కొంద‌రిలో నిద్ర‌లేమి స‌మ‌స్య‌ను గుర్తించారు. క‌రోనా కార‌ణంగా ఏర్ప‌డే ఒత్తిడి, ఆందోళ కూడా నిద్ర‌లేమికి దారి తీస్తోంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. యోగా, మెడిటేష‌న్ వంటివి చేయ‌డం ద్వారా ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చ‌ని వైద్యులు సూచిస్తున్నారు.

కిడ్నీల‌పై ప్ర‌భావం..

అధ్య‌యనాల్లో తేలిన వివ‌రాల ప్ర‌కారం క‌రోనా కిడ్నీల‌పై కూడా ప్ర‌భావం చూపుతున్న‌ట్లు తేలింది. అంత‌కు ముందు ఎలాంటి కిడ్నీ స‌మ్య‌లు లేని వారికి కూడా కిడ్నీల ప‌నితీరు దెబ్బ‌తింటున్న‌ట్లు ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. క‌రోనా నుంచి కోలుకొని ర‌క్త‌పోటు, డ‌యాబెటిస్ వంటి స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డుతోన్న వారు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

కాళ్ల‌లో వాపు..

క‌రోనా నుంచి కోలుకున్న వారిలో కాళ్ల నొప్పులు, వాపు వంటి ల‌క్ష‌ణాలున్న వారు పెరుగుతున్న‌ట్లు ప‌రిశోధ‌కులు గుర్తించారు. అలాగే కొంద‌రిలో ర‌క్తం గ‌డ్డ‌క‌డుతున్న‌ట్లు కూడా తేలింది.

Also Read: Bamboo leaf tea: వెదురు ఆకులతో అదిరిపోయే ఛాయ్.. రుచి చాలా మ‌ధుర‌మ‌ట‌

Mini Human Heart: వైద్య రంగంలో మరో అద్భుతం.. ప్రపంచమే ఆశ్చర్యపోయేలా సరికొత్త ఆవిష్కరణ..

Vaccination Rules: మారిన టీకా నిబంధనలు..ఇకపై ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ఉండవు..వ్యాక్సిన్ కేంద్రంలోనే నమోదు

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..